Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 3, 2021 Rasi Phalalu, ఆ రాశివారికి వాహనయోగం
Rasi Phalalu 3 March 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 3న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today 3 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 3న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈరోజు మీరు తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతారు. కానీ ఇది ప్రతిసారి మంచిది దారి తీస్తుందని భావించరాదు. ఇతర రోజులకన్నా ఈరోజు అధిక విషయాలు చర్చిస్తారు. మెదడు చెప్పేది పక్కన పెట్టి మనసు చెప్పేది చేయడం శ్రేయస్కరం. దైవదర్శనాలు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన కార్యాలు పూర్తి అవుతాయి. వాహనాలు కోనుగోలు లేదా అందుకుంటారు.
Also Read: Maha Shivaratri 2021: మహా శివరాత్రి రోజున ఇలాచేస్తే పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవచ్చు
వృషభ రాశి
కొందరు వ్యక్తులు తమ సందేహాలకు సమాధానాల కోసం మిమ్మల్ని సంప్రదించనున్నారు. ఇది మీ దృష్టిని మరల్చకుండా చూసుకోండి. అదే సమయంలో మీ పనులపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడంపై యోచిస్తారు.
మిథున రాశి
ఈరోజు కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించనున్నారు. పనిలో మీరు సమయం వెచ్చించడం చాలా ముఖ్యం, కానీ అదే సమయంలో కుటుంబాన్ని సైతం పట్టించుకోవాలని గ్రహిస్తారు. మీ దృష్టికి వచ్చిన కొన్ని విషయాలపై ఆలోచన చేస్తారు. నేడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. ఉద్యోగులకు చేసిన పనికి ఫలితం దక్కదు.
కర్కాటక రాశి
మీరు సరైన మార్గంలో నడవటం లేదని మీ చుట్టూ ఉన్నవారు భావిస్తారు. అయితే అది తప్పు అని నిరూపించనున్నారు. మీ మనసులో కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలకు స్థానమిచ్చి వాటిపై పనిచేయడం ప్రారంభించాలి. కుటుంబం నుంచి ఒత్తిడి ఉంటుంది. మీ మనసులో పలు ప్రశ్నలు మొదలవుతాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకారణంగా మీ సన్నిహితులే శత్రువులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది
సింహ రాశి
ఉద్యోగంలో తలెత్తే సమస్యలు మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురిచేయనున్నాయి. వాటిని అధిగమించేందుకు మీరు శాయశక్తులా శ్రమిస్తారు. మీ కోసం మీరు ముందడుగు వేయాలి. మీకు ఇష్టమైన వ్యక్తులు లేదా స్నేహితులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. పనులలో పురోగతి లభించడంతో పాటు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు, వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
కన్య రాశి
ఈ రోజు మీ అంతర్గత దృష్టి అధికం అవుతుంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. మీరు ప్రస్తుతం ఆలోచిస్తున్నది సరైనది. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ నిర్ణయాలను వెల్లడించాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.
తులా రాశి
ఆర్థిక అవసరాలు ఉన్న స్నేహితుడు ఈ రోజు మిమ్మల్ని సంప్రదించవచ్చు. నేడు తులా రాశికి అంతా శుభమే జరుగుతుంది. మీరు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. అనుకోని సంఘటనలు చికాకు తెప్పిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం
వృశ్చిక రాశి
మీ మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. కనుక చాలా జాగ్రత్తలు సలహాలు ఇవ్వాలని గ్రహిస్తారు. మీ పనికి తగిన గుర్తింపుల లభిస్తుంది. మీ ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఉంచారు. వ్యాపారులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనుల కోసం రుణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యల కారణంగా దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు.
ధనుస్సు రాశి
అందరిలో ఒకరిగా కన్నా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండేందుకు ఇష్టపడతారు. మీ చుట్టుపక్కల వ్యక్తులతో మీ నైపుణ్యాలను కూడా ప్రదర్శించాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాలు పాటిస్తారు. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు.
మకర రాశి
గతంలో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి
ఈరోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. చాలా విషయాలు మీ మనసులో మెదలుతాయి. చేపట్టాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకుంటారు. ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్కటిగా చేయడం శ్రేయస్కరం. ప్రశాంతత కోసం యోగా చేయాలి. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలు రానున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం గోచరించడం లేదు. ప్రయాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు.
మీన రాశి
గత కొంతకాలంగా చేయాలనుకుంటున్న పనులను చేయడానికి ఇది చాలా మంచి రోజు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఉద్యోగులు శ్రమించినా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook