Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 05 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారి చేతికి డబ్బు అందుతుంది
Horoscope Today 05 July 2021: భూములపై పెట్టుబడులు పెట్టాలని భావిస్తారు. నేడు మీకు అంతా శుభాలే కలుగుతాయి. మీ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. పని సజావుగా పూర్తవుతుంది. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వివాహానికి సంబంధించిన పనులపై చర్చలు మొదలవుతాయి.
Horoscope Today 05 July 2021: మేష రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ఆలోచనా విధానం చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అనారోగ్య సమస్యలు షరిష్కారం అవుతాయి. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు మరియు పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సలహా ఇస్తారు. సహోద్యోగులు మీతో బాగా కలిసిపోతారు కాబట్టి పని సరదాగా పూర్తి చేస్తారు.
వృషభ రాశి
ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందులోనూ పుణ్యక్షేత్రాలు సందర్శించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. పనికి సంబంధించిన ఒత్తిడి దూరం కానుంది. దంపతులు తమ మధ్య తలెత్తిన సమస్యలను చర్చించి పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారులకు స్టాక్ మార్కెట్లో గతంలో చేసిన పెట్టుబడులకు లాభాలు పొందుతారు.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
మిథున రాశి
భూములపై పెట్టుబడులు పెట్టాలని భావిస్తారు. నేడు మీకు అంతా శుభాలే కలుగుతాయి. మీ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. పని సజావుగా పూర్తవుతుంది. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. వివాహానికి సంబంధించిన పనులపై చర్చలు మొదలవుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు సహనంగా వ్యవహరిస్తారు. ఇది ఇంట్లో సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. పనిని పూర్తి చేయడానికి ఇతర ఉద్యోగులపై కొంచెం ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. పిల్లల చదువు గురించి భార్యాభర్తలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారులకు మరిన్ని పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తారు.
సింహ రాశి
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాల కారణంగా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. భార్యాభర్తల మధ్య తలెత్తే గొడవలు చికాకు తెప్పిస్తాయి. విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
కన్య రాశి
కన్యారాశి వారు పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇల్లు, కార్యాలయాలలో మీ ఉత్పాదకత పెరుగుతుంది. గతంలో మొదలుపెట్టిన ఏదైనా పెండింగ్ పనులు మిగిలి ఉంటే, దాన్ని పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. విద్యార్థులు చదువుపై ఫోకస్ చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు కాస్త దూరంగా ఉండాలి.
తులా రాశి
గతంలో చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ప్రయాణానికి దూరంగా ఉంటే అనారోగ్య సమస్యలు తప్పుతాయి. కొత్త నైపుణ్యం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇతర పనుల కన్నా వ్యక్తిగత విషయాలపై అధికంగా దృష్టిసారిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి నేడు మంచి రోజు. గతంలో వాయిదా పడిన నగదు ఈ రోజు చేతికి అందుతుంది. విషయాలు మీ నియంత్రణలో ఉంటాయి. కొంతకాలం మీరు మాట్లాడని స్నేహితుడు తిరిగి కనెక్ట్ కావాలని కోరుకుంటాడు. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి తెలుసుకుంటారు. వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
ధనుస్సు రాశి
ఈ రాశివారు మార్పు కోసం ప్లాన్ చేయవచ్చు, కానీ ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని సలహా ఇస్తారు. ప్రయాణాలకు సైతం కొంతకాలం దూరంగా ఉండాలని భావిస్తారు. మీకు ప్రతికూల ఫలితాలు అధికంగా వస్తాయి. ఈ రోజు కొత్త వ్యాపారం ప్రారంభించవద్దని, పెట్టుబడుల జోలికి వెళ్లకూడదని వ్యాపారులకు కొందరు సలహా ఇస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
మకర రాశి
ఖర్చులు అధికం కానున్నాయి. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. భవిష్యత్తు గురించి ఆలోచించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం ఉత్తమం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభ రాశి
నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. కొన్ని విషయాలలో కొంచెం అసంతృప్తిగా అనిపించవచ్చు. మీరు వారితో సమయం గడపాలని పిల్లలు భావిస్తారు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
మీన రాశి
మీ ఇల్లు రీడిజైన్ చేయాలని, లేదా కొత్త నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తారు. మీ ఖర్చులు అధికం కావడంతో ఆర్థిక పరిస్థితి నిరాశకు గురిచేస్తుంది. మానసిక ప్రశాంతత కోరుకుంటే ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించండి. ఉద్యగులకు పని భారం అధికం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook