Horoscope Today July 17th 2022: ఇవాళ ఆదివారం. హిందువులు సూర్య భగవానుడిని పూజిస్తారు. సూర్య భగవానుడి అనుగ్రహం జీవితంలో సుఖ సంతోషాలను కలగజేస్తుంది. జాతకంలో సూర్య సంచారం జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతకం ప్రకాశించనుంది.. ఏ రాశుల వారి జాతకంలో ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


మీ నెట్‌వర్క్ సాయంతో బిజినెస్ పరంగా అనుకున్న ప్లాన్స్‌ను అమలుచేస్తారు. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలు తీసుకొస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. లోహ తయారీ రంగంలో ఉన్న వ్యాపారులకు కలిసొస్తుంది. బుకింగ్ ఏజెంట్స్‌కి కూడా అనుకూల సమయం.


వృషభ రాశి (Taurus)


ఇవాళ మీ మనసు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా ప్రశాంతతను పొందుతారు. మతపరమైన లేదా సేవా పరమైన కార్యక్రమాలకు తోచిన సాయం చేస్తారు. మీ చుట్టూ ఉన్నవారు మీకు అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలుస్తారు. ప్రతీ క్షణాన్ని సంతృప్తికరంగా గడుపుతారు.


మిథున రాశి (GEMINI)


ఇవాళ మిమ్మల్ని నిరాశ ఆవహిస్తుంది. షార్ట్ టెంపర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. లేనిపక్షంలో పెద్ద వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇది మీ సహనానికి పరీక్ష లాంటి కాలం. ఛాలెంజింగ్‌గా తీసుకుని ముందుకు సాగాలి. లక్ష్యం వైపు నుంచి ఏకాగ్రత మళ్లకూడదు. ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అనవసర విషయాలపై చర్చలు ఇద్దరి మధ్య దూరాన్ని సృష్టిస్తాయి.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ ఆర్థికంగా బాగుంటుంది. చాలా కాలంగా మీకు రాకుండా నిలిచిపోయిన పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. అది మీ వ్యాపారానికి దోహదపడుతుంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. సాయంత్రం సమయానికి మీరు డిప్రెషన్ మూడ్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇది మీకు నిద్రను దూరం చేస్తుంది. మనసు కలతగా ఉంటే జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.


సింహ రాశి (LEO)


మీ శత్రువులు, ప్రత్యర్థులు ప్రస్తుతానికి మీవైపు కన్నెత్తి చూడరు. న్యాయపరమైన వివాదాల్లో మీదే పైచేయి అవుతుంది. అవివాహితులైన వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారంలో మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ లభించవచ్చు.


కన్య రాశి (Virgo)


మీ సృజనాత్మకత మరింత పదునెక్కుతుంది. అది మీ లైఫ్ స్టైల్‌ను మరింత మెరుగుపరుస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతారు. ప్రేమికులు పెళ్లి సంబంధిత విషయాలపై చర్చిస్తారు. పెద్దల అంగీకారం కోసం ప్రయత్నాలు జరుపుతారు.


తులా రాశి (Libra)


మనశ్శాంతి కోసం పాకులాడుతారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ మనసులో ఏదో తెలియని అలజడి ఉంటుంది. అహంకారం, కోపం తగ్గించుకుంటే మంచిది. బిజినెస్ పార్ట్‌నర్‌తో వివాదాలు తొలగిపోతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మొత్తంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయని చెప్పొచ్చు.


వృశ్చిక రాశి (Scorpio)


విధి మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పని పట్ల ఏకాగ్రతతో, మునుపటికన్నా ఉత్సాహంగా వ్యవహరిస్తారు. పనిలో సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి రీత్యా సమీప ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ తోబుట్టువుల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ఇంటి మరమత్తులు చేపట్టే ఆలోచన చేస్తారు. 


ధనుస్సు రాశి (Sagittarius)  


ఖర్చులు అదుపులో ఉంటాయి. తద్వారా సేవింగ్స్ పెరుగుతాయి. మీ క్రియేటివిటీకి మరింత పదును పెడుతారు. ఇంటిని అలంకరించడంలో మీ క్రియేటివిటీని ఉపయోగిస్తారు. ప్రేమ జంటకు ఇది అనుకూల సమయం. పెళ్లి విషయంలో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలి.


మకర రాశి (Capricorn) 


గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడుతారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సంపాదనకు, ఖర్చులకు మధ్య బ్యాలెన్స్ కుదురుతుంది. ఆర్థిక క్రమశిక్షణ అలవరుచుకుంటారు. పని భారం కారణంగా ప్రయాణాలు కూడా పెరుగుతాయి. ఇది మీలో అసహనం నింపుతుంది. ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తారు. 


కుంభ రాశి (Aquarius)


ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం క్షీణిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. షార్ట్ టెంపర్‌గా ఉండటం మిమ్మల్ని అందరికీ దూరం చేస్తుంది. కాబట్టి కోపాన్ని వీడండి. ఆర్థికంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అనవసర వాటికి ఖర్చు చేసి ఆ తర్వాత అప్పుల కోసం పాకులాడవద్దు. ప్రేమ జంట అనవసర విషయాలపై వాదించుకుని బ్రేకప్ దాకా వెళ్లే అవకాశం ఉంది.


మీన రాశి (Pisces) 


ఇవాళ మీకు శుభదినం. వ్యాపారులు కొత్త క్లయింట్స్‌ను పొందుతారు. తద్వారా లాభాలు ఏర్పడుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. జీవిత భాగస్వామి వద్ద ఏదీ దాచవద్దు. లేనిపక్షంలో అది మీ ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కొత్త జాబ్ అవకాశం వస్తుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)



Also Read: Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్‌.. ఇంతకీ ఎవరీ జగదీప్ ధంకర్ ?


Also Read: Vemulawada Hospital Kayakalpa Award: వేములవాడ ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook