Horoscope Today 5 January 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఇవాళ అన్ని విధాలా కలిసొస్తుంది
Horoscope Today 5 January 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొంతమంది జీవితాల్లో అనూహ్య, ఆకస్మిక మార్పులు కలుగుతాయి. కొన్ని రాశుల వారికి ఇవాళ పూర్తి సానుకూల సమయం. కాబట్టి కొత్త పనులు లేదా ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు ఈరోజు మంచి రోజు...
Horoscope Today 5 January 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి కొంత ఇబ్బందులు, చికాకులు తప్పకపోవచ్చు. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి అన్ని విధాలా కలిసొచ్చే సమయం. కాబట్టి కొత్త పనులు లేదా ప్రాజెక్టులకు వెనుకడగు వేయొద్దు.
మేషం : జీవితం ఆకస్మిక మార్పుకు గురవుతుంది. కొన్ని పనులకు అంతరాయం తప్పకపోవచ్చు. మీ చుట్టూ మీరు విధించుకున్న బంధనాల నుంచి బయటకొస్తారు. బంధాల విషయానికొస్తే కొంత అభద్రతా భావానికి లోనవుతారు. లక్కీ కలర్: అమెథిస్ట్, లక్కీ నంబర్: 2
వృషభం : మీ భావాలను విశ్వసించండి. అదే సమయంలో మితిమీరిన హేతుబద్దతను పక్కనపెట్టండి. కొన్ని విషయాల్లో సమస్యలు తప్పకపోవచ్చు. అయితే అంతిమంగా వాటి నుంచి గట్టెక్కుతారు. మీరు కొనసాగించే రహస్య సంబంధాల్లో ఒకటి చివరకు సుఖాంతం కావొచ్చు. లక్కీ కలర్ : గోల్డ్, లక్కీ నంబర్ : 7
మిథునం : కొన్ని జాగ్రత్తలు, కొంత సున్నితంగా వ్యవహరిస్తే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కొన్ని విజయాలు సాధిస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో మంచి భాగస్వామి తోడవుతారు. భవిష్యత్తులో మీ ఎదుగుదలకు వారి సహాయ, సహకారాలు లభిస్తాయి. లక్కీ కలర్ : మెరూన్, లక్కీ నంబర్ : 5
కర్కాటకం : మీ పై అధికారులు లేదా కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి మీపై ఒత్తిడి, డిమాండ్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు, స్త్రీలతో విభేదాలను పక్కన పెట్టండి. మానసిక ప్రశాంతత కొంత లోపిస్తుంది. శృంగార పరమైన విషయాలు అంత సజావుగా సాగవు. లక్కీ కలర్ : ఆకుపచ్చ, లక్కీ నంబర్ : 5
సింహం : ఈ రాశివారికి ఇవాళ అన్ని విధాలా కలిసొస్తుంది. ఆఫీస్‌లో స్నేహపూర్వక వాతావరణం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ సహచరులతో కలిసి కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కెరీర్ పరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా కొంత లాభం చేకూరుతుంది. లక్కీ కలర్ : గోధుమ రంగు, లక్కీ నంబర్ : 8
కన్య : ఈ రోజు మీ జీవిత భాగస్వామి అదృష్టం మీకు కూడా కలిసొస్తుంది. జీవిత భాగస్వామితో శృంగారపరమైన సంబంధం మరింత బలపడుతుంది. ప్రస్తుత పరిస్థితులను సద్వినియోగం చేసుకోవడంలో మీకు సహాయపడేవారు ఇవాళ మీ పక్కనే ఉంటారు. లక్కీ కలర్ : ప్లం, లక్కీ నంబర్: 3
తుల : కొన్ని భావాలను పక్కన పెడితే అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయగలరు. కొన్ని చికాకులను మినహాయిస్తే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. కొన్ని మరుగునపడ్డ విషయాలను వదిలేయడమే మంచిది. మీ భవిష్యత్ ప్రణాళికలపై ఈరోజు నిర్ణయం తీసుకోండి. లక్కీ కలర్ : సిల్వర్, లక్కీ నంబర్ : 5
వృశ్చికం: గతంలో ఎదురైన చేదు అనుభవాలు, మరిచిపోయిన సంఘటనలు, లేదా మరుగునపడ్డ విషయాలు మళ్లీ తెర పైకి వస్తాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలి. దానికి సంబంధించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్ : లిలక్, లక్కీ నంబర్: 9
ధనుస్సు : కొత్త పనులు లేదా ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్థికపరమైన సమస్యలపై నిర్ణయం తీసుకునేందుకు ఇది కలిసొచ్చే సమయం. మీరు సున్నితంగా వ్యవహరించని కారణంగా కొన్ని సంబంధాలు దెబ్బతింటాయి. లక్కీ కలర్ : ఆరెంజ్, లక్కీ నంబర్ : 2
మకరం : దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారాల, ఉద్యోగ రంగాల్లో కొన్ని మార్పులు ఎదురవుతాయి. అనుకున్న పనులు కొన్ని ముందుకు సాగవు. కొన్ని ఆలోచనలు కలిసిరావు. కుటుంబసమస్యలతో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. లక్కీ కలర్: ఆలివ్ గ్రీన్, లక్కీ నంబర్ : 8
కుంభం : అనుకోని ప్రయాణాలు, అనుకోని పనులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని పనులు మధ్యలోనే వదిలిపెడుతారు. కొన్ని విషయాల్లో కుటుంబం, బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. లక్కీ కలర్: నారింజ, లక్కీ నంబర్: 8
మీనం : మీ ప్రియమైన వారితో కొన్ని ఇబ్బందులు లేదా విభేదాలు తలెత్తవచ్చు. ఆఫీస్ సంబంధిత విషయాల్లో కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం. ఓపికగా పనులను చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్ : జేడ్, లక్కీ నంబర్: 5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి