Horoscope Today April 25 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారి కష్టానికి తగిన ఫలితం దక్కే రోజు ఇది...
Horoscope Today April 23 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిపై చంద్రుడి అనుగ్రహం ఉంటుంది. తద్వారా అన్ని పనుల్లో వారికి కలిసొస్తుంది.
Horoscope Today April 25 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... ఇవాళ కొన్ని రాశుల వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ రీత్యా బాస్ నుంచి అభినందనలతో పాటు పదోన్నతి పొందుతారు. కొన్ని రాశుల వారికి ప్రతికూల సమయం వెంటాడుతుంది. తద్వారా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు.
మేషరాశి ( Aries)
ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. గతంలో చవిచూసిన నష్టాలు ఇప్పుడు లాభాలతో భర్తీ అవుతాయి. మీ పని తనాన్ని మీ బాస్ అభినందిస్తారు. ఉద్యోగ రీత్యా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ప్రత్యర్థుల పట్ల ఆచీ తూచీ వ్యవహరించాలి. కోప తాపాలను నియంత్రణలో ఉంచుకోవాలి. పెళ్లి విషయంలో ప్రేమికులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో స్నేహితులు, బంధువులు సాయం చేస్తారు.
వృషభ రాశి (Taurus)
ఆరోగ్య రీత్యా అంతా బాగుంటుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా తీర్థయాత్రకు వెళ్తారు. మతపరమైన సంస్థలకు లేదా ఛారిటీలకు కొంత ఆర్థిక సాయం చేస్తారు. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసేవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.
మిథున రాశి (GEMINI)
కొన్ని కుట్రలకు మీరు బాధితులవుతారు. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. పెద్దల ఆశీస్సులు, మీ సంక్పలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కుటుంబ జీవితంలో వాగ్వాదాలకు తావివ్వకూడదు. ఈ సమయంలో లాంగ్ డ్రైవ్స్, టూర్ రద్దు చేసుకుంటే మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు.
కర్కాటక రాశి (Cancer)
ఇవాళ వృత్తిరీత్యా చాలా బిజీగా గడుపుతారు. నూతనోత్సాహంతో పనిచేస్తారు. చేపట్టిన ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్తారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీ వ్యాపార కార్యకలాపాలకు కలిసొస్తాయి. భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు చేపడుతారు. స్థిరాస్థి పెట్టుబడులు ప్రస్తుతానికి కలిసిరావు.
సింహ రాశి (LEO)
వృత్తిరీత్యా బాగా రాణిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న జాబ్ నుంచి వేరే జాబ్‌లోకి మారవచ్చు. సీనియర్లతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. పాత అనారోగ్య సమస్యలు నయమవుతాయి. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల నుంచి ఒక శుభవార్త అందుతుంది. మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకునే నిర్ణయాలు తీసుకోవద్దు.
కన్య రాశి (Virgo)
చేపట్టిన పనిని పూర్తిగా ఆస్వాదిస్తారు. అన్నీ అనుకూలిస్తాయి. చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. వృత్తిపరంగా తెలివైన నిర్ణయాలు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మీ బాస్ మీకు ప్రత్యేక గుర్తింపునిస్తారు. గతంలో మీరు పెట్టుబడులు పెట్టిన వాటినుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.
తులా రాశి (Libra)
ఇవాళ మీకు నిరాశజనకంగా ఉంటుంది. రోజంతా అసంతృప్తి వెంటాడుతుంది. అహంకారం మిమ్మల్ని దెబ్బతీస్తుంది. కుటుంబ జీవితంతో పాటు ఉద్యోగంపై దాని ప్రభావం ఉంటుంది. ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. అది మిమ్మల్ని క్రియేటివ్ వర్క్‌కి దూరం చేస్తుంది. కాబట్టి అహంకారాన్ని వీడితే అంతా మంచే జరుగుతుందని గుర్తించాలి.
వృశ్చిక రాశి (Scorpio)
ఇవాళ మీరు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. వృత్తిపరంగా బాగా రాణిస్తారు. మీ కష్టానికి తగిన ఫలం దక్కే రోజు ఇది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో మంచి పలుకుబడి ఉన్న ఓ వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడుతుంది. అది మీ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తుంది. భాగస్వాములతో వివాదాలు పరిష్కారమవుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా మర్యాదగా వ్యవహరిస్తారు. చంద్రుడి అనుగ్రహంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారానికి సంబంధించి క్లిష్ట నిర్ణయాలు మీకు సంతోషాన్నిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు లభిస్తాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పెద్ద ఆర్డర్ మీకు లభిస్తుంది. అది వ్యాపార పురోగతికి దోహదపడుతుంది.
మకర రాశి (Capricorn)
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనిలో సంతృప్తిని పొందుతారు. భార్య లేదా భర్తతో రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. అది మీ బంధాన్ని మరింత బలపడేలా చేస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీరు చేపట్టిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తారు. ప్రేమికులు అనవసర విషయాలపై చర్చించవద్దు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం.
కుంభ రాశి (Aquarius)
ఇవాళ మీకు నిరాశజనకంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కలిసిరాకపోవచ్చు. చేపట్టిన ప్రతీ పనిలో ఆటంకం ఎదురవుతుంది. కొన్నిసార్లు సహనం కోల్పోతారు. అనవసరంగా ఇతరులపై అరిచే పద్దతి మానుకోండి. ఓపికతో పనులు చక్కబెట్టుకోవాలి. మీ వ్యక్తిగత సమస్యలను ఇతరులపై రుద్దవద్దు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సలహాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి.
మీన రాశి (Pisces)
మీ అహంకారాన్ని పూర్తిగా అణచుకోవాలి. లేనిపక్షంలో అది మీకు కొత్త తలనొప్పులు తీసుకొస్తుంది. వ్యాపార పరంగా లిక్విడిటీ పెరుగుతుంది. మీ సంపాదన, బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతాయి. భార్య లేదా భర్తతో ఎక్కువ సమయం గడుపుతారు. సింగిల్స్‌కు మంచి సంబంధం రావొచ్చు. ప్రేమికులు పెళ్లికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి పెట్టుబడులు కలిసొస్తాయి.
Also Read: PK KCR Meeting: సీఎం కేసీఆర్‌కు పీకే కీలక సూచన... వచ్చే ఎన్నికల్లో ఆ సిట్టింగ్‌లను మార్చాల్సిందే..!
Also Read: LSG vs MI: రాహుల్ క్లాసిక్ సెంచరీ.. లక్నో ఘన విజయం! ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఔట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.