Horoscope Today: నేడు శుక్రవారం- ఈ రాశుల వారికి గడ్డుకాలం నడుస్తోంది జాగ్రత్త..
Horoscope Telugu: డిసెంబర్ 17 (శుక్రవారం)కు సంబంధించి జోతిష్య నిపుణులు చెబుతున్న రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మరి ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Horoscope prediction today: నేడు శుక్రవారం (డిసెంబర్ 17). ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముందుగా పంచాంగం
శ్రీ ప్లవనామ సంవత్సరం
2021 డిసెంబర్, 17 (శుక్రవారం)
సూర్యోదయం ఉదయం 6:27 గంటలకు
సూర్యాస్తమయం సాయంత్రం 5:25 గంటలకు
తిథి- మార్గశిర శుద్ధ చతుర్దశి.. తదుపరి పౌర్ణమి
రాహుకాలం: ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8:38 గంటల నుంచి 09:22 గంటల వరకు, మధ్యాహ్నం 12:17 గంటటల నుంచి 1:01 గంటల వరకు
యమగండము: ఉదయం 06:00 గంటల నుంచి 7:30 గంటల వరకు
రాశి ఫలాలు..
మేష రాశి (Aries)
వ్యాపారులు, ఉద్యోగులకు గడ్డు కాలం నడుస్తోంది. రుణ భారం పెరిగే అవకాశాలున్నాయి. ప్రణాళికతో పనులు చేసే క్రమంలో అనుకోని అటాంకాలు ఎదురవ్వచ్చు. ప్రయాణాలు అనుకూలంగా లేవు. నిర్ణయాలు ఆకస్మికంగా మార్చుకోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు.
వృషభ రాశి (Taurus)
ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు తొలగి సులభంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగే అవకాశముంది. పెద్దల వల్ల మీకు సహకారం అందుతుంది.
మిథున రాశి (Gemini)
ఓ వార్త మీకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మీకు పూర్తి సహకారం అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు వ్యాపారులకు లాభాదాయక పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్య పట్ల శ్రద్ద అవసరం.
కర్కాటక రాశి (Cancer)
ఈ రోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపారులకు లాభాదాయకమైన రోజు. ఉద్యోగులకు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అవసరానికి సన్నిహితులు, బంధు మిత్రుల ద్వారా డబ్బు అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఓ మంచి వార్త మీకు అనంధాన్నిస్తుంది.
సింహ రాశి (Leo)
ఉద్యోగులకు నేడు మంచి రోజు. బాధ్యతలు పెరిగే అవకాశముంది. పై స్థాయి వారి నుంచి ప్రశంసలు పొందే వీలుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వ్యాపారులకు కూడా ఆశించిన స్థాయిలో పురోగతి లభిస్తుంది.
కన్యా రాశి (Virgo)
ఈ రాశి వారికి నేడు కాస్త గడ్డు పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగొచ్చు. ఉద్యోగులకు కూడా సమస్యలు రావచ్చు. పనులు పూర్తి చేయడంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు ఇబ్బది పెట్టొచ్చు.
తులా రాశి (Libra)
ఈ రాశి వారికి నేడు ఇబ్బందికరంగా సాగొచ్చు. అనేక సమ్యల వల్ల ఇబ్బంది పడొచ్చు. ఉద్యోగులకు అదనపు బాధ్యల వల్ల చికాకు పడే అవకాశముంది. వ్యాపారులకు కూడా అంతగా కలిసి రాకపోవచ్చు. ఇబ్బందికర పరిస్థితుల్లోను పనులు సమయానికి పూర్తి చేయగలుగుతారు.
వృశ్చిక రాశి (Scorpio)
ఈ రాశి వారికి నేడు శుభప్రదంగా సాగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. పనులు సమయానికి పూర్తవుతాయి. ఓ శుభవార్తతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సానుకూలంగామైన పరిస్థితుల ఉన్నాయి. రోజంతా ఆహ్లాదకరంగా గడుస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ఉద్యోగులకు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారాల సానుకూలంగా సాగుతాయి. ఓ విషయం మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అయితే బాధ కలిగించే విషయాల కూడా చోటు చేసుకోవచ్చు. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. భూతగాదాల వల్ల కొంత చికాకుకు లోనయ్యే అవకాశముంది.
మకర రాశి (Capricorn)
ఈ రాశి వారికి నేడు ఆహ్లాదంగా గడుస్తుంది. కీలకమైన పనులను సమర్థంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. పనులు పూర్తి చేసే విషయంలో అవరోదాలు ఏర్పడొచ్చు. వివాదాలకు తావివ్వకుండా చూడాల్సిన అవసరం ఉంది.
కుంభ రాశి (Aquarius)
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు సమయానికి సాధిస్తారు. ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరుల వల్ల ఒత్తిడి పెరగొచ్చు. మానసిక ప్రశాంత లోపిస్తుంది.
మీన రాశి (Pices)
వ్యాపారాలు విస్తరించే అవకాశముంది. ఉద్యోగులు తమ పనితీరుతో పైస్థాయి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఓ శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తవుతాయి. వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. విందూ, వినోద కార్యక్రమాల్లో పొల్గంటారు. ఈ రోజంతా ఆహ్లాదంగా సాగుతుంది.
Also read: Sun Transit in Sagittarius : ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఆ నాలుగు రాశులకు చాలా ప్రమాదం
Also read: Shani Effect on Zodiacs: ఈ 3 రాశులకు తొలగిపోనున్న శని ప్రభావం- 2022లో వారికి డబ్బే డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook