Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 17, 2021 Rasi Phalalu,
Horoscope Today 17 March 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 17న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.
Horoscope Today 17 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 17న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీరు ఇప్పటికీ ఒక వ్యక్తిపై ఆధారపడుతున్నారా? అయితే ఇకనుంచి ఆ అలవాటు మానుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు కొన్ని విషయాలు కారణం కానున్నాయి. ఈ రోజు గురించి ఎక్కువ విషయాలపై ఆలోచించవద్దు. తద్వారా మీరు గతంలో ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కొన్ని కార్యక్రమాలలో పాల్గొని సరదాగా గడుపుతారు.
Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే
వృషభ రాశి
సహాయం చేయాల్సిన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముట్టారు. దీని వల్ల మీకు స్వల్ప వివాదాలు, విభేదాలు తలెత్తుతాయి. కానీ చింతించకండి. కొంత సమయం తరువాత వారే మీకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. పనిపై దృష్టి సారించడానికి బదులుగా, మీకు ప్రియమైనవారితో సరదాగా గడపండి. మీ మనస్సులో బాధ పోగొట్టుకునేందుకు విరామం తీసుకోవడం ఉత్తమం. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు.
మిథున రాశి
కొన్ని సమస్యలను అధిగమించడానికి ఇది మంచి రోజు. మీరు కొంతకాలం పట్టుకున్న కలిసిరాని వస్తువు ఏదైనా ఉంటే, దాన్ని మంటల్లో వేసి వదిలేయండి. గతం గతమే మరియు దానిని మార్చలేమని, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం మేలు చేస్తుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమేర ధనలాభం వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
మీరు ఏమీ మాట్లాడకపోయినా చుట్టుపక్కలవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశించారు, కాని అలా ఎన్నటికీ జరగదు. మీ కోసం పనులు చేస్తారని ఎదురుచూసే బదులు, మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో వారికి చెప్పండి. దాంతో కోరుకున్నది మీకు లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలతో అంతా సంతోషమే. చేపట్టిన పనులలో కార్యజయం సిద్ధిస్తుంది. ఆలయాలు దర్శించాలని యోచిస్తారు.
Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా
సింహ రాశి
మీకు ఆనందం మరియు ప్రేమ కావాలని మీరు అంటున్నారు, కానీ మీరు దాని కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారా? , అయినప్పటికీ మీరు చేయని విషయాలు అడుగుతారు. ఒక అడుగు వెనక్కి తీసుకొని మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
కన్య రాశి
మీరు చాలా శ్రమించి పని చేస్తారు. కొన్ని సందర్భాలలో మీపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే కొత్త ఆలోచనలపై ఫోకస్ చేయండి. నిత్యం చేసే విషయాలకు భిన్నంగా కొత్తగా ఏదైనా చేయాలని తాపత్రయపడతారు. కొన్ని పనుల కోసం ప్రయాణాలు చేయాలి. బంధువులు, సన్నిహితులతో కొన్ని విషయాలలో కలహాలు రావచ్చు. ఆచితూచి వ్యవహరించాలి.
తులా రాశి
మీ చుట్టూ నెలకొన్న వాతావరణం ఈ రోజు మిమ్మల్ని తగ్గేలా చేస్తుంది. బయటకు వెళితే అనారోగ్య సూచనను గోచరిస్తుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చల్లని ప్రదేశంలో ఉండటమే మంచిది. కొన్ని ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పనిచేసే చోట ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది.
వృశ్చిక రాశి
వ్యాపారాన్ని పక్కనపెట్టి విహారయత్రాలు, దైవ దర్శనాలకు ప్లాన్ చేస్తారు. ప్రస్తుతం మీరు పని చేసే మూడ్‌లో లేరు. యాత్రలు చేయడానికి ఇది ఉత్తమ సమయం. కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా గడుపుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు పడతాయి.
Also Read: EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు
ధనుస్సు రాశి
నువ్వు మనసు లగ్నం చేసి పనులు చేయాల్సి ఉంటుంది. లేనిచో మీకు చికాకు, అశాంతి కలుగుతాయి. ఇంట్లో ఉండి ఈ రోజు ప్రియమైనవారితో సరదాగా సమయాన్ని గడపండి. మీ కుటుంబ సభ్యులంటే ఎంతో ఇష్టమని వారికి అర్థమయ్యేలా చేస్తారు. అధిక ఖర్చుల కారణంగా రుణ యత్నాలు మొదలవుతాయి. వ్యాపారులకు నిరాశే ఎదురవుతుంది.
మకర రాశి
మీరు చాలావరకు సూటిగా, స్పష్టంగా వ్యవహరిస్తారు. ఇది సాధారణంగా ఉత్తమ మార్గం. ఈ రోజు మీరు వేరే విధంగా పనులు చేయడంపై దృష్టి పెడితే మంచిది. మీ పనులు పూర్తి చేసుకునేందుకు కొన్ని జిత్తులు చూపించాల్సిన సమయం ఇది. ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంటుంది. అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభ రాశి
ఈ రోజు వాస్తవికత కీలకంగా మారనుంది. మీరు పగటి కలలు మానుకుని మీ చుట్టూ ఉన్న విషయాలపై దృష్టి పెట్టండి. మీ చుట్టూ ఉన్నవారికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. మీరు యజమాని అయితే హింసకు బదులుగా స్నేహపూర్వకంగా వ్యవహరించండి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి.
మీన రాశి
ఏ విషయంలోనైనా ఎక్కువ పని చేయవద్దు. అవసరం, పరిధి మేరకు పనులు చక్కబెట్టుకోవాలి. జరగని విషయాలను చేయాలని ఇతరులను బలవంతం చేయవద్దు. నమ్మకంతో జీవిస్తూ ముందడుగు వేయాలి. ప్రయణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులలో నిర్లక్ష్యం వహించకూడదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook