Trivikram: ఆ సెంటిమెంట్ దెబ్బతో టెన్షన్లో మహేష్ ఫాన్స్

Trivikram Tension To Mahesh Babu Fans: మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయబోతున్న క్రమంలో ఆయన అభిమానులలో కొత్త టెన్షన్ నెలకొంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 06:04 PM IST
Trivikram: ఆ సెంటిమెంట్ దెబ్బతో టెన్షన్లో మహేష్ ఫాన్స్

Trivikram Tension To Mahesh Babu Fans: ఒకప్పుడు మాటల రచయితగా కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్ తర్వాత కాలంలో దర్శకుడుగా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. హిట్ సినిమాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. చివరిగా అల వైకుంఠపురం అనే సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన ఆయన తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా ప్రకటించారు.

తర్వాత ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో మహేష్ బాబు 28వ సినిమా చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు త్రివిక్రమ్ సెంటిమెంట్ మహేష్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా హీరోలను రిపీట్ చేస్తూ ఉంటారు.

అలా చేస్తూ అల్లు అర్జున్ తో మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి అలా వైకుంటఠరంలో సినిమాలు చేస్తే మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అదే పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన జల్సా సినిమా సూపర్ హిట్ కాగా తర్వాత చేసిన అత్తారింటికి దారేది సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆయనతో చేసిన మూడో సినిమా అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు మహేష్ బాబు విషయానికి వస్తే ఆయనతో చేసిన అతడు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వచ్చిన ఖలేజా మాత్రం తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది.. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందా అనే విషయం మీద మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండో సినిమా ఇబ్బంది పెట్టాడు కాబట్టి మూడో సినిమాతో హిట్ ఇవ్వచ్చని వారు భావిస్తున్నారు. కానీ ఆ విషయం మీద మాత్రం వారు టెన్షన్ పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు వినిస్తున్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.
Also Read: Ashwini Dutt: ఆ నిర్మాతలను టార్గెట్ చేస్తూ అశ్వినీదత్ సంచలనం.. సహకరించే వాడికి కానంటూ కామెంట్స్!

Also Read: Jalsa: థియేటర్లలో సందడి చేయనున్న జల్సా.. 4K క్వాలిటీతో సంజయ్ సాహో రీఎంట్రీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News