Horoscope Today In Telugu 02 July 2021: ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జులై 02వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. ఆ రాశిఫలాలు మీకోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రాశివారు నేడు డ్రైవింగ్ చేయకుండా ఉండటం ఉత్తమం. ఇంట్లో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో మినహాయింపు లభిస్తుంది. కేవలం చర్చల ద్వారా మాత్రమే కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శించాలని భావిస్తారు. వ్యాపారులు ఆచితూచి అడుగులు వేయాలి. 


వృషభ రాశి
సమాజంలో మీ పేరు, గౌరవం పెరుగుతుంది. ఇప్పటివరకూ ఉన్న  గజిబిజి పరిస్థితులు ఈ రోజు పరిష్కారం అవుతాయి. మీ నాయకత్వ లక్షణాలకు ఓటు వేస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. 


Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్


మిథున రాశి
ఈరోజు పనులతో తీరిక లేకుండా గడుపుతారు. మీ చేతికి కొన్ని ప్రాజెక్టులు అప్పగిస్తారు. చాలా తెలివిగా ఆలోచించి పనులను పూర్తి చేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో సరదాగా కొంత సమయం గడుపుతారు. పిల్లల ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. 


కర్కాటక రాశి 
మీరు ఈ రోజు చాలా ఓపికగా ఉంటారు. ఇంటి, ఆఫీసు పనులలో చాలా ముఖ్యమైన పనులు పూర్తి చేయడంపై ఫోకస్ చేస్తారు. కుటుంబసభ్యులలో ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్, స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేందుకు నేడు తగిన సమయం. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.


సింహ రాశి
మీ భవిష్యత్తు గురించి మరియు జీవితంలో స్థిరపడటం లాంటి విషయాలకు సమయం కేటాయిస్తారు. చాలా చురుకుగా వ్యవహరిస్తారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు అందుకు సంబంధించి సమాచారం అందుతుంది. మీ తల్లిదండ్రులతో కీలక విషయాలు చర్చిస్తారు.


Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే


కన్య రాశి
ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలకు దగ్గరవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలని ప్లాన్ చేసుకుంటారు. గతంలో చేసిన పెట్టుబడులతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. నోరు అదుపులో పెట్టుకోకపోతే సమస్యలు తప్పవు. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.


తులా రాశి
ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఉదర సంబంధించి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం ఉత్తమం. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.


వృశ్చిక రాశి 
చాలా రోజుల తరువాత చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పెట్టుబడుల విషయంలో నేడు నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు. పిల్లల చదువుల విషయంపై భార్యాభర్తలు చర్చిస్తారు. ఆలోచనలు పరిపరి విధాల మార్చుకుంటారు. దీంతో మీ పనులు నేడు సజావుగా సాగవు. 


ధనుస్సు రాశి
కుటుంబ విషయాలపై ఎక్కువ దృష్టిసారించాలని భావిస్తారు. కుటుంబసభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. కెరీర్, పని గురించి ఆలోచన ఉన్నా, మనసు పెట్టి పనిచేయలేరు. వ్యాపారులు ఈ రోజు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయి.


Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు


మకర రాశి
నేడు మిమ్మల్ని అదృష్టం వరించనుంది. గతంలో చేసిన పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. మీరు కోరుకున్న పనులు పూర్తి చేయడానికి సిద్ధమవుతారు. అన్ని విషయాలలో విజయం సాధ్యం కాదని బావిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


కుంభ రాశి
కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. మీ అనారోగ్య సమస్యలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. పనుల నుంచి కాస్త విరామం తీసుకుంటారు. బంధువుల కారణంగా కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. ఉద్యోగులకు పనిభారం అధికం కానుంది.


మీన రాశి
ఇతరులను మెప్పించడానికి మీరు మారాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్నవారు మీలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నారని గ్రహించండి. పనిచేసే చోట గతంలో లేనంతగా ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook