Horoscope Today August 3rd 2022:  ఇవాళ బుధవారం. హిందువులు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇది బుధుడికి అంకితం చేయబడిన రోజు. మరి ఈ బుధవారం ఏ రాశి వారి జాతక ఫలం ఎలా ఉందో తెలుసుకోండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


ప్రస్తుతం మీరు చేస్తున్న బిజినెస్‌లో లాభాలు చవిచూస్తారు. ప్రాపర్టీ డీలర్స్‌కు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌కు ఇవాళ కలిసొస్తుంది. వ్యాపారస్తులు ఒక పెద్ద ఆర్డర్‌ను తృటిలో కోల్పోతారు. తమ కృషితో ఆ ఆర్డర్‌ను తిరిగి పొందగలరు. ఇంట్లో శుభకార్యం చోటు చేసుకుంటుంది. కుటుంబమంతా సెలబ్రేషన్ మూడ్‌లో ఉంటారు. యువత చెడు సహవాసాలకు దూరంగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా కీలక నిర్ణయాలు తీసుకునేముందు బాగా ఆలోచించాలి.


వృషభ రాశి (Taurus)


వ్యాపార విస్తరణ పనులు చేపడుతారు. తద్వారా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు వేతన పెంపు ఉండొచ్చు. డబ్బును పొదుపు చేయడంలో మీకు మీరే సాటి. ఫ్రీలాన్సర్స్‌గా పనిచేస్తున్నవారికి ఒక మంచి ఆఫర్ అందుతుంది. మీ కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి ఇచ్చే ఆలోచన చాలా బాగా ఉపయోగపడుతుంది. వృత్తిరీత్యా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఈ ప్రయాణాన్ని మీరు ఆస్వాదించలేరు.


మిథున రాశి (GEMINI)


మీరు ట్రేడింగ్‌ చేస్తున్నట్లయితే ఇవాళ ఊహించని స్థాయిలో డబ్బును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా మీ ప్లాన్స్ సజావుగా సాగుతాయి. ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై మునుపటి కన్నా ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మీ జీవితభాగస్వామి సున్నిత మనసు కలిగి లేకపోవడం వల్ల మీ మనోభావాలు గాయపడవచ్చు. లాంగ్ డ్రైవ్‌కి ప్లాన్ చేసుకున్నవారు ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాలకు ఇది అనువైన రోజు కాదు.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ మీకు అన్నివిధాలా లాభదాయకమే. ఊహించిన దాని కన్నా ఎక్కువ డబ్బు వచ్చి చేరుతుంది. మీరు చేపట్టిన పనికి సంబంధించి ఉన్నతాధికారుల నిర్ణయాన్ని మీరు అభినందిస్తారు. ఇంటికి సంబంధించి కొన్ని నిర్మాణ పనులు చేపడుతారు. వృత్తిరీత్యా చేయాల్సిన ప్రయాణం ఫన్ ట్రిప్‌గా మారుతుంది. చాలాకాలంగా విక్రయించాలనుకుంటున్న మీ ప్రాపర్టీకి ఇప్పుడు సరైన ధర లభించవచ్చు. మీరు కోరుకున్న మొత్తం లభించగానే రెండో ఆలోచన లేకుండా ప్రాపర్టీని విక్రయిస్తారు.


సింహ రాశి (LEO)


ఆర్థికంగా కలిసొస్తుంది. పని విషయంలో చాలా సంతృప్తితో ఉంటారు. వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మనశ్శాంతి, ప్రశాంతతను పొందుతారు. స్నేహితులు కలిసి డ్రైవింగ్‌కి వెళ్లడం ఎక్కడ లేని సంతోషాన్నిస్తుంది. ఇవాళ ఎలక్ట్రిక్ బ్లూ మీకు కలిసొచ్చే రంగు.


కన్య రాశి (Virgo)


ఆర్థికంగా బాగుంటుంది. వృత్తిరీత్యా మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఆరోగ్యం విషయంలో ఆలస్యంగా మేల్కొంటారు. కొంతకాలంగా వెంటాడుతున్న వివాదం నుంచి కుటుంబ సభ్యుల సలహాతో బయటపడుతారు. బంధుమిత్రుల ఇన్విటేషన్ మేరకు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆస్తి సంబంధిత టెన్షన్స్ తొలగిపోతాయి. గెట్ టు గెదర్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. 


తులా రాశి (Libra)


ప్రొఫెషనల్స్‌కి ఇవాళ అనుకూల సమయం. చాలా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా తిరుగుండదు. బయటి వ్యక్తుల నుంచి పొందే మాట సాయం కూడా అద్భుతంగా కలిసొస్తుంది. పాత స్నేహితులు, బంధువులను కలిసే అవకాశం ఉంది. రోజూ ప్రయాణాలు చేసేవారు ఇవాళ కొంత అలసటకు గురవుతారు. ఇటీవల అమ్మకానికి పెట్టిన ప్రాపర్టీ ద్వారా మంచి లాభం పొందుతారు.


వృశ్చిక రాశి (Scorpio)


ధనాన్ని నిలుపుకోవడం మీకో సవాల్‌గా మారుతుంది. ఈ విషయంలో మీరు సక్సెస్ అవుతారు. వర్క్ విషయంలో ఒత్తిడిని జయిస్తారు.కుటుంబ జీవితంలో కొన్ని చికాకులు ఇబ్బందిపెడుతాయి. కొందరు వ్యక్తుల తీరుతో విసిగెత్తిపోతారు. ప్రయాణం మీకొక కొత్త అనుభూతిని, రీఫ్రెష్ ఫీలింగ్‌ను కలిగిస్తుంది.ఆస్తి సంబంధిత వివాదాలు సమసిపోతాయి. డార్క్ బ్రౌన్ కలర్ ఇవాళ మీకు లక్కీ కలర్ అని చెప్పొచ్చు.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఐటీ లేదా హాస్పిటాలిటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు కలిసొస్తుంది. అనారోగ్యంతో పోటీలో వెనుకబడ్డ వ్యాపారులు,ఉద్యోగులు తిరిగి పాత వేగాన్ని పుంజుకుంటారు. మీ పనితీరు ఇతరులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. పిల్లలతో ఫన్నీగా గడుపుతారు. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. వాటిని పిల్లల చదువు కోసం లేదా భవిష్యత్తు కోసం రిస్క్ లేని స్కీమ్స్‌లో పెట్టుబడులు పెడుతారు.


మకర రాశి (Capricorn) 


ఆర్థికపరంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తాయి. మీలోని క్రమశిక్షణ మీకు పెద్ద బలం. కుటుంబ బాధ్యతలకు ఇవాళ ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ప్రయాణంలో అనుకోని వ్యక్తితో పరిచయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ వ్యక్తి మిమ్మల్ని బాగా ఆకర్షిస్తారు. ఇవాళ మీకు పీచ్ కలర్ కలిసొస్తుంది.లక్కీ నంబర్ 1.


కుంభ రాశి (Aquarius)


ఆర్థికపరంగా ఊహించని స్థాయిలో ధన లాభం ఉంటుంది. ఆఫీసులో పని భారం పెరుగుతుంది.మరింత సమయం ఆఫీసులోనే గడపాల్సి వస్తుంది. వర్కౌట్స్, హెల్త్‌ను అశ్రద్ధ చేయరు. కుటుంబం కోసం ఎక్కువ సమయం వెచ్చించాలని నిర్ణయించుకుంటారు. వారితో కలిసి ఏదైనా టూర్‌కి ప్లాన్ చేస్తారు. అకడమిక్ రంగంలోని వారికి ఆటంకాలు తొలగిపోతాయి.


మీన రాశి (Pisces) 


ఏదైనా కొత్త ఫైనాన్షియల్ స్కీమ్‌లో పెట్టుబడి పెడుతారు. అది మీ సంపదను రెట్టింపు చేయడంలో దోహదపడుతుంది. వృత్తిపరంగా సానుకూల సమయం. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు. ప్రాపర్టీ సంబంధిత సమస్య పరిష్కారమవుతుంది. చాలాకాలంగా నెలకొన్న ఆందోళనలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Uma Maheshwari Deadbody Photos: ఉమా మహేశ్వరి కుటుంబసభ్యులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓదార్పు


Also Read: Komatireddy Rajagopal Reddy: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook