ఈ రోజు (8‌‌-9-2021) రాశి ఫలాలు (Horoscope)  ఈ విధంగా ఉన్నాయి. కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. మరికొందరికి వృత్తి, వ్యాపారాల్లో కలిసిరానుంది. ఇంకొందరికీ వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం:  (Aries) కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. మంచి వార్తలు వింటారు. ధన, వస్తులాభాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశం ఉంటుంది. ఆలయాలను దర్శించుకుంటారు. మీ వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి.


వృషభం:  (Taurus) పనుల్లో ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చుల్లో జాగ్రత్తగా ఉండండి.  వ్యయప్రయాసలుంటాయి. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అనారోగ్యం తలెత్తొచ్చు. వ్యాపారాలలో ఒడిదుడుకులు సంభవించవచ్చు. 


మిథునం:  (Gemini) రుణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. కుటుంబంలో చికాకులు ఏర్పడొచ్చు. అనారోగ్యం తలెత్తే అవకాశం ఉంటుంది. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తలెత్తుతాయి.


కర్కాటకం:  (Cancer) ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.  పలుకుపడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు ఉండొచ్చు. వృత్తి,వ్యాపారాలలో పురోగతి ఉండే అవకాశం ఉంటుంది. 


సింహం:  (Leo) రాబడికి మించి ఖర్చులు పెట్టాల్సి వస్తోంది.  కుటుంబంలో సమస్యలు తలెత్తొచ్చు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం కలగవచ్చు. 


Also Read : Ganesh Chaturthi 2021: వినాయక చవితి రద్దీ దృష్ట్యా 261 ప్రత్యేక రైళ్లు


కన్య:  (Virgo) కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.


తుల: (Libra) వ్యవహారాలలో అవరోధాలు తలెత్తొచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం బారిన పడతారు. కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తొచ్చు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.


వృశ్చికం: (Scorpio) కొత్త పనులకు శ్రీకారం చేపడుతారు.  ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం వింటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది.


ధనుస్సు: (Sagittarius) కుటుంబంలో శుభకార్యాలుంటాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది.  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.


మకరం:  (Capricorn) ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.


కుంభం:   (Aquarius) మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా సమస్యలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.


మీనం: (Pisces) శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. మానసిక అశాంతి కలుగుతుంది. 


ఇవి ఈ రోజు జాతకచక్రాలు (Horoscope) మరి మీ రాశి ప్రకారం కలిగే ఇబ్బందులు, లాభాలు దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లండి. 


తిథి ‌‌- శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.విదియ తె.4.09 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి తదియ, నక్షత్రం ఉత్తర సా.6.10 వరకు బతదుపరి హస్త, వర్జ్యం రా.2.14 నుంచి 3.47 వరకు దుర్ముహూర్తం ప.11.32 నుండి 12.22 వరకు అమృతఘడియలు... ఉ.11.04 నుండి 12.38 వరకు. 


సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 


Also Read : Zodiac Signs: ఈ రాశుల వారికి సిగ్గు, మెుహమాటం ఎక్కువ... ఎందుకో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook