Horoscope Today 11 July 2021: మేష రాశి
నేడు మేష రాశివారు ఇంటి పని మరియు కుటుంబానికి సంబంధించిన పనులు, కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతారు. ఆఫీసు లేదా కెరీర్ పనిని ఈరోజు పక్కనపెడతారు. పిల్లల ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. మీ తల్లిదండ్రులు, తోబుట్టువులతో బంధం కూడా బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి
పాత పెట్టుబడులు మీకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొందరు వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగులకు ఈ రోజు పనిలో మంచి రోజు. మీ ఉన్నతాధికారులు మీకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ప్రమోషన్ సైతం లభించే అవకాశం ఉంది. 


Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్


మిథున రాశి
మీరు ప్రేమిస్తున్న వ్యక్తి కోసం నేడు చాలా సమయాన్ని కేటాయించడానికి సిద్ధంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత చదువు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కెరీర్‌ పనుల్లో బిజీగా ఉంటారు. అన్ని పనులను ఈ రోజు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడం మంచిది. వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు.


కర్కాటక రాశి 
మీ జీవిత భాగస్వామితో ఇంట్లో సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారమవుతాయి. మీరు కారు లేదా బైక్ కొనాలని చూస్తున్నట్లయితే, ఈ రోజు అందుకు అనువైన సమయం. ఒకచోట కుదురుగా ఉండాలని మీకు సలహా ఇస్తారు. కొన్ని కార్యక్రమాలకుగానూ భారీగా ఖర్చు చేస్తారు. 


సింహ రాశి
ఈ రోజు మీకు చంద్రుని ఆశీర్వాదం ఉంటుంది. విద్యార్థులు చదువుకు సంబంధించిన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. చర్చించుకుని ఇంట్లోని సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. ఉద్యోగులకు పనిలో ఉన్నత స్థాయి అధికారులు మీకు ప్రమోషన్ ఇవ్వవచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. 


Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు


కన్య రాశి
ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమై చేతికి నగదు అందుతుంది. చాలా తక్కువ సమయంలో ప్రాజెక్టులు, పనులు పూర్తి చేయాల్సి రావడంతో ఒత్తిడి పెరుగుతుంది. కొందరి నుంచి శుభవార్తలు అందుకుంటారు. పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగాల కోసం చూస్తున్నవారు ఓ ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.


తులా రాశి
ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈరోజు కల సాకారం కానుంది. పెట్టుబడుల పరంగా ఏ సమస్య ఉండదు. నేడు మీకు లాభాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.


వృశ్చిక రాశి 
ఈ రోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు. మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని మరియు కెరీర్ విషయంపై నిర్ణయించుకోవాలని పెద్దలు సలహా ఇస్తారు. ప్రయాణాల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు ఒత్తిడి అధికం అవుతుంది. ఏ విషయంలోనూ అంతగా కలిసిరాదు.


Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే


ధనుస్సు రాశి
ఈ రోజు పని సజావుగా సాగుతుంది. త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని భావిస్తారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా కాస్త వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొత్తగా వివాహమైన వారు వేరు కాపురం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు.


మకర రాశి
సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలలో తీరిక లేకుండా గడుపుతారు. ఈరోజు మీరు అధిక సమయం బయటే ఉంటారు. వీలైతే పని నుంచి ఒకరోజు సెలవు తీసుకోవాలి. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇది మీ కెరీర్‌లో సహాయపడుతుంది.


కుంభ రాశి
విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ రోజు మీరు  అన్ని వేళలా ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో మీపై ఒత్తిడి తగ్గుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సమయం కేటాయిస్తారు. వ్యాపారులకు నేడు లాభసాటిగా ఉంటుంది. 


మీన రాశి
మీరు ప్రయాణం చేయాలని చూస్తున్నట్లయితే, ప్రస్తుతం వాయిదా వేసుకోవడం ఉత్తమంగా కనిపిస్తుంది. మీ దృష్టి ఈ రోజు పనిపైనే ఉంటుంది. కీలకమైన విషయాలలో ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. మీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు. పనులు నత్తనడకన సాగుతాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook