BJP Dharma Yuddham: ధర్మ యుద్ధం సాగిస్తాం.. బండి సంజయ్ అరెస్ట్‌ అక్రమం.. కేసీఆర్‌‌పై విరుచుకపడ్డ జేపీ నడ్డా

కేసీఆర్‌‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శల వర్షం కురిపించాడు. బండి సంజయ్ (Bandi Sanjay) అరెస్ట్‌కు నిరసనగా ధర్మ యుద్ధం కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో (Telangana) నియంతృత్వ పాలన కొనసాగుతుదంటూ ప్రభుత్వ (Government) పని తీరును జేపీ నడ్డా తప్పుబట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 11:22 AM IST
  • బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తాం..
  • బండి సంజయ్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదు..
  • తెలంగాణలో నియంతృత్వ పాలన
BJP Dharma Yuddham: ధర్మ యుద్ధం సాగిస్తాం.. బండి సంజయ్ అరెస్ట్‌ అక్రమం.. కేసీఆర్‌‌పై విరుచుకపడ్డ జేపీ నడ్డా

BJP National President JP Nadda fired on KCR due to BJP Telangana chief Bandi Sanjay's Arrest: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పార్టీ ఆఫీస్‌ను ధ్వంసం చేసి సంజయ్‌ని అరెస్ట్ చేయడం న్యాయమా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP national president JP Nadda) ప్రశ్నించారు. తాజాగా ఆయన హైదరాబాద్‌ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకే తాను వచ్చానని జేపీ నడ్డా అన్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం బీజేపీ పోరాడుతుందని తెలిపారు. తెలంగాణలో (Telangana) బీజేపీ ధర్మయుద్ధం (BJP Dharma Yuddham) చేస్తోందన్నారు. తమ ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు నడ్డా. అంతిమ నిర్ణయం వచ్చే దాకా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. 

బండి సంజయ్ అరెస్ట్‌కు (Bandi Sanjay arrest) నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. బండి సంజయ్‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు నడ్డా. బండి సంజయ్ (Bandi Sanjay) జీవో 317 (G.O. 317) ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వ్యతిరేక ఉత్తర్వులను సవరించాలంటా పోరాడారని నడ్డా పేర్కొన్నారు.

శాంతియుతంగా జాగరణ దీక్ష చేపడితే పోలీసులు (Police) బండి సంజయ్‌పై చేయి చేసుకున్నారన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌ను (Bandi Sanjay arrest) బీజేపీ (BJP) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామన్నారు.

 

317 జీవో ఉద్యోగులు, ప్రజలకు వ్యతిరేకమైందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ఏటీఎం మాదిరిగా మారిందన్నాడు నడ్డా. కరోనా విషయంలో కేసీఆర్‌‌ (KCR‌) గందరగోళం సృష్టించాడు అంటూ కేసీఆర్‌‌ మాటల్ని వీడియోలో చూపించారు నడ్డా. కేసీఆర్ అత్యంత అవినీతి ముఖ్యమంత్రి (Chief Minister) అని జేపీ నడ్డా విమర్శించారు. కేసీఆర్ మానసిన పరిస్థితి అదుపు తప్పిందని పేర్కొన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ ఎన్నికల్లో ఓటమి చవిచూశాక కేసీఆర్‌ మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినిందని విమర్శించారు. 

Also Read :JP Nadda Rally: హైదరాబాద్ లో హైటెన్షన్.. శంషాబాద్ చేరుకున్న బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా

కోవిడ్ నిబంధనలు ఉన్నాయంటూ తనని ఎయిర్‌పోర్ట్‌ దగ్గరే అడ్డుకున్నారన్నారు. అయితే తెలంగాణలో మరి మంత్రుల ర్యాలీలు, సభలకు ఎలా అనుమతిస్తున్నారని పోలీసులను తాను ప్రశ్నించానన్నారు. కోవిడ్ (Covid) నిబంధనలు పాటిస్తూనే గాంధీజీకి నివాళులర్పిస్తానని పోలీసులకు (Police) తాను చెప్పానన్నారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా జరుగుతోన్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో (Telangana) నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. ఇక్కడ అంతా అవినీతి, కుటుంబ పాలనే ఉందన్నారు.

Also Read :Telangana Yellow Alert: తెలంగాణలో వణికిస్తున్న చలిగాలులు- హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News