Horoscope Today 21 September 2022: మేషం (Aries): అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇప్పుడు ఇబ్బంది పెడతాయి. కీలక పనులను వాయిదా వేసుకోవడం మంచిది. గోసేవ చేస్తే మంచిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): ధనం చేతికి వచ్చే అవకాశం ఉంది. సొంతింటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.


మిథునం (Gemini): శుభకాలం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.


కర్కాటకం (Cancer): ఓ శుభవార్త వింటారు. సమాజంలో పేరుప్రతిష్టలు వస్తాయి. అధిక ధనలాభం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం మంచిది.


సింహం (Leo): మీ ప్రతిభకు తగ్గ ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. విందు, వినోద కార్యక్రమాలల్లో పాల్గొంటారు. ఈశ్వరదర్శనం చేయడం మంచిది.


కన్య (Virgo): సానుకూల సమయం. ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. స్థిర నిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. ప్రయాణ సూచన ఉంది. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.


తుల (Libra): మీ మీ రంగాలలో పరిస్థితులు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పని తలపెట్టినా.. పూర్తి చేస్తారు. మిత్రల అండ మీకు ఉంటుంది. కుటుంబ సభ్యులకు మంచి కాలం. దైవారాధన మానవద్దు.


వృశ్చికం (Scorpio): అనుకున్నది సాధిస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవండి.


ధనస్సు (Sagittarius): కీలక పనుల్లో ఆచితూచి అడుగేయాలి. ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. అవసరం అయితే పెద్దల సాయం తీసుకోండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.


మకరం (Capricorn): కీలక పనులలో సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మనో ధైర్యంతో పనులు పూర్తిచేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త. కుటుంబ సభ్యులతో గొడవలు వద్దు. విష్ణు నామస్మరణ ఉత్తమం. 


కుంభం (Aquarius): మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. శ్రమతో కూడిన ఫలితాలను ఆశించాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.


మీనం (Pisces): శుభకాలం. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. సకాలంలో ఆదుకునే సన్నిహితులు ఉన్నారు. శివారాధన చేయడం మంచిది.


Also Read: Liger OTT: ఓటీటీలోకి లైగ‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎందులోనో తెలుసా?


Also Read: నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు: చిరంజీవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.