Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 29 జూన్ 2021, Rasi Phalalu, ఓ రాశివారికి ఆకస్మిక ధనవ్యయం
Today Horoscope In Telugu 29 June 2021: మీరు మరింత ఉత్సాహంగా పనులు చేపడతారు. గతంలో చేసిన తప్పులను తెలుసుకుని ముందడుగు వేస్తారు. కుటుంబసభ్యులకు అధిక సమయాన్ని కేటాయించాలని ప్లాన్ చేసుకుంటారు.
Horoscope Today In Telugu 29 June 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 29వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దాంతో మీ ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాయాయం, యోగా లాంటి శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు ఆశించిన ఫలితాలు వస్తాయి. చాలా రోజులుగా కలుసుకోని కొందరు మిత్రులు లేదా సన్నిహితులతో కలిసి బయటకు వెళతారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
వృషభ రాశి
మీ కుటుంబ ప్రయోజనాలు మరియు సమస్యలను తోసిపుచ్చే విధానాన్ని మీరు వ్యతిరేకిస్తారు. మీకు దూరంగా ఉన్న బంధువులను కలుసుకుని బంధాన్న పటిష్టం చేసుకోవాలని భావిస్తారు. దైవ దర్శనాలు చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
మిథున రాశి
స్థిరాస్తికి సంబంధించిన వాటా అందుతుంది. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందడుగు వేస్తారు. అయితే మీకు నేడు అంతగా కలిసివచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇంతకుముందు జరిగిన సంఘటనల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులకు పని మరింత భారం కానుంది.
కర్కాటక రాశి
నేడు కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. గతంలో చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరినీ విశ్వసించడం ద్వారా కొన్ని చిక్కులు తప్పవు. వ్యాపారులు నూతన పెట్టుబడులకు ఇది తగిన సమయం కాదు.
సింహ రాశి
ఆర్థిక విషయాలు మీకు మరింత ఆనందాన్నిస్తాయి. ఉదయం వేళ సాధారణంగా ఉంటుంది. రాత్రివరకు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వాములతో సమస్య ఉంటే పరిష్కారం చేసుకుంటారు. మిమ్మల్ని మీరు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో తీవ్రంగా ప్రయత్నిస్తారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టపోయే అవకాశం ఉంది.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
కన్య రాశి
గతంలో జరిగిన విషయాలపై అధికంగా ఆలోచిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో సజావుగా పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. శక్తికి మించి ఖర్చులు చేయడంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. సన్నిహితులు, స్నేహితులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు. దైవదర్శనం చేసుకునేందుకు ఆరాటపడతారు.
తులా రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబం మరియు కుటుంబ విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇంటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మతపరమైన ప్రదేశం లేదా ఏదైనా ప్రశాంతతను అందించే ప్రదేశానికి వెళతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తారు.
వృశ్చిక రాశి
నేడు మిమ్మల్ని సంప్రదించే మీ బంధువులకు సహాయపడవచ్చు. వారు చెప్పే విషయాలను ఓపికగా విన్న తరువాత నిర్ణయం తీసుకుంటారు. మీ ఆరోగ్యంపై సైతం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలతో ఇబ్బందులు తలెత్తుతాయి, మరియు ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
ధనుస్సు రాశి
నేడు మీరు పూర్తిగా అయోమయంలో ఉంటారు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరి పక్షాన నిలవాలి అనే దానిపై తేల్చుకోవడానికి అధిక సమయం కేటాయిస్తారు. ఓ సమస్య కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులు కెరీర్ గురించి ఆలోచిస్తారు. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు.
మకర రాశి
ఈరోజు మీలో చాలా మార్పులు కనిపిస్తాయి. మీ మనసు పలుమార్లు మార్చుకుంటారు. నగదు వ్యవహారాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అనవసర ఖర్చులను సైతం తగ్గించుకుంటేనే ప్రయోజనం పొందుతారు. శ్రమకు తగిన ఫలితం రావడం లేదని ఆందోళన చెందుతారు.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
కుంభ రాశి
మీరు మరింత ఉత్సాహంగా పనులు చేపడతారు. గతంలో చేసిన తప్పులను తెలుసుకుని ముందడుగు వేస్తారు. కుటుంబసభ్యులకు అధిక సమయాన్ని కేటాయించాలని ప్లాన్ చేసుకుంటారు. వేడుకలు నిర్వహించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను సంతృప్తి పరచడానికి మీరు ప్రత్యేక ప్రయత్నం చేస్తారు.
మీన రాశి
మీ ఉదార స్వభావం కారణంగా ఇతరులకు ఏ హాని కలగదు. మీ నుండి దూరంగా నివసించే వ్యక్తులు కూడా మీ సిఫార్సు కోసం చూస్తారు. గతంలో చేపట్టిన పనులలో జాప్యం తలెత్తడంతో వాయిదా వేసుకుంటారు. ఓ సహచరుడు ఖచ్చితంగా సహాయం చేయడానికి తోడుగా ఉంటాడు. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook