Horoscope Today 17 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 17న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మేషరాశి వారు ఈరోజు ఇతరులకు ఉపకారం చేస్తారు. ఇంట్లో అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆఫీసులో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు. మీ మాట, పని కారణంగా స్నేహపూర్వక వాతావారణం నెలకొంటుంది.


Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు


వృషభ రాశి
మీ కెరీర్ గురించి ఈ రోజు ఓ శుభవార్త అందుకుంటారు. దీని వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఉద్యోగులు అయితే మీకు ప్రమోషన్ లభించే సూచనలు గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సైతం అంతా శుభమే జరుగుతుంది. మీ పనితనం కారణంగానే ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది.


మిథున రాశి
అనవసర విషయాలలో తలదూర్చవద్దు. ఇతరులు వింటున్నారు కదా అని వారికి మీకు తెలిసిన అనవసర విషయాలు చెప్పరాదు. అలాంటి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. జీవిత భాగస్వామి తరఫు నుంచి అంతా మేలు జరుగుతుంది. భూములు లేదా వాహనాల కొనుగోలు సూచనలు కనిపిస్తున్నాయి.


కర్కాటక రాశి
ఆర్థిక సమస్యలు తీరనున్నాయి. సాయంత్రం దైవదర్శనానికి వెళతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విషయాలను క్రమబద్ధీకరించడానికి యోచిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోరాదు. పని ప్రదేశంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.


Also Read: Ram mandir donations: అయోధ్య రామాలయానికి 15 వందల కోట్లు దాటిన విరాళాలు


సింహ రాశి
మీ వృత్తిని మార్చాలని ఆలోచిస్తున్నారా? అయితే మార్పు అంతగా కలిసొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత కొంతకాలం నుంచి వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేసే సమయం ఇది. మీరు చేస్తున్న పనితో సంతృప్తి చెందుతారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రిమయైన వారితో ఏకాంతంగా సమయాన్ని గడుపుతారు.


కన్య రాశి
మీరు ఆఫీసులో కొత్త విషయాలు నేర్చుకుంటారు. కోపాన్ని మీరు నియత్రించుకోవాలి. లేకపోతే వివాదాలకు దారి తీస్తుంది. మీ నైపుణ్యాలు మెరుగు చేసుకుంటారు. దీనివల్ల ఇతరుల కన్నా మీరు ఉత్తమమని అందరికీ తెలుస్తుంది. ఇంట్లో సమస్యలను పరిష్కరమార్గాలు అన్వేషిస్తారు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. 


తులా రాశి
కొత్త లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగుతారు. మీరు చేసే పనివల్ల తగిన గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులు, ఉద్యోగులు నేడు విజయాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో కీలక విషయాలు చర్చిస్తారు. ఈరోజు ఆర్థికంగా ఏ సమస్య ఉండదు.


వృశ్చిక రాశి
చాలా కాలం తర్వాత మీకు ఇష్టమైన వ్యక్తిని కలుసుకుంటారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. నేడు ఆర్థికంగా మీకు లాభాలు కలగనున్నాయి. పనులు లేక యాత్రల పేరిట ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఏకాగ్రతగా వ్యవహరించి సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.


ధనస్సు రాశి
ఈరోజు మీకు కార్యజయం సిద్ధిస్తుంది. అయితే ఏ విషయంలోనూ అశ్రద్ధ వహించకూడదు. మీ పనులను చుట్టుపక్కల వారు నిశితంగా పరిశీస్తున్నారని మరవరాదు. కార్యాలయంలో మీ పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తారు. ఆర్థిక సమస్యలు తీరనున్నాయి.


Also Read: Art of living: రవిశంకర్‌‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం


మకర రాశి
మీ కెరీర్‌కు సంబంధించి మీకు ఫోన్ కాల్ రావచ్చు. వ్యాపారాలకు ప్రయోజనాలు, లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. వాహనాల విషయంలో అనవసర ఖర్చులు చికాకు పెడతాయి. ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు. ఆలయాలు సందర్శిస్తారు. ఓ శుభవార్తతో మీ సమస్యలు తీరతాయి.


కుంభ రాశి
అపరిచితులు మీకు ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు. ఈ అవకాశం చాలా ఉత్సాహంగా అనిపించవచ్చు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. పనిని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. భూముల కోనుగోలుకు ఆసక్తి ప్రదర్శిస్తారు.


మీన రాశి
ఈ రోజు పనిలో మీ మాట్లాడే సామర్థ్యం అధికంగా ఉంటుంది. మీరు చేయాల్సిన ప్రెజెంటేషన్లు, ఇంటర్వ్యూలు తీసుకోవాల్సి ఉంటుంది. నేడు దూర ప్రయాణాలు చేయనున్నారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇతరుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనులలో నిరాటంకంగా ముందుకు సాగుతారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook