Horoscope Today Feb 20 2022: రాశి ఫలాలు.. ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఆ రాశివారికి ఇవాళ గుడ్ న్యూస్..
Horoscope Today Feb 20 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టవచ్చు. తల్లిదండ్రులు, భార్య ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది.
Horoscope Today Feb 20 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ పూర్తి అనుకూల సమయం కాగా, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల సమయం. ప్రతికూలత కలిగినవారు కొత్త పనులు, పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. లేనిపక్షంలో నష్టాలు చవిచూస్తారు. అనుకూలత కలిగినవారికి అన్ని విధాలుగా కలిసొస్తుంది కాబట్టి పెట్టుబడులు, కొత్త పనుల విషయంలో వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు.
మేషరాశి ( Aries)
ఇవాళ మీకు పూర్తి అనుకూల సమయం. అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. చాలాకాలంగా మీకు రాకుండా ఆగిపోయిన డబ్బులు ఎట్టకేలకు అందుతాయి. ఇల్లు లేదా ఏదేని లగ్జరీ వస్తువుల కొనుగోలుకు మీరు బ్యాంకు రుణం తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.
వృషభ రాశి (Taurus)
ఇవాళ అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. బద్దకం, పట్టింపులేని తనం మిమ్మల్ని ఇబ్బందిపెడుతాయి. చేసే పనులపై దృష్టి సారించలేరు. సహనం లేకపోవడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. భార్య లేదా పిల్లల ఆరోగ్యం మిమ్మల్ని కొంత బాధిస్తుంది. పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. ప్రేమికులు కుటుంబ విషయాల్లో వాదనలకు దిగవద్దు.
మిథున రాశి (GEMINI)
ఇవాళ మీకు పూర్తి ప్రతికూల సమయం. నెగటివ్ వైబ్రేషన్స్ వెంటాడుతుంటాయి. ఈరోజంతా నిరాశజనకంగా సాగుతుంది. పెట్టుబడులకు అనువైన సమయం కాదు. స్నేహితుల నుంచి ఆశించిన సాయం అందకపోవచ్చు. కాబట్టి వారి నుంచి ఎక్కువగా ఆశించి భంగపడవద్దు. కీలక నిర్ణయాల్లో మీ అంతరాత్మను ఫాలో అవండి.
కర్కాటక రాశి (Cancer)
ఇవాళ మీకు కలిసొస్తుంది. బిజినెస్ ప్లాన్స్‌ని విజయవంతంగా అమలుచేస్తారు. ఫ్యామిలీ గెట్ టు గెదర్స్‌లో పాల్గొనే అవకాశం. వ్యాపార పరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అది మీకు భవిష్యత్తులో కలిసొస్తుంది. వ్యక్తిగత, వ్యాపార జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది.
సింహ రాశి (LEO)
ఇవాళ మీకు అనుకూల సమయం. మీ ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి రాబడి ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రేమికులు తమ భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా మాటలు తూలవద్దు. లేనిపక్షంలో మనస్పర్థలు తలెత్తుతాయి.
కన్య రాశి (Virgo)
ఇవాళ ఎనర్జిటిక్‌గా ఉంటారు. పనిలో చురుగ్గా వ్యవహరిస్తారు. భార్యతో రొమాంటిక్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సాఫీగా సాగుతుంది. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఇవాళ గుడ్ న్యూస్ అందే అవకాశం. వారు కోరుకున్న జాబ్ దొరకవచ్చు. ప్రేమికులు అనవసర విషయాలపై చర్చించవద్దు.
తులా రాశి (Libra)
ఇవాళ మీకు నిరాశజనకంగా ఉంటుంది. కోపం, ఆవేశం, అహంకారం నియంత్రణలో ఉంచుకుంటే మీకే మంచిది. లేనిపక్షంలో అనవసర తలనొప్పులు తప్పవు. ప్రేమికులు ఆచీ తూచీ అడుగు వేయాలి. ప్రేమ సంబంధిత చర్చలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో మొదటికే మోసం వస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio)
ఇవాళ మీకు కలిసొస్తుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం చేకూరుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. గత నష్టాలను భర్తీ చేసేలా ఆ లాభాలు ఉంటాయి. తద్వారా ఆర్థికంగా బలపడుతారు. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఇవాళ మీరు చాలా సంతోషంగా గడుపుతారు. పనిలో బిజీ బిజీగా గడుపుతారు. మీ పనికి సీనియర్ల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రస్తుతం మీరు చేస్తున్న పనికి సంబంధించి ప్రమోషన్ లేదా బదిలీ వంటి మార్పులు ఉండొచ్చు. మీ శత్రువులు ప్రస్తుతానికి మీ జోలికి రారు. సింగిల్స్ పెళ్లికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మకర రాశి (Capricorn)
గతంలో వాయిదా వేసిన పనులను పూర్తి చేసేందుకు సిద్ధపడుతారు. మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారంల మంచి లాభాలు పొందుతారు. తద్వారా ఆర్థికంగా బలపడుతారు. లిటరేచర్, కళలకు సంబంధించిన వాటిపై డబ్బు ఖర్చు చేస్తారు. విదేశీ ట్రిప్స్ ప్లాన్ చేసే అవకాశం ఉంది.
కుంభ రాశి (Aquarius)
కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇతర మార్గాల్లో ఆదాయం కోసం ప్రయత్నాలు మొదలుపెడుతారు. సినిమాలు, కళాకృతులు, గ్లామర్ పట్ల ఆసక్తి కనబరుస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. వారి లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు.
మీన రాశి (Pisces)
అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతాయి. అది మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ సహనం చాలాసార్లు పరీక్షించబడుతుంది. భార్య అనారోగ్యం మిమ్మల్ని మరింత బాధపెడుతుంది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టవద్దు. ఒకవేళ పెడితే నష్టాలు తప్పవు. విద్యార్థులు ఊహల్లో మునిగి తేలకుండా చదువుపై దృష్టి సారించాలి.
Also Read: అందుకు నో చెప్పానని సినిమా ఛాన్సులు ఇవ్వలేదు.. టాలీవుడ్ హీరోలపై ఏస్తర్ సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook