Horoscope Today August 21st 2022: ఇవాళ ఆదివారం. ఈ ప్రపంచాన్ని వెలిగించే సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు.ఆదివారం నాడు సూర్య మంత్రం పఠిస్తూ సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మరి ఈ ఆదివారం ఏయే రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదే అదనుగా ప్రత్యర్థులు మీపై చెలరేగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులో మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు చేపట్టిన ప్రాజెక్ట్ మంచి ఫలితాలనిస్తుంది. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభావశీలురైన కొందరు వ్యక్తులు నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారులు ప్రశంసలు, అభినందనలు పొందుతారు. మార్కెటింగ్ రంగంలో, టార్గెట్ బేస్డ్ రంగంలో పనిచేసేవారిపై ఒత్తిడి అధికంగా ఉంటుంది.


వృషభ రాశి (Taurus)


ప్రేమలో ఉన్నవారు, పెళ్లయినవారు తమ పార్ట్‌నర్‌తో ఇవాళ రొమాంటిక్‌గా గడుపుతారు. బ్యాచిలర్స్‌కు పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. ఉద్యోగస్తుల పనిభారం కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుంది. జీవితభాగస్వామితో తగినంత సమయం గడపకోవడం వారికి మీపై ఆగ్రహం తెప్పిస్తుంది. ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలను ఇంట్లోనే ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా డీల్ చేయగలగాలి. రచ్చకెక్కి పరువు పోగొట్టుకోవద్దు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది.


మిథున రాశి (GEMINI)


మీడియా రంగంలో ఉన్నవారికి ఇవాళ శుభదినం. ఉద్యోగస్తులు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. వుడ్ ట్రేడర్స్‌కి కలిసొస్తుంది. గతంలో చేపట్టిన కొన్ని పనుల్లో మీకు రావాల్సిన డబ్బు ఎట్టకేలకు ఇప్పుడు అందుతుంది. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంటారు. ప్రేమలో ఉన్నవారు ఆ విషయాన్ని పెద్దలకు చెప్పేందుకు సరైన సమయాన్ని ఎంచుకోండి. అందరితో మర్యాదపూర్వకంగా మెలగండి.


కర్కాటక రాశి (Cancer) 


కుటుంబంలో ఏవైనా కలహాలు,సమస్యలు ఉంటే పెద్దల సలహాలు కోరండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ సాయంత్రం స్నేహితులతో కలిసి సోషల్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండండి. లేనిపక్షంలో మీ ఇమేజ్‌కు డ్యామేజ్ ఏర్పడుతుంది. వ్యాపారంలో కొత్త ప్లాన్స్‌ను అమలుచేసే అవకాశం ఉంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది.


సింహ రాశి (LEO)


ఆధ్యాత్మిక లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫ్యామిలీతో కలిసి లాంగ్ జర్నీకి ప్లాన్ చేస్తారు. రిలేటివ్స్‌తో బంధం మరింత బలపడుతుంది. ఇరువురు ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. ప్రేమ జంటలు, వివాహితులు సంతోష సమయం గడుపుతారు. కొన్నాళ్ల పాటు వేధించిన చేదు జ్ఞాపకాలను మరిచిపోతారు. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆర్థిక స్థితి బాగుంటుంది.


కన్య రాశి (Virgo)


ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు దాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు ఇవాళే ఫస్ట్ స్టెప్ వేస్తారు. వైవాహిక బంధంలో గొడవలు, చికాకులు, మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. ఇవాళ దంపతులు చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా జరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అయ్యే సంకేతాలు అందుతాయి. మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు అందరి సహాయ సహకారాలు అందుతాయి.  


తులా రాశి (Libra)


ఎక్స్ లవర్స్‌ మళ్లీ కలుస్తారు. పాత ప్రేమ బంధం మళ్లీ చిగురించే అవకాశం ఉంది. పాత చేదు అనుభవాలు, జ్ఞాపకాలు మరిచి కొత్త ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇవాళ ఎవరితో ఏం మాట్లాడినా ఆచీ తూచీ వ్యవహరించండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులు కొలిగ్స్‌తో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తారు. మీ బాస్ మీ పనితీరు పట్ల సంతృప్తితో ఉంటారు.


వృశ్చిక రాశి (Scorpio)


బిజినెస్ డెడ్‌లైన్ పట్ల ఫోకస్ చేయండి. ఏ పనిని పెండింగ్ ఉంచవద్దు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌లో ఉన్నవారికి ఇవాళ మంచి లాభాలు ఉంటాయి. కొన్ని ముఖ్య పనులను మరింత స్పీడప్ చేస్తారు. కొత్త కాంట్రాక్టులు చేపట్టేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు మీకు గందరగోళంగా అనిపిస్తే.. రెగ్యులర్ వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలి. వీలైతే మీ జీవిత భాగస్వామి సలహా కోరాలి.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఖర్చులు అదుపులో ఉంచుకోండి. విచ్చలవిడిగా ఖర్చు పెడితే భవిష్యత్తులో చేతులు కాల్చుకుంటారు. ఫైనాన్షియల్ ప్లాన్స్‌ జాగ్రత్తగా సిద్ధం చేసుకోండి. ఇవాళంతా తీరిక లేకుండా గడుపుతారు. పని పని అంటూ ఎప్పుడూ పనిలో మునిగితేలుతారు. అది మీ కుటుంబానికి నచ్చకపోవచ్చు. స్వచ్చంద సంస్థలు, సేవా సంస్థలకు తోచిన ఆర్థిక సాయం చేస్తారు.


మకర రాశి (Capricorn) 


ప్రేమికులకు, వివాహితులకు ఇవాళ శుభదినం. మీ జీవితభాగస్వామిని లేదా ప్రేయసి/ప్రియుడిని బాధించే మాటలు గానీ విషయాలు గానీ వారితో పంచుకోవద్దు. ఒకవేళ అలా చేస్తే రిలేషన్‌షిప్‌లో లేనిపోని తలనొప్పులు, గ్యాప్స్ పెరుగుతాయి. ఎవరితో మాట్లాడినా మర్యాదపూర్వకంగా మెలగండి. కొత్త స్నేహితులు ఏర్పడుతారు. బ్యాచిలర్స్‌కి తగిన జోడీ జరుగుతుంది.


కుంభ రాశి (Aquarius)


ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయి. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తారు. మీరు చేపట్టే పనుల్లో క్వాలిటీ పెరగాల్సి ఉంటుందని గుర్తిస్తారు. యువతకు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. కొన్ని కొత్త ప్లాన్స్‌ను అమలుచేయడం ఆర్థికంగా మీకు కలిసిరావొచ్చు. మహిళలు ఏదైనా కొత్త వర్క్ చేపట్టే అవకాశం ఉంటుంది. ఐటీ సెక్టార్‌లో ఉన్నవారికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.


మీన రాశి (Pisces) 


ఏదైనా స్థిరాస్తి అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా దానితో ముడిపడి ఉన్న న్యాయపరమైన అంశాలను పరిశీలించండి. లేనిపక్షంలో చిక్కులు తప్పకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. రాబడి పెరగడం మీకు ఎనలేని సంతోషాన్నిస్తుంది. పాత పెట్టుబడులు ప్రాఫిట్స్ తీసుకొస్తాయి. ఫారిన్ బిజినెస్‌లో ఉన్నవారికి లాభాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల పట్ల మీ ఆసక్తి మరింత పెరుగుతుంది. లక్ష్యంపై ఎప్పుడూ ఫోకస్‌ పెట్టి ఉంచాలి. ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాలి. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Heavy Rains: హిమాచల్‌ప్రదేశ్‌లో వరద విలయం..22 మంది మృతి, పలువురు గల్లంతు..!


Also Read:Vijay Devarakonda Boycott Liger: ఇండియా ఫ్లాగ్ ఎగరవేస్తే సినిమాని బాయికాట్ చేస్తారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook