Horoscope Today August 28th 2022: ఇవాళ ఆదివారం. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్య దేవుడిని ప్రత్యేకంగా పూజించే రోజు. నీళ్లలో కుంకుమ, పువ్వులు వేసి.. ఆ నీటిని సూర్య సమక్షంలో మర్రిచెట్టుకు సమర్పిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇవాళ ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


వృత్తిపరంగా ఇవాళ కలిసొస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పట్ల అందరిలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. కొత్త వర్క్ మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో సీనియర్ల సహాయ సహకారాలు లభిస్తాయి. క్రియేటివ్ రంగంలో పనిచేసేవారికి సక్సెస్ అందుతుంది. యువతకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీరు ప్రేమించే వ్యక్తుల నుంచి గుడ్ న్యూస్ వింటారు.


వృషభ రాశి (Taurus)


ఆర్థికపరంగా ఇవాళ అంతంతమాత్రంగానే ఉంటుంది. మీకు అందాల్సిన డబ్బు రాకుండా నిలిచిపోతుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కి మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. స్థిరాస్తి పెట్టుబడులు కూడా మీకు కలిసొచ్చే అవకాశం ఉంది. కెరీర్, బిజినెస్ సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మీరు ప్రేమించే వ్యక్తులకు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసే అవకాశం ఉంది.


మిథున రాశి (GEMINI)


కష్టాల్లో ఉన్న మిమ్మల్ని దగ్గరి బంధువులు ఆదుకుంటారు. అది మీలో కృతజ్ఞతా భావాన్ని నింపుతుంది. అప్పటిదాకా ఎదుర్కొన్న ఒత్తిడి నుంచి బయటపడుతారు. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి బయట డిన్నర్‌కు ప్లాన్ చేస్తారు. మీ చుట్టూ మీకు సాయపడే మనుషులు ఉంటారు. ముఖ్యమైన పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతారు.


కర్కాటక రాశి (Cancer) 


వైవాహిక జీవితంలో గొడవలు జరగవచ్చు. జీవితభాగస్వామితో మనస్పర్థల కారణంగా పోట్లాట జరగవచ్చు. ఏం మాట్లాడినా మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఏ బంధంలోనైనా కఠినంగా వ్యవహరించకండి. మీ లైఫ్ స్టైల్‌ మరింత మెరుగవుతుంది. ఇవాళ స్నేహితులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది.


సింహ రాశి (LEO)


ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. ముఖ్యంగా మీరు డయాబెటీస్ లేదా హార్ట్ పేషెంట్ అయినట్లయితే టైమ్ టు టైమ్ మెడిసిన్ తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు వేగం పెంచుతారు. ఉద్యోగ లేదా వ్యాపారపరమైన చర్చల్లో మీరు చాలా ఎఫెక్టివ్‌గా వ్యవహరిస్తారు. వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. బిజినెస్ చేసేవారికి లేదా ఉద్యోగులకు ఇవాళ ఎవరి నుంచైనా బహుమతి లభించవచ్చు.


కన్య రాశి (Virgo)


వ్యాపారంలో చాలా రోజుల తర్వాత ఇవాళ లాభాలను చవిచూస్తారు. ఇతరుల సాయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఆకస్మిక ప్రయాణాలు మానసిక అలసటకు గురిచేస్తాయి. ఇవాళంతా పని పని అంటూ గడుపుతారు. కెరీర్‌లో కొన్ని అద్భుత ఫలితాలు సాధించబోతున్నారనే విషయం మీకు అర్థమవుతుంటుంది.


తులా రాశి (Libra)


ప్రేమ బంధంలో టెన్షన్ తగ్గుతుంది. పార్ట్‌నర్‌తో ఎక్కువ సమయం గడిపే ఛాన్స్ దక్కుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడవద్దు. ముఖ్యమైన విషయాలు లేదా పనుల్లో అంతా మీకు అనుకూలంగా జరుగుతుంది. ఎప్పుడూ పాజిటివిటీతో ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.


వృశ్చిక రాశి (Scorpio)


ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ కష్టం మీకు సక్సెస్‌ను అందిస్తుంది. ఇతరుల నుంచి అప్పు కోరే అలవాటు మానుకోండి. కొత్త ఇల్లు లేదా వాహన కొనుగోలుకు ప్లాన్ చేస్తారు. పెట్టుబడులకు ప్రతికూల సమయం. వృత్తిపరమైన సంబంధాలు మెరుగవుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది.  ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. కెరీర్ మెరుగవుతుంది.. సక్సెస్ కూడా పెరుగుతుంది.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఉద్యోగులకు ఇవాళ బిగ్ రిలీఫ్ లభించే ఛాన్స్ ఉంది. కీలక నిర్ణయాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి. పార్ట్‌నర్‌షిప్‌తో కూడిన బిజినెస్‌లో పారదర్శకత ముఖ్యమని గుర్తించండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారి మధ్య పట్టింపులేని తనం విభేదాలకు దారితీస్తుంది. ఐటీ సెక్టార్‌లో పనిచేసేవారికి కలిసొస్తుంది. పని సంబంధిత ఆటంకాలన్నీ తొలగిపోతాయి. 


మకర రాశి (Capricorn) 


మీ జీవిత భాగస్వామిని లేదా ప్రేయసి/ప్రియుడిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మీ రిలేషన్‌షిప్ పాడవుతుంది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను నొప్పించేలా మాట్లాడవద్దు. అవివాహితులైనవారికి వివాహ సంబంధాలు వస్తాయి. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వర్క్ కండిషన్స్ సాధారణంగా ఉంటాయి. మేనేజ్‌మెంట్ లేదా లీడర్‌షిప్‌కు గౌరవం ఇవ్వాలి. 


కుంభ రాశి (Aquarius)


ఆర్థికంగా పటిష్ఠమైన స్థితిలో ఉంటారు. సక్సెస్‌ను అందుకుంటారు. అన్నింటా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అనుకూలం. లవ్ రిలేషన్‌షిప్స్‌లో సహనం ముఖ్యం. మీ అంతరంగంతో మాట్లాడితే మీలోని లోపాలు మీకు తెలుస్తాయి. అందివచ్చిన అవకాశాలను చేజారనివ్వొద్దు. అందరితోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తారు.


మీన రాశి (Pisces) 


చిన్న పొరపాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేయాలి. లేనిపక్షంలో కొలెస్ట్రాల్ సంబంధి సమస్యలు ఎదుర్కొంటారు. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్‌ చేయొద్దు. స్మార్ట్ వర్క్ ద్వారానే బెనిఫిట్స్ పొందుతారు. పెద్దల మాట వినండి. అనవసర వాగ్వాదానికి దిగవద్దు. ప్రతీ ఒక్కరి మనోభావాలను గౌరవించాలి. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Asia Cup 2022: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ, 8 వికెట్ల తేడాతో విజయం


Also Read: JP NADDA MEETING LIVE UPDATES: నయా నిజాంను సాగనంపడానికే సంజయ్ యాత్ర.. కేసీఆర్ ఖేల్ ఖతమేనన్న జేపీ నడ్డా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook