Horoscope Today 27 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 27న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
మీ చుట్టుపక్కల వ్యక్తులు కారణంగా మీరు ఆవేశానికి లోనవుతారు. మీ భావాలను వ్యక్తీకరించడం సరైన నిర్ణయం. ఖర్చులు అధికం అవుతాయి. మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు. ఉద్యోగులు వ్యాపారులుకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువులు, సన్నిహితులతు విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.


Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు


వృషభ రాశి
మీరు ఏ కారణం లేకుండా జీవితంలోని ప్రతి అంశం గురించి చింతిస్తూ ఉంటారు. ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోవడమే సరైన నిర్ణయం. వీలైతే మీ పనుల జాబితాను క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. ఆస్తి సమస్య కొలిక్కి వస్తుంది. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.


మిథున రాశి
మీరు ప్రతిదానికీ పగ పెంచుకోవలసిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల వ్యక్తులు తప్పులు చేస్తుంటారు. అయితే మీరు వారిని క్షమించి, మరో అవకాశం ఇవ్వాలని చూస్తుంటారు. దీనికి పరిష్కారం కనుగొనాల్సిన సమయం ఇది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.


కర్కాటక రాశి 
ఈ రోజు మీరు కొందరిపట్ల కృతజ్ఞతతో ఉండటం ముఖ్యం. మీకు కావలసినవన్నీ మీకు లేవని భావిస్తారు. అయితే ఇతరులను గమనిస్తే మీ పరిస్థితి కాస్త నయం అనిపిస్తుంది. కనుక మీ రోజు జీవితాన్ని ఆనందించండి. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రావు. ఉద్యోగులకు తోడ్పాడు లభించదు.


సింహ రాశి
మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి నేడు చాలా మంచి రోజు. ఈ మధ్య మీరు చాలా యాంత్రికంగా మారుతున్నారు. దీనివల్ల ఇతరులు మీతో అంత కలివిడిగా ఉండలేరు. మీ భావాలను ఇతరులతో పంచుకోవడం మరియు మీరు ఏమి ఆలోచిస్తున్నారో చెబితే మేలు జరుగుతుంది. వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నూతన పరిచయాలు కారణంగా కొన్ని పనుల్లో కలిసిరానుంది.


Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా


కన్య రాశి
మీరు నూతన ఉత్సాహంతో పని చేస్తారు. మీ చుట్టూ ఉండేవారు ఇది గమనించి మసలుకుంటారు. వారికి సైతం మీరు ప్రేరణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని కష్టాలు ఎదురైనా మీరు సంతోషంగానే గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రావు. మీ శ్రమకు తగ్గ ఫలితం రాకపోవడంతో నిరాశ చెందుతారు.


తులా రాశి
మీరు ఈ రోజు చాలా శక్తివంతంగా ఉన్నట్లు భావిస్తారు. మానసికంగా, శారీరకంగా మెరుగ్గా ఉన్నారు. కనుక గతంలో మీరు వదిలిపెట్టిన పనులను ముగించడానికి ఇది మంచి రోజు. పనిపై మనస్సును నిమగ్నం చేస్తే అంతా శుభమే జరుగుతుంది. కొన్ని శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.


వృశ్చిక రాశి
ఈ రోజు మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని నిరాశపరచవచ్చు. అయితే, దీని గురించి ఎక్కువగా చింతించవద్దు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. దీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తులలో ఆశాజనకంగా ఉంటుంది. 


ధనుస్సు రాశి
నేడు మీరు పరధ్యానంలో గడపనున్నారు. అయితే ఇది అన్నివేళలా మంచిది కాదు. మరియు మీరు ఆనందించే పనులను చేయాలనుకుంటున్నారు. ఏదేమైనా ముందుగా మీ పనిని పూర్తి చేసుకోవడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం లాంటివి చేయాలి.


Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే


మకర రాశి
నేడు కొందరు మీ సలహా కోసం సంప్రదిస్తారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మేలు జరగనుంది. కొన్ని ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. రుణాల కోసం యత్నిస్తారు. డబ్బు కారణంగా ఒత్తిడి పెరిగి విభేదాలకు దారి తీస్తుంది.


కుంభ రాశి
మీకు పని కావాలని భావిస్తారు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకునే దిశగా అడుగులు పడతాయి. మీ నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా గుర్తించానని గ్రహిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులు అధికంగా శ్రమిస్తే ఫలితాన్ని పొందగలరు.


మీన రాశి
మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నేడు మీకు అవసరం మేరకు సహాయపడరు. ఈ కారణంగా మీరు నిరాశ చెందవద్దు. సొంతంగానే సమస్యలను పరిష్కరించుకోగలనని విశ్వసిస్తారు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి మీ చేతికి అందనుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook