Horoscope Today July 10th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారిని అసంతృప్తి, నిరాశ వెంటాడుతాయి. మరికొన్ని రాశుల వారికి అంతా సంతోషకరంగా సాగుతుంది. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


ఇవాళ మిమ్మల్ని అసంతృప్తి వెంటాడుతుంది. రోజంతా నిరుత్సాహం ఆవహిస్తుంది. ఇది మీరు చేపట్టిన పనులపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఆ పనులను సకాలంలో పూర్తి చేయడంలో వెనుకబడుతారు. అది మీ వృత్తి జీవితానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. లాంగ్ డ్రైవ్ ప్లాన్స్‌ను వాయిదా వేసుకోవాలి. ప్రేమలో ఉన్నవారు బ్రేకప్ చెప్పుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి నిరాశే మిగులుతుంది.


వృషభ రాశి (Taurus)


మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. పరిస్థితులన్నీ అదుపులో ఉంటాయి. పార్ట్‌నర్‌షిప్‌తో కొత్త బిజినెస్‌ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతారు. వ్యాపార రీత్యా సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.


మిథున రాశి (GEMINI)


ఇవాళ మీ ఆఫీసులో మీ పెర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. మీ బాస్‌తో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ లభించవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. ఉద్యోగంలో ఇన్సెంటివ్స్ పొందుతారు. తోబట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి జాబ్ దొరుకుతుంది.


కర్కాటక రాశి (Cancer) 


జీవితం ఛాలెంజిగ్‌గా అనిపిస్తుంది. కొన్ని సవాళ్లను ఎదుర్కోవడంలో కొంత ఇబ్బందిపడుతారు. పెద్దల సలహాలను పాటించడం ద్వారా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. పిల్లల చదువుల విషయం కొంత నిరాశకు గురిచేస్తుంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందు దానిపై ఊహాగానాలకు తావు లేకుండా చూసుకోండి.


సింహ రాశి (LEO)


ఇవాళ అసంతృప్తి వెంటాడుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉండదు. అది మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. కొత్త కాంట్రాక్టులు ప్రారంభించేటప్పుడు డాక్యుమెంట్స్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. స్థిరాస్తి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనైనా మీ అంతరంగాన్ని ఫాలో అవండి.


కన్య రాశి (Virgo)


ఫ్యామిలీ ఫంక్షన్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది మీ నెట్‌వర్క్‌ను విస్తృతం చేస్తుంది. వృత్తిరీత్యా షార్ట్ ట్రిప్‌కు ప్లాన్ చేస్తారు. తోబుట్టువుల మధ్య వివాదాలు సమసిపోతాయి. చేపట్టిన పనులు సంక్లిష్టంగా మారినప్పటికీ సహోద్యోగుల సాయంతో పూర్తి చేయగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఎవరితో మాట్లాడిన కాస్త సంయమనం, ఓపిక అవసరమని గుర్తించండి.


తులా రాశి (Libra)


మీ దగ్గరి బంధువు ఒకరి నుంచి శుభవార్త అందుతుంది. ఇంటి కోసం కొన్ని ఖర్చులు చేస్తారు. మీ వ్యవహార శైలి చాలామందిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మీ మాట తీరు అందరినీ ఇట్టే ఆకట్టుకుంటుంది. అందరిలో మంచివారు అనే పేరు పొందుతారు. మీ మంచితనమే మీకు మేలు చేస్తుంది.


వృశ్చిక రాశి (Scorpio)


ఇవాళ మీ చుట్టూ సంతోషం నెలకొంటుంది. మీ రెగ్యులర్ వర్క్‌ను ఎంజాయ్ చేస్తారు. మీ చతురత సంక్లిష్ట విషయాల్లో మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. వ్యాపార వర్గాలకు ఆ నిర్ణయాలు కలిసొస్తాయి. లాభాలు తీసుకొస్తాయి. విద్యార్థులు చదువులపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. తిండి విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.


ధనుస్సు రాశి (Sagittarius)  


నిద్రలేమి మీ మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.వృథా ఖర్చులు మీ సేవింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రత్యర్థులు మీపై కుట్ర పన్నే అవకాశం ఉంది. కాబట్టి వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి.



మకర రాశి (Capricorn) 


ఇవాళంతా సంతోషంగా సాగుతుంది.ఉద్యోగ రీత్యా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు సమీప భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. ఇతర మార్గాల్లోనూ ఆదాయం వస్తుంది. ఉద్యోగంలో సంపాదించే డబ్బుతో ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామి మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు.


కుంభ రాశి (Aquarius)


ఆఫీసులో చాలా బిజీ బిజీగా గడుపుతారు. మానసిక అలసట కారణంగా కుటుంబంతో తగిన సమయం గడపలేకపోతారు. పెద్దల ఆశీస్సులతో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థానానికి ప్రమోషన్ లభించవచ్చు. మేనేజర్స్ టాప్ మేనేజ్‌మెంట్‌కి ప్రమోట్ అవుతారు. అది మీ స్టేటస్‌ని పెంచుతుంది. ప్రొఫెషనల్‌గా అది మీకు కలిసొస్తుంది.


మీన రాశి (Pisces) 


ప్రేమికులకు సానుకూల సమయం. వివాహితులు కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మతపరమైన కార్యక్రమాలకు లేదా ఛారిటీ సంస్థలకు కొంత విరాళం అందజేస్తారు. ఎవరైనా ఆపదలో ఉన్నవారు మీ సాయం కోరి వస్తే కాదనకండి. తోచిన సాయం చేయడం ద్వారా అది మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Ram Charan: బాలీవుడ్ పై కన్నేసిన రామ్ చరణ్.. ముంబైలో బంగ్లా కొనుగోలు.. ఈసారి తగ్గేదేలే అంటూ!


Also Read: Telugu States Rains Live Updates: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం విజ్ఞప్తి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook