Horoscope Today August 14th 2022: ఇవాళ ఆదివారం. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజున సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆ దైవ అనుగ్రహం కలుగుతుంది.మరి ఈ ఆదివారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


మీ చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయ సహకారాలు పొందుతారు. ఆఫీసులో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ బాస్ నుంచి కాంప్లిమెంట్స్ అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. లేనిపక్షంలో ఇబ్బందులు వెంటాడుతాయి.ఈ సమయం కాస్త సవాల్‌తో కూడుకున్నదిగా ఉంటుంది. ఊహా ప్రపంచాన్ని వీడి నిజ జీవిత పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించాలి.


వృషభ రాశి (Taurus)


ఆర్థికపరమైన లావాదేవీలకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేసేవారు బాగా సక్సెస్ అవుతారు. ఇతర వ్యాపారస్తులు కూడా సక్సెస్‌ను చవిచూస్తారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఇది తగిన సమయం. ఇంటి అవసరాల కోసం బాగానే ఖర్చు చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలిచ్చే ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమవుతారు. కోపం పనికిరాదు. ఏ పని చేపట్టినా ఓపికతో వ్యవహరించాలి.


మిథున రాశి (GEMINI)


దగ్గరి బంధువుతో కొంతకాలంగా నెలకొన్న వివాదం సమసిపోతుంది. కొందరు మధ్యవర్తుల సాయంతో ఆ వివాదం నుంచి బయటపడుతారు. ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. చిన్న పిల్లలు మీ పట్ల అలుగుతారు. విద్యార్థుల అకడమిక్‌పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూల సమయం. మీ ప్రేమ విషయాలు మూడో వ్యక్తితో చర్చించవద్దు. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.


కర్కాటక రాశి (Cancer) 


వివాహ బంధం బాగుంటుంది. బ్యాచిలర్స్‌కు మంచి పెళ్లి సంబంధాలు వస్తాయి. కొత్తగా పెళ్లయిన దంపతులు లాంగ్ డ్రైవ్ లేదా వెకేషన్‌కి ప్లాన్ చేస్తారు. భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడులపై ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగస్తులు తమ కొలిగ్స్‌ నుంచి సహాయ సహకారాలు పొందుతారు. కమర్షియల్ ట్రేడర్స్ చాలా అలర్ట్‌గా ఉండాలి. ఎవరితో ఏం మాట్లాడినా సరే విద్వేషం ఉండవద్దు.


సింహ రాశి (LEO)


ఆర్థికంగా ఇవాళ శుభదినం. స్థిరాస్తి కొనుగోలు విషయమై ఇవాళంతా బిజీ బిజీగా గడుపుతారు. బిగ్ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరికి అప్పులు ఇవ్వొద్దు, అప్పులు తీసుకోవద్దు. స్టాక్ మార్కెట్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టండి. సేవింగ్స్ ప్లాన్‌పై మరింత దృష్టి పెట్టండి. వ్యాపారంలో కొత్త ప్లాన్స్‌ను అమలుచేస్తారు. ప్రొఫెషనల్స్‌కి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.


కన్య రాశి (Virgo)


మీ భార్య లేదా భర్త పేరిట పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియుడు/ప్రేయసి అన్ని పనుల్లో మీ వెన్నంటే ఉంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. సాధారణ రోజుల్లో కన్నా ఇవాళ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగి లేని తలనొప్పులు తెచ్చుకోవద్దు.


తులా రాశి (Libra)


మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు. చిన్న చిన్న విషయాలకే దంపతుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ఇద్దరిలో ఒకరు సర్దుకుపోవాలి. ప్రేమను పంచడమే బంధాన్ని బలపరుస్తుందని గుర్తుంచుకోవాలి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు వస్తాయి. ప్రేమ జంటలు తమ ప్రియుడు లేదా ప్రేయసి నుంచి శుభవార్త వింటారు. 


వృశ్చిక రాశి (Scorpio)


ఫ్యామిలీ బిజినెస్‌లో లాభాలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. ఇంటి పునర్నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలి. మేనేజ్‌మెంట్ హోదాలో ఉన్నవారు మునుపటికన్నా బాగా రాణిస్తారు. ఉన్నతాధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో రాణించేందుకు బాగా కృషి చేస్తారు.


ధనుస్సు రాశి (Sagittarius)  


ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది. మీరెవరినైనా ఇష్టపడి,వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లయితే.. ఆ విషయాన్ని వారితో వ్యక్తపరచడానికి ఇవాళ అనుకూల సమయం. మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. చేపట్టిన పనులకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని పొందుతారు. పనులు వేగవంతంగా సాగుతాయి.


మకర రాశి (Capricorn) 


ఉద్యోగస్తులపై పని భారం ఎక్కువగా ఉంటుంది. మునుపటికన్నా ఎక్కువ కష్టపడుతారు. మీ ఆర్థికపరిస్థితి మెరుగవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇవాళ లాభాలు రావొచ్చు. స్వచ్చంద సంస్థలు లేదా మతపరమైన సంస్థలకు తోచిన ఆర్థిక సాయం చేస్తారు. మీ పట్ల అందరికీ గౌరవం పెరుగుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు పొందుతారు. 


కుంభ రాశి (Aquarius)


ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. బిజినెస్ విస్తరణకు ప్రయత్నాలు మొదలుపెడుతారు. ఇవాళ ఎవరి వద్ద అప్పు తీసుకోవద్దు. ఐరన్ ట్రేడర్స్‌కు ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శించే  అవకాశం ఉంది.


మీన రాశి (Pisces) 


పని భారం, ఒత్తిడి కారణంగా మానసికంగా, శారీరకంగా అలసిపోతారు. థైరాయిడ్ సంబంధిత సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన మందులు వాడాలి. మహిళలు తమ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధతో ఉండాలి. ఆర్థికపరంగా ఇవాళ సాధారణ పరిస్థితులు ఉంటాయి. ఖర్చులు కూడా అదుపులోనే ఉంటాయి. కమర్షియల్ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: ప్ర‌భాస్ అభిమానులకు శుభవార్త.. ఆగ‌స్టు 15న స‌లార్ నుంచి బిగ్ అప్‌డేట్‌!


Also Read: Trivikram: ఆ సెంటిమెంట్ దెబ్బతో టెన్షన్లో మహేష్ ఫాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook