Horoscope Today 25 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 25న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
మీ వ్యక్తిగత సంబంధాలకు ఈ రోజు కొంచెం అదనపు శ్రద్ధ చూపుతారు. మీ ఇంట్లోని ప్రతి ఒక్కరితో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్నవారి మార్పు కోసం వారి సమస్యలను ఎల్లప్పుడూ వినండి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండదు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది.


Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా


వృషభ రాశి
మీరు ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇది మంచి విషయం. మీపై మీకు కొన్ని విషయాలలో సందేహం తలెత్తుతుంది. మీరు ఖచ్చితంగా మంచివారని ఇతరులు గ్రహిస్తారు. మీరు చేసే పని ఏదైనా ప్రశంసించబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. 


మిథున రాశి
ఈ రోజు మిథునరాశి వారు నిస్వార్థంగా వ్యవహరిస్తారు. మీ చుట్టుపక్కల వ్యక్తులపై శ్రద్ధ వహిస్తారు. మీరు నూతన వ్యక్తులను కలిసినప్పుడు మీరు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని స్నేహితులు భావిస్తారు. వ్యక్తులతో మీ సంబంధాలను ఎలా సమతుల్యం చేసుకోవాలో తెలుసుకోండి. ఉద్యోగులు మార్పు కోరుకుంటారు. ప్రయాణాలు కారణంగా రుణాల కోసం యత్నిస్తారు.


కర్కాటక రాశి 
మీరు ఉత్సాహంగా పనిచేస్తూ అధికారుల మెప్పు పొందుతారు. మీ కార్యాలయంలో ప్రయోజనం కోసం శ్రమిస్తారు. మీరు కొత్త నాయకత్వ నైపుణ్యాలను నేర్చుకోవాలి. చాలా కాలం తరువాత స్నేహితులను కలుసుకుంటారు. నూతన పరిచయాల ద్వారా వ్యాపారం గురించి ఆలోచిస్తారు.


సింహ రాశి
ప్రతిదానికీ మీదే పైచేయి ఉండాలనే మీ కోరిక ఈ రోజు ఎక్కువగా ఉంటుంది. పనులను సాధించడానికి మరియు క్రొత్త ప్రాజెక్టులను రూపొందించడానికి ఇది మంచి రోజు. ప్రతి ఒక్కరూ మీలాంటి అభిప్రాయాలను కలిగి ఉండరని అర్థం చేసుకోండి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. పనులపై మనసు నిమగ్నం చేయలేకపోతారు.


Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే


కన్య రాశి
సహనం మీకు అన్నింటికన్నా ఉత్తమ గుణం. మీరు ఎటువంటి కారణం లేకుండా కొన్ని విషయాలలో పరుగులు పెడుతున్నారు. ప్రతిదానికీ సమయం ఉందని గుర్తుంచుకోండి. స్థిమితంగా మరియు స్థిరంగా ఆలోచిస్తే విజయం లభిస్తుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. కుటుంబం, సన్నిహితులతో సరదాగా గడుపుతారు.


తులా రాశి
చాలా కష్టపడి పనిచేయడం వల్ల ఒంటరితనం మరియు విసుగు ఏర్పడుతుంది. బయటకు వెళ్లి సరదాగా గడపాలని భావిస్తారు. మీరు మీరే ఎక్కువ పని చేయడం వల్ల అలసట వస్తుంది. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగుల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.


వృశ్చిక రాశి
ఒకరు గతంలో మీ కోసం ఏదైనా పని చేయకపోతే, ఇప్పుడు మాట్లాడటానికి సమయం ఆసన్నమైంది. వారి నుంచి మీకు ఓ నిజం తెలుస్తుంది. నేడు మీ అభిప్రాయాలను ఇతరులకు చెబుతారు. శాంతంగా వ్యవహరించాలి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికం కానుంది.


ధనుస్సు రాశి
ఒకరి గురించి మీ వ్యక్తిగత భావాలను ప్రభావితం కాకుండా చూసుకునేందుకు జాగ్రత్త వహిస్తారు. మీకు చాలా దగ్గరి వ్యక్తి కారణంగా సమస్య ఎదుర్కోనున్నారు. ఇది మిమ్మల్ని కొంతకాలం నిరుత్సాహపరుస్తుంది. వాటిని పక్కనపెట్టి మీ కెరీర్‌పై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఖర్చులు అధికం అవుతాయి. రుణయత్నాలు చికాకు తెప్పిస్తాయి. ప్రయాణాల కారణంగా అనారోగ్యం బారిన పడతారు.


మకర రాశి
మీరు ఈ రోజు చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. మీరు చేయగలిగే స్థితిలో ఉంటే ఏదైనా దానం చేయండి. సమాజానికి తిరిగి ఇవ్వడం ఎల్లప్పుడూ మంచిది. మీరు ఇప్పటికీ సున్నిత మనస్కులు అని వారు మరిచిపోయినట్లు చూపిస్తారు. శుభవార్తలు అందుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పని బారం తగ్గుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించనుంది.


కుంభ రాశి
విషయాలు ఎల్లప్పుడూ మీ చుట్టూనూ తిరగవలసిన అవసరం లేదు. మీరు కొంతకాలం మాట్లాడని ఒక స్నేహితుడు మీ సహాయం కోసం వస్తాడు. అయితే గతంలో వారు మిమ్మల్ని బాధపెట్టారని మాత్రం దూరంగా ఉండవద్దు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం రానుంది. సన్నిహితులతో ఏర్పడ్డ విభేదాలు తొలగిపోనున్నాయి.


మీన రాశి
ఈరోజు మీగురించి ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రయాలపై చాలా శ్రద్ధ వహించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీగురించి ఏం ఆలోచిస్తారో తెలుసుకునేందుకు తగిన అవకాశం ఇది. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. చేపట్టిన కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమ అధికం కానుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook