Horoscope Today August 19th 2022: ఇవాళ శుక్రవారం. శ్రీమహాలక్ష్మీకి అంకితం చేయబడిన రోజు. శ్రావణ శుక్రవారం కావడంతో ఈరోజున మహాలక్ష్మి అనుగ్రహం పొందితే ఇంటికి ఆ దేవత నడిచొస్తుందని నమ్ముతారు. ఈ శ్రావణ శుక్రవారం ఆ లక్ష్మీ దేవి అనుగ్రహం ఎవరికి కలుగనుంది.. ఏయే రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


ఇవాళ మీకు శుభదినం. మీ చుట్టూ పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువుల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎట్టకేలకే మంచి జాబ్ దొరుకుతుంది. మీలోని ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకునేలా దోహదపడుతుంది.లక్ష్యం వైపు మీ దృష్టి చాలా క్లియర్‌గా ఉంటుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడుతారు.


వృషభ రాశి (Taurus)


ఇవాళంతా నిరాశజనకంగా గడుస్తుంది. మనసేమీ బాగోదు. ఆరోగ్యం కూడా సహకరించదు. అన్నివిధాలుగా నిరాశ, నిస్తేజం అలుముకుంటుంది. ఒంటరిగా ఒక క్రాస్ రోడ్స్‌లో నిలబడిన భావన కలుగుతుంది. మీ అంతరంగంతో మాట్లాడండి.. అంతరాత్మ ప్రబోధానుసారం వ్యవహరించడం. అది కాస్త ఊరట కలిగించవచ్చు. వీలైనంత వరకు డ్రైవింగ్‌కి దూరంగా ఉండండి. ముఖ్యంగా అడ్వెంచర్ టూరిజంకు దూరంగా ఉండండి. 


మిథున రాశి (GEMINI)


వ్యాపారస్తులకు ఇవాళంతా లాభాలే తప్ప నష్టాలు ఉండవు. తక్కువ కృషితోనే ఎక్కువ రాబడి పొందుతారు. గతంలో చవిచూసిన నష్టాలన్నీ ఇప్పటి లాభాలతో బ్యాలెన్స్ అవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్లాన్ చేస్తారు. మతపరమైన లేదా స్వచ్చంద సంస్థలకు తోచిన సాయం చేస్తారు. ఆపదలో ఉన్నవారు సాయం కోరితే కాదనకుండా తోచిన సాయం చేస్తారు.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ ఏ పని చేపట్టినా అద్భుతంగా రాణిస్తారు. వృత్తిరీత్యా మీ పెర్ఫామెన్స్ ఇతరులు మెచ్చుకోగదగినదిగా ఉంటుంది. మీ బాస్, సీనియర్లు, కొలిగ్స్ అంతా మీ పనితీరును అభినందిస్తారు. మీకోసం కొత్త ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తగిన జాబ్ దొరుకుతుంది. సింగిల్స్‌‌కి పని ప్రదేశంలోనే తమ లవ్‌మేట్‌తో పరిచయం ఏర్పడుతుంది.


సింహ రాశి (LEO)


ఇవాళ విధి మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ పనులైనా సులువుగా పూర్తి చేయగలరు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. ఏదేని పుణ్యక్షేత్రం లేదా ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. మతపరమైన సంస్థలకు ఏదైనా దానం చేసేందుకు సిద్ధపడుతారు. పెద్దల ఆశీస్సులు ఉంటే మీకు తిరుగుండదు. ముఖ్యంగా వ్యాపారస్తులు అద్భుతంగా రాణించగలరు.


కన్య రాశి (Virgo)


ఇవాళంతా నిరాశే వెంటాడుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. అవి మీ డైలీ రొటీన్స్‌కు అడ్డుపడుతాయి. మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని మీలోని నెగటివ్స్‌ని తొలగించుకునేందుకు ప్రయత్నిస్తారు. పది మందిలో కూర్చొన్న ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది. దేనిపైనా దృష్టి పెట్టలేరు. ఏకాగ్రత చెదురుతుంది. పెద్దల ఆశీస్సులతో గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడుతారు.


తులా రాశి (Libra)


ఇవాళ కొత్త బిజినెస్ ఆర్డర్స్ వస్తాయి. అందులో మీకు చాలా లాభాలను చేకూర్చే డీల్ ఒకటి ఉంటుంది. వ్యాపారంలో మీరు అమలుచేసే కొత్త ప్లాన్స్, వ్యూహాలు మీకు మరింతగా కలిసొస్తాయి. కొత్త భాగస్వాములు మీతో చేరే అవకాశం ఉంది. ఇవాళంతా బిజినెస్‌లో తీరిక లేకుండా గడుపుతారు. మానసికంగా కొంత అలసటకు గురవుతారు. ఇది మీ కుటుంబ జీవితంపై కొంత  ప్రభావం చూపుతుంది.


వృశ్చిక రాశి (Scorpio)


గతంలో వాయిదా వేయబడిన పనులు ఇప్పుడు పూర్తి చేయగలరు. ఇందుకు మీ కొలిగ్స్ సహకరిస్తారు. గతం కన్నా మీ పెర్ఫామెన్స్ మెరుగుపడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఇతరుల నుంచి అప్పు తీసుకునే అవకాశం ఉంది. అయితే అప్పు విషయంలో ఆచీ తూచీ వ్యవహరించండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు తగిన జాబ్ పొందుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఇవాళంతా మీకు అనుకూలంగా ఉంటుంది. జీవితం భారంగా అనిపించిన ఫీలింగ్ నుంచి బయటపడుతారు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల్లో చిక్కుకుంటారు. అవి లేని చిక్కులు తెచ్చిపెడుతాయి. పెద్దల ఆశీస్సులతో గందరగోళ పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. జీవిత భాగస్వామి సలహాలు మీ వ్యాపారంలో కలిసొస్తాయి. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది.


మకర రాశి (Capricorn) 


చేపట్టిన టాస్క్‌లు పూర్తి చేయలేరు. అన్నీ అసంపూర్తిగా మిగిలిపోతాయి. అది మీ పనితీరుకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. మూడ్ స్వింగ్స్‌ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బందిపడుతాయి. మీ సహనం పరీక్షించబడుతుంది. చిన్న చిన్న తప్పులు పెద్ద చిక్కులు తీసుకొస్తాయి. అది మీలో మరింత కన్ఫ్యూజన్‌ని నింపుతుంది. అతిగా ఆశించడం వల్ల జీవిత భాగస్వామితో మీ ఎమోషనల్ అటాచ్‌మెంట్‌పై ప్రభావం పడుతుంది. 


కుంభ రాశి (Aquarius)


ఇరుగుపొరుగుతో నెలకొన్న వివాదాలు సమసిపోతాయి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఔటింగ్‌కి వెళ్తారు. విద్యార్థులు బద్దకాన్ని అధిగమిస్తారు. మీ సోషల్ లైఫ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. గతంలో పెండింగ్ పడిన పనులు ఇప్పుడు చకచకా పూర్తి చేసేస్తారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.


మీన రాశి (Pisces) 


కుటుంబ సంబంధిత విషయాల్లో ఇవాళ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అది మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. నిరుపయోగమైన వాటి కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయవద్దు. జేబులో డబ్బు బయటకు తీస్తున్నారంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ముక్కుసూటితనం పనికిరాదు. దాన్ని అదుపులో ఉంచుకుంటే మీకే మంచిది. వృత్తిపరంగా, కుటుంబపరంగా అంతా సాఫీగా సాగుతుంది. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)


Also Read : Big Debate With Bharath : కోమటిరెడ్డిపైకి అద్దంకిని ఉసిగొల్పింది రేవంత్ రెడ్డేనా ?


Also Read: Liger Movie Censor : లైగర్ మూవీ సెన్సార్ రిపోర్ట్.. ఆ బూతులు, సైగలకు సెన్సార్ కట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook