Horoscope Today, 31 December 2021 : ఆ రాశి వారికి స్నేహితుడే ద్రోహిగా మారే ప్రమాదం
Horoscope Today, 31 December 2021 : నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి సానుకూలత, మరికొన్ని రాశుల వారికి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎలాంటి సందర్భాలైనా సరే కొంత పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
Horoscope Today, 31 December 2021 : నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడుతాయి. కొన్ని రాశుల వారికి పనుల విషయంలో కొంత చికాకు, ఒత్తిడి తప్పవు. సున్నితంగా వ్యవహరించని కారణంగా కొన్ని సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆయా రాశుల వారు.. ఇవాళ తమకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో గమనించి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి...
మేషం : మార్పు అనేది జీవితంలో భాగం. కొన్ని మార్పులు సానుకూలంగా ఉంటే... కొన్ని ప్రతికూలతలు కలగజేస్తాయి. వాటి పట్ల విచారంతో కాకుండా పాజిటివిటీతో ఉండండి. బృహస్పతి మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఈరోజు ఏవైనా నాటకం వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు లేదా ఆర్ట్ షోకి హాజరయ్యేందుకు ఇష్టపడతారు. లక్కీ కలర్: మావ్ లక్కీ నంబర్: 7
వృషభం : కొన్ని విషయాలు మీరు మీలో ఆలోచించుకుంటూ సతమతమవుతుంటారు. అలా కాకుండా సన్నిహితులతో మీ భావాలు, ఆలోచనలు పంచుకోండి. తద్వారా కొంత ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివ్ దృక్పథాన్ని అలవరుచుకుని పునరుత్తేజంతో జీవితంలో ముందుకు సాగండి. కొన్ని విషయాల్లో ఈరోజు మీకు సానుకూలత చేకూరుతుంది. లక్కీ కలర్ : పింక్, లక్కీ నంబర్: 3
మిథునం : కొన్ని విషయాల్లో పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్స్ జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో మీకు నమ్మకస్తులైన వ్యక్తులతో మాట్లాడండి. ఈ రోజు రాతపూర్వక పనులు, బహిరంగ ఉపన్యాసాలకు సానుకూల సమయం. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. లక్కీ కలర్ : ఊదా, లక్కీ నంబర్ : 6
కర్కాటకం : కొన్ని రకాల భావాలను పక్కన పెడితే మీ లక్ష్యాలను చేరుకోగలరు. ఈరోజు చిన్నచిన్న చికాకులను మినహాయిస్తే రోజంతా యాక్టివ్‌గా, ప్రొడక్టివ్‌గా గడుస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు.. మీకు కొత్త ఆఫర్లు వస్తాయి. లక్కీ కలర్ : ఆకుపచ్చ, లక్కీ నంబర్ : 8
సింహం : స్త్రీలతో సంబంధాలు అర్థవంతంగా ఉంటాయి. ఒక స్త్రీ నుంచి మీకు విలువైన సహాయం అందే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలు బాగా రాణిస్తారు. ఇప్పటికే ప్రయత్నించిన అంశాలను ఇక పక్కన పెట్టండి. కొత్త వాటిని ప్రారంభించేందుకు ఇది సానుకూల సమయం. లక్కీ కలర్ : లేత గోధుమరంగు , లక్కీ నంబర్ : 2
కన్య : దీర్ఘకాలిక సంబంధాలను పరిగణలోకి తీసుకోండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఒక సాధారణ బంధం ధృఢమైన కమిట్మెంట్కు దారితీయవచ్చు. సోకాల్డ్ స్నేహితులకు సంబంధించి కొంత కీలక సమాచారం మీకు రివీల్ అయ్యే అవకాశం ఉంది. లక్కీ కలర్ : లిలక్, లక్కీ నంబర్: 5
తుల : ప్రత్యేక ప్రణాళికలు లేదా ప్రాజెక్ట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. పిల్లలతో ఆనందాన్ని పొందుతారు. తెలిసిన స్నేహితుడే మీకు ద్రోహిగా మారవచ్చు. మీకు, ఇతరులకు మధ్య కొంత గందరగోళం, ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. లక్కీ కలర్ : స్కార్లెట్, లక్కీ నంబర్ : 4
వృశ్చికం: మానసికంగా మీరు కొన్ని విషయాల పట్ల సరైన అవగాహనతో ఉండరు. ఈరోజు మీ బాస్ కొంత అసనహంతో ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. మీ నాయకత్వ యాటిట్యూట్ కొన్ని తప్పులకు దారితీయవచ్చు. వీలైనంత వరకు ఇవాళ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మంచిది. లక్కీ కలర్ : స్కై బ్లూ, లక్కీ నంబర్: 1
ధనుస్సు : కొన్ని విషయాల్లో సున్నితంగా లేనందునా కొన్ని సంబంధాలు దెబ్బతినవచ్చు. ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. ప్రొడక్టివిటీకి, ఆర్థిక సమస్యల పరిష్కారానికి అనువైన సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు వెనుకాడకండి. లక్కీ కలర్ : తేనె రంగు, లక్కీ నంబర్ : 3
మకరం : కొన్ని విషయాల్లో మీ తీర్పు స్పష్టంగా ఉండదు. వాస్తవిక దృక్పథం కోసం మీరు మీ భాగస్వామిపై ఆధారపడాల్సి ఉంటుంది. పారదర్శకతతో వ్యవహరించే దృక్పథాన్ని అలవరుచుకోండి. మీరు చేయాలనుకున్న పనులకు తగినంత సమయం దొరకట్లేదని చింతిస్తారు. విచారాన్ని పక్కన పెట్టి ముందుకు సాగండి. లక్కీ కలర్: వెనిలా, లక్కీ నంబర్ : 9
కుంభం : మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచనలను అశ్రద్ధ చేయవద్దు. కొన్ని విషయాల్లో వాదనలకు దిగకపోవడం ఉత్తమం. పనులను క్రమంగా చక్కబెట్టుకుంటూ ముందుకు సాగండి. లక్కీ కలర్: నారింజ, లక్కీ నంబర్: 8
మీనం : ఒక కొత్త పరిచయం లేదా సంబంధం మరింత బలపడుతుంది. ఈ క్రమంలో అతిగా ప్రవర్తించడం, దూకుడుగా వ్యవహరించడం చేయవద్దు.
ఒకరినొకరు బాగా తెలుసుకోవడం ద్వారా ఆ సంబంధం మరింత అర్థవంతంగా మారుతుంది. కొన్ని నిర్ణయాలు మీ మనసును తేలికపరుస్తాయి. లక్కీ కలర్ : కుంకుమ, లక్కీ నంబర్: 6
Also Read: India Corona update: మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు- 198 మందికి ఒమిక్రాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook