Horoscope Today, 7 December 2021 : రాశులు, నక్షత్రాలు, గ్రహాల కదలిక, తిథులు... ఇలా అన్నీ అనుకూలంగా ఉంటేనే చాలామంది కొత్త పనులు లేదా శుభాకార్యాలకు సిద్ధమవుతుంటారు. ఏవైనా ప్రతికూలతలు, దోషాలు ఎదురైతే జ్యోతిష్య పండితుల సూచన మేరకు దానికి పరిహారాలు చేస్తుంటారు. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి  ఎలాంటి అనుకూలతలు, ప్రతికూలతలు ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి అనుకూల గడియలు: 


ప్రతికూల గడియలు
రాహు - 2:52 PM – 4:15 PM
యమగండం - 9:22 AM – 10:45 AM
గుళికా - 12:07 PM – 1:30 PM
దుర్ముహూర్తం - 08:49 AM – 09:33 AM, 10:49 PM – 11:41 PM
వర్జ్యం - 03:56 AM – 05:26 AM


నేటి శుభ గడియలు: 


అభిజిత్ ముహుర్తాలు - 11:45 AM – 12:29 PM
అమృతకాలము - 06:21 PM – 07:49 PM
బ్రహ్మ ముహూర్తం - 05:01 AM – 05:49 AM


మేషం:
మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ బంధాలు మెరుగవుతాయి. దూరప్రయాణ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఎక్కువ సమయం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.


వృషభం:


వృషభ రాశి వారికి నేడు అదృష్టం కలిసొస్తుంది. అన్ని బంధాలు మెరుగవుతాయి. ప్రశాంత జీవనం గడుపుతారు. కొన్ని లాభదాయక పనులు జరిగే అవకాశం ఉంది.
 వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.


మిథునం:
బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని లాభదాయకమైన పనులు జరుగుతాయి. ఆకస్మిక ధన లాభం పొందవచ్చు. స్త్రీ సంబంధ విషయాలు, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారులు ఏమరపాటుగా ఉండవద్దు. ఆదాయ విషయంలో అన్నీ సానుకూలతలే కనిపిస్తున్నాయి.


కర్కాటకం:
వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఏదైనా పనులు చేపట్టే ముందు ఆలోచించి చేపట్టడం మంచిది.


సింహం:


మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనారోగ్యంతో బాధపడేవారు కోలుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరుకుతుంది. శ్రేయోభిలాషుల నుంచి విలువైన సలహాలు వింటారు. వ్యాపార విషయాలు సానుకూలంగా ఉంటాయి. 


కన్య:


విదేశీ చదువు, విద్యారంగం వంటి విషయాల్లో విద్యార్థులకు అన్నీ సానుకూలంగా జరుగుతాయి. ఈరోజు అదృష్టం పూర్తిగా మీ వెంటే ఉంటుంది. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాల్లో ఆచీ తూచీ వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.


తుల:


కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడుపుతారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి బహుమతులు రావడం లేదా ఇవ్వడం జరగవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు ఆచీ తూచీ వ్యవహరించాలి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకొడిగా ఉండవచ్చు.


వృశ్చికం:


ఆర్థిక పరిస్థితి కొంత ఆందోళన కలిగిస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో అకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. వృత్తిపరంగా కొంత ప్రతికూలతలు ఎదురవుతాయి. ఉద్యోగ విషయాలు కొంత ఆశాజనకంగా సాగవు.


ధనస్సు:


ఉద్యోగ, వృత్తి రంగాల్లో రాణిస్తారు. కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో బంధాలు మరింత మెరుగవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు.


మకరం:


ఉద్యోగ, వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంత చేకూరుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రతికూలతలు ఆందోళన కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు గడ్డు సమయమనే చెప్పాలి.


కుంభం:


కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి బహుమతులు లేదా ధనం అందవచ్చు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ విషయాల్లో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.


మీనం:


వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. మీ పెట్టుబడికి ఆశాజనకమైన ఫలితాలు పొందుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధ పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలున్నాయి. వ్యాపార విస్తరణకు కొంత అనుకూలత ఉంటుంది.