Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 8, 2021 Rasi Phalalu, ప్రేమను వ్యక్తం చేసే సమయం
Horoscope Today 8 February 2021: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి నేటి రాశి చక్రాలు ఎలా ఉండనున్నాయి, గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. ఫిబ్రవరి 8న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
Horoscope Today 8 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 8న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీ అభిప్రాయాలకు విలువ దక్కుతుంది. కానీ మీరు వాటిని ఇతరులపై బలవంతంగా రుద్దకూడదు. పనిలో మీ సహోద్యోగులకు మీ కన్నా భిన్నమైన ఆలోచన రావచ్చు. మంచిదైతే వాదనకు దిగకుండా పాటించడం ఉత్తమం. మీ భాగస్వామి నుంచి ఈ రోజు ఎక్కువ ప్రేమను పొందుతారు. మీ భాగస్వామిని మీరు కూడా అంతే ప్రేమిస్తున్నారని తెలిసేలా చేయండి.
వృషభ రాశి
మీ ఆలోచనలు నెమ్మదిగా వృద్ధి చెందుతాయి. ఒకరితో సంబంధాలు పెట్టుకోవటానికి అంతగా తొందర పడవద్దు. మీ సమయాన్ని వెచ్చించి విషయాలను తెలుసుకోండి. కేవలం మీ పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి. మీకు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేదు. కానీ ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు కొన్న ప్రణాళికలు రూపొందిస్తారు. నేడు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి.
మిథున రాశి
మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా ఈ రోజు కొంత నగదు అడగవచ్చు. మీరు ఆర్థికంగా ఉన్నవారు అయితే మాత్రం కచ్చితంగా సహాయపడటానికి మీరు ఏమి చేయగలరో చేయూత అందిస్తారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం శ్రమిస్తారు. ఈరోజు కొంచెం సోమరితనంగా అనిపించవచ్చు, కానీ పనిపై శ్రద్ధ వహిస్తే ఏ సమస్య ఉండదు.
కర్కాటక రాశి
మీ అభిప్రాయాలు జీవితంలో కీలక విషయాల వైపు దారి తీయనున్నాయి. మీరు పనిలో పరధ్యానంలో ఉండే సూచన గోచరిస్తుంది. అందుకు గల కారణాన్ని మీ సన్నిహితులకు చెప్పడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ప్రేమ లాంటి విషయాలలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మీ వాలైంటైన్స్ డే సజావుగా జరిగేలా వారు తోచిన సలహాలు ఇస్తారు.
సింహ రాశి
మీరు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ రోజు వీటి నుంచి బయటకొచ్చి రిస్క్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో వైవిధ్యం ఏర్పడుతుంది. మీరు ముందుకు సాగాలని కష్టమైన ప్రాజెక్ట్ తీసుకోవాలనుకోవచ్చు. మీ భాగస్వామికి ఏదైనా మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి షికారుకు వెళ్లే అవకాశం ఉంది.
కన్య రాశి
ఈ రోజు ఇతరులతో ఉన్నప్పుడు కన్య రాశి వారు చాలా ప్రశ్నలు అడగకుండా ఉండటమే మంచిది. మీరు అన్ని విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. అయితే ప్రతిదీ తెలుసుకోవడం కొన్ని సమస్యలక దారి తీస్తుంది. మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం లాంటి వాటికి సమయాన్ని కేటాయించడం శ్రేయస్కరంగా కనిపిస్తుంది.
తులా రాశి
ఖరీదైన వస్తువులు కొనడానికి తులా రాశి వారికి నేడు మంచి రోజు కాదు. అందుకు బదులుగా మీకు లాభాన్నిచే ఏదైనా వస్తువు, లేక ప్రాజెక్టుపై ఖర్చు చేస్తే కలిసొస్తుంది. ఆస్తులు, లేక బంగారం కొనుగోలు చేసే సూచనలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు చేసే పెట్టుబడి మీ ఇష్టమైన వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
వృశ్చిక రాశి
ప్రయాణాలు చేయాలని మీరు కోరుకుంటారు. అయితే అందుకు నేడు మంచిరోజా కాదా అని ఆలోచిస్తారు. అయితే ఇది దైవ దర్శనాలు, లాంగ్ డ్రైవ్‌కు బదులుగా పనికి సంబంధించిన ప్రయాణం అయ్యేలా కనిపిస్తుంది. మీరు ఎంచుకున్న ప్రాజెక్ట్ కారణంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ధనస్సు రాశి
మీరు ఈ రోజు ఇతరులతో కలుపుగోలుగా ఉండేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. పనిలో మంచి ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకున్న వారిని మీరు అభినందిస్తారు. దీని వల్ల మీ పేరు, ప్రతిష్టలు పెరిగే సూచన ఉంది. మీ ఇష్టమైన వారిని సంతోషంగా ఉంచేందుకు కొంతకాలం నుంచి వాయిదా వేస్తున్న పనికి శ్రీకారం చుడతారు.
మకర రాశి
మీరు మీ స్నేహితులను కలుసుకుని చాలా కాలం అవుతుంది. అందుకే ఈరోజు కొందరు మిత్రులనైనా కలుసుకుని సమయం వెచ్చించాలని భావిస్తారు. దీని వల్ల మీకు మానసిక, శారీరక ప్రశాంతత చేకూరుతుంది. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పెడతాయి. అయితే కొంత సమయం ఓపిక పట్టాలి. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలనుకుంటారు.
కుంభ రాశి
చిన్ననాటి, పాత స్నేహితులను కుంభ రాశి వారు నేడు కలుసుకుంటారు. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. కొన్ని ఊహించని ఘటనలు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు వాటిపై దృష్టి పెట్టండి. ఏ ఒత్తిడికి లోను కాకుండా సమయాన్ని కేటాయిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది. నేటి నుండి మీకు ప్రియమై వారికి సమయాన్ని కేటాయిస్తారు.
మీన రాశి
వ్యక్తిగత, వృత్తి పరమైన పనులలో మీకు కొన్ని కీలక విషయాలు తెలుస్తాయి. అయితే ఒక్కసారిగా కాకుండా దశల వారీగా మీకు విషయాలపై అవగాహనా పెరుగుతుంది. అయితే మీకు తెలిసిన విషయాలు కొన్ని మీకు లాభించక పోవచ్చు. మీ వ్యక్తిగత సంబంధాలతో కొంచెం ఒత్తిడికి లోనవుతారు. మీ కుటుంబంతో సమయం కేటాయించడానికి ప్రయత్నించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook