Horoscope Today 16 September 2022: మేషం ( Aries): పూర్తి మిశ్రమకాలం. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు ఉన్నాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): శుభ సమయం నడుస్తోంది. అన్ని రంగాల వారికీ కలిసొస్తుంది. ముఖ్యంగా వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం మంచిది.


మిథునం (Gemini): చిత్తశుద్ధితో పని చేయాలి. ఆటంకాలు ఎదురైనా.. వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చరాదు. ఆరోగ్యంపై  శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. లక్ష్మీస్తుతి చదివితే మంచిది. 


కర్కాటకం (Cancer): అన్ని రంగాల వారికీ అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ఆలస్యం పనికిరాదు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంబించడం మంచిది. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. గోసేవ చేయడం శుభప్రదం.


సింహం (Leo): దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం నడుస్తోంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసిరానుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచిది.


కన్య (Virgo): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం చేయరాదు. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఓ విషయంలో మీ అంచనాలు తప్పుతాయి. ప్రయాణ సూచన ఉంది. ఆదిత్య హృదయం చదివితే మంచి జరుగుతుంది. 


తుల (Libra): చేపట్టే పనుల్లో అలసత్వం పనికిరాదు. కీలక పనుల్లో పెద్దల సలహాలు పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. కుటుంబంతో సరదాగా గడిపేందుకు ప్రయత్నించండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. 


వృశ్చికం (Scorpio): శుభకాలం నడుస్తోంది. అన్నింటిలో గొప్ప ఫలితాలను అందుకుంటారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్నిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించండి.


ధనస్సు (Sagittarius): భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఓర్పు అవసరం. ఆంజనేయ స్వామి సందర్శనం మంచిది.


మకరం (Capricorn): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. అనవసర ఆలోచనలు వద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ధైర్యంగా ఉండండి. అవసరం అయితే పెద్దల సలహాలు తీసుకోండి. ప్రయాణ సూచన ఉంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.


కుంభం (Aquarius): నూతనంగా చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమాయానికి డబ్బు చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి. కోపాన్ని దరిచేరనీయకండి. గోసేవ చేస్తే మంచిది.  


మీనం (Pisces): అనుకూల సమయం. అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులకు శుభకాలం. కీలకమైన పనులను నేడు పూర్తి చేయగలుగుతారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. కుటుంబంతో సరాదాగా గడుపుతారు. ప్రసన్నాంజనేయ సోత్ర పారాయణం మంచిది. 


Also Read: Chikni Chameli Song: క్లాస్ రూమ్‌లో చికినీ చమేలీ డాన్స్.. తరగతి గదిలో జంబల హాట్ షో


Also Read: Google Play Store: గూగుల్ నుంచి కొత్త ఫీచర్, ఇక నుంచి మీ డివైస్ సమీక్ష, రేటింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook