Horoscope Today 27 May 2021: ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం మే 27వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మీరు కొంచెం ఒత్తిడిలో ఉంటారు. అయితే పనికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో సందేహాల వల్ల ఇది జరుగుతుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రాధాన్యతను బట్టి పనులు పూర్తిచేస్తే ఏ సమస్యా ఉండదు. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. వ్యాపారులు ఆచితూచి అడుగు వేయాలి.


వృషభ రాశి
మీరు ఛాంపియన్ లాంటి వ్యక్తి. అది ఎలాగో ఇతరులకు చూపించే సమయం ఇది. మీరు పని చేసుకుంటూ చాలా నిరాడంబరంగా ఉంటారు. గౌరవ, మర్యాదలు దక్కుతాయి. నేడు మీకు కొంత ఆస్తి లభించనుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు తమ శ్రమను నమ్ముకుని పని చేయాలి.


Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది


మిథున రాశి
మీ జీవితంలో బ ముఖ్యమైన వాటిపై దృష్టిసారించాలి. కెరీర్ బాగుంటే మీ జీవితం బాగుంటుందని గ్రహిస్తారు. నూతన ప్రాజెక్టులు మొదలు పెడతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలలో ముందడుగు పడుతుంది. ఆర్థిక పరమైన విషయాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.


కర్కాటక రాశి 
విద్యార్థులను చదువు విషయంలో ఒత్తిడి చేయకూడదు. కెరీర్ విషయంలోనూ మీ అభిప్రాయాలను వారిపై రుద్దకూడదని గ్రహించాల్సిన సమయం ఇది. ఖర్చులు అధికం కావడంతో ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితాలు ఆలస్యంగా అందుకుంటారు. 


సింహ రాశి
మీ సన్నిహితులకు పనిలో ఈరోజు సహాయం చేస్తారు. కొందరు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండవచ్చు, లేదా నగదు అవసరం పడవచ్చు. నమ్మకంతో వారికి సహాయం అందిస్తారు. నాయకత్వ లక్షణాలతో ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు అధికం అవుతాయి. పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. వ్యాపారులు, ఉద్యోగులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. 


కన్య రాశి
మీరు ఓ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు సంబంధించి మీరు పనిచేసే చోటు నుంచి కొంతమేర సాయం అందుకుంటారు. మీతో పాటు మీ సహోద్యోగుల పనితీరును పరీక్షించే సమయం ఇది. చాలా రోజుల తరువాత బాల్య మిత్రులను కలుసుకుంటారు. అయితే బయట తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


తులా రాశి
తీరిక లేని పనుల కారణంగా మీరు అలసిపోతారు. కానీ అనూహ్యంగా ఈ వారం మీరు గతంలో కన్నా అధిక ఉత్పాదకత అందిస్తారు. పని నుంచి విరామం తీసుకుని కుటుంబానికి సైతం సమయం కేటాయించాలని భావిస్తారు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు అధికంగా శ్రమించిన ఫలితంలో జాప్యం.


వృశ్చిక రాశి
ఈ రాశివారు గతంలో కొంత గందరగోళానికి గురైన కొన్ని విషయాలు ఉంటే, నేడు వాటిని పరిష్కరించుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఓ శుభవార్త అందుతుంది. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి అడుగులు వేయాలి.


ధనుస్సు రాశి
పని ద్వారా ఎల్లప్పుడూ మీరు ఓ మార్గంలో వెళ్లాలని భావిస్తుంటారు. కానీ సరిగా ప్లాన్ చేస్తే ఏ సమస్య ఉండదు. ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఖర్చులు అధికం కావడంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.


Also Read: Chandra Grahanam 2021: చంద్రగ్రహణం సమయంలో ఈ పనులు చేయకూడదు, వీటికి దూరంగా ఉండాలి


మకర రాశి
ఈ రోజు మీరు రోజుచేసే పని కంటే భిన్నమైన దాని పట్ల ఆసక్తి కనబరుస్తారు. కానీ ప్రస్తుతం చేస్తున్న పనులపై దృష్టిసారించడం మీకు మేలు చేయనుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతాయి. ఎంతోకాలం నుంచి వేచిచూస్తున్న ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలని భావిస్తారు.


కుంభ రాశి
ఈ రోజు మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. మీ పనిని గుర్తిస్తే ఉన్నతాదికారులు మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగావకాశాలలో కీలక అడుగు పడనుంది. విద్యార్థులు కెరీర్ గురించి ఆలోచిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


మీన రాశి
మీకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు పనిని సరిగ్గా చేయకపోతే మీ స్థానం కోసం ఇతరులు సిద్ధంగా ఉంటారు. ఖర్చులు అధికం కావడంతో కుటుంబంలో విభేదాలు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి. ఉద్యోగులకు పని బారం అధికం కానుంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook