Horoscope Today 6 September 2022: మేషం ( Aries): నూతనంగా చేపట్టే పనిలో శ్రమించాల్సి ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బందుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. వివాదాల జోలికి పోకూడదు. నవగ్రహ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): శుభకాలం. అన్ని రంగాల వారు మంచి ఫలితాలు అందుకుంటారు. తోటివారి సాయం అందుతుంది. కుటుంబంతో కలిసి శుభ  కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణ సూచన ఉంది. శనిధ్యానం పఠించాలి. 


మిథునం (Gemini): తలపెట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెద్దల సహకారం ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది. 


కర్కాటకం (Cancer): అన్ని రంగాల వారికి అనుకూల సమయం. మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో పట్టుదలను పక్కన పెట్టాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి.


సింహం (Leo): మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రయాణ సూచన ఉంది. నవగ్రహ శ్లోకం చదవాలి.


కన్య (Virgo): మంచి పనులు చేపడతారు. సమయానికి పనులు పూర్తవుతాయి. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడుతాయి. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అధిక ధన వ్యయం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.


తుల (Libra): మంచి ఫలితాలు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు ఫలిస్తాయి. అనవసర విషయాల పట్ల కాలాన్ని వృథా చేయకండి. కుటుంబంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా ట్రిప్ చేసే అవకాశం ఉంది. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.


వృశ్చికం (Scorpio): నూతనంగా చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల మాటలను పక్కన పెట్టకండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. నవగ్రహ ధ్యానం శుభప్రదం. 


ధనస్సు (Sagittarius): శుభకాలం నడుస్తోంది. చేపట్టిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబందించిన శుభ వార్తలు వింటారు. అధిక ధన వ్యయం ఉంది. ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది.  


మకరం (Capricorn): అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. అన్ని రంగాల వారు అభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు.  వ్యాపార లాభాలు ఉన్నాయి. లక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.


కుంభం (Aquarius): శుభకాలం నడుస్తోంది. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేయగలుగుతారు. ప్రయాణ సూచన ఉంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. 


మీనం (Pisces): భవిష్యత్తుకు సంబంధించిన ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనులలో శుభ ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు. గోవింద నామాలు పఠిస్తే బాగుంటుంది.


Also Read: Sonakshi Sinha Hot Pics: వైట్ డ్రెస్‌లో సోనాక్షి సిన్హా.. 'నెవర్ బిఫోర్' అనే అందాలు!


Also Read: Bengaluru Floods: బెంగళూరు జలమయం.. జనజీవనం అస్తవ్యస్థం! ఐటీ సంస్ఠలకు వందల కోట్ల నష్టం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook