Horoscope Today July 19th 2022: ఇవాళ మంగళవారం. హిందువులు హనుమంతుడిని పూజిస్తారు. హనుమంతుడి అనుగ్రహం శని బాధల నుంచి విముక్తి చేస్తుందని నమ్ముతారు. మరి ఈ మంగళవారం ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారంలో భారీ పెట్టుబడులకు ప్లాన్ చేస్తారు.అది మీ వ్యాపార పురోగతికి దోహదపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమికులు పెళ్లి విషయమై చర్చలు ప్రారంభించే అవకాశం ఉంది. విద్యార్థులకు కర్మ కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. వివాహితులు జీవిత భాగస్వామి నుంచి మరింత ప్రేమను పొందుతారు.


వృషభ రాశి (Taurus)


ఇవాళ చాలా చాలా సంతోషంగా గడుపుతారు. మీ పెట్టుబడి పెట్టే ప్రతీ రూపాయి లాభాలు తీసుకొస్తుంది. గతంలో ఎదురైన నష్టాలన్నీ ఇప్పుడొచ్చే లాభాలతో భర్తీ అవుతాయి. వ్యాపార, ఉద్యోగ రంగంలో మీరు చేసే కృషి ఇతరులకు స్పూర్తిదాయకంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సహోద్యోగులు, బాస్ నుంచి ప్రశంసలు అందవచ్చు. అవివాహితులైన సింగిల్స్‌కి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.


మిథున రాశి (GEMINI)


చంద్ర అనుగ్రహం మిమ్మల్నిసరైన దారిలో నడిపిస్తుంది. గత వారం ఎదురైన కష్టనష్టాలు ఇప్పుడు తొలగిపోతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. గతంలో పెండింగ్ పడిన పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో  ఆర్థిక పురోగతి మీలో నూతనోత్సాహాన్ని నింపుతుంది. మునుపెన్నడూ లేని రీతిలో వ్యాపారంలో లాభాలు పొందుతారు.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ మీకు కలిసిరాకపోవచ్చు. రోజంతా నిరాశ ఆవహిస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార రంగంలో లేదా వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రతికూల సమయం. కొత్త వెంచర్స్‌ జోలికి వెళ్లవద్దు. లేనిపక్షంలో ఆర్థికంగా నష్టపోతారు. జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది.


సింహ రాశి (LEO)


వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త క్లయింట్స్ నుంచి బిజినెస్ ఆర్డర్స్ వస్తాయి. తద్వారా మీ వ్యాపారంలో లిక్విడిటీ పెరుగుతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త వ్యూహాలు అమలుచేస్తారు. కొత్త భాగస్వాములు మీతో చేరే అవకాశం ఉంది. వ్యాపారంపై ఎక్కువ ఫోకస్ కారణంగా మానసిక అలసటకు గురవుతారు. అది మీ వ్యక్తిగత, కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతుంది.


కన్య రాశి (Virgo)


ఉద్యోగంలో బాగా రాణిస్తారు. మీ పెర్ఫామెన్స్ ఇతరులకు స్పూర్తినిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడుల కోసం అప్పులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి జాబ్ ఆఫర్ రావొచ్చు. ఆరోగ్య సమస్యలు నయమయ్యే సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఫంక్షన్స్‌కి హాజరయ్యే అవకాశం ఉంది.


తులా రాశి (Libra)


ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకానొక దశలో జీవితం చాలా భారంగా అనిపించవచ్చు. అలాంటి ఆలోచనను మనసు నుంచి చెరిపివేయాలి. సంక్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేయాలి. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పెద్దల ఆశీస్సులతో కొంత మంచి జరుగుతుంది. 


వృశ్చిక రాశి (Scorpio)


మీకు అప్పగించిన టాస్క్‌లు అసంపూర్తిగా మిగిలిపోతాయి. మూడ్ స్వింగ్స్ మిమ్మల్ని ఇబ్బందిపెడుతాయి. మీ సహనం చాలాసార్లు పరీక్షించబడుతుంది. చేపట్టిన పనుల్లో సిల్లీ మిస్టెక్స్ దొర్లుతాయి. భావోద్వేగాల విషయంలో ప్రేమికులు గందరగోళానికి గురవుతారు. అతిగా ఆశించడం వల్ల నిరాశకు గురవుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  


ధనుస్సు రాశి (Sagittarius)  


ఇవాళ మీకు శుభదినం. మీ తల్లిదండ్రులు ఉండే చోటుకు లేదా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. తల్లిదండ్రుల కోసం ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తారు. తోబుట్టువులు కూడా మీ ప్రయాణంలో మీతో చేరవచ్చు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి.


మకర రాశి (Capricorn) 


మీలో ఎనర్జీ లెవల్ పీక్స్‌లో ఉంటుంది. ఏ విషయమైనా ఆశాజనకంగా ఆలోచిస్తారు. అందుకు తగినట్లుగా కష్టపడుతారు. ఈ ధోరణి మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తుంది. స్నేహితులు లేదా కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులకు చదువుల పరంగా గుడ్ న్యూస్ ఉంటుంది. 


కుంభ రాశి (Aquarius)


ఇవాళ మధ్యాహ్నం వరకు మీకేదీ కలిసిరాదు. అసంతృప్తి, నిరాశ వెంటాడుతుంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. సంతోషం దరిచేరుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అయితే అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. ఆర్థికపరమైన, వృత్తిపరమైన, విద్యాపరమైన అంశాల్లో పట్టింపు లేనట్లుగా వ్యవహరించవద్దు. భార్యతో కొన్ని విషయాల్లో ఓర్పుగా ఉండాలి.


మీన రాశి (Pisces) 


ఖర్చులు పెరిగి సేవింగ్స్‌పై ఎఫెక్ట్ పడుతుంది. ఆర్థికపరమైన కష్టాలు ఎదురవొచ్చు. మీ భావాలను వ్యక్తపరిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడటం మిమ్మల్నిచులకన చేస్తుంది. రియల్ ఎస్టేట్ లేదా ఇతర స్థిరాస్తి పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. అప్పగించిన బాధ్యతలు పూర్తికాక ముందే పక్కకు తప్పుకోవద్దు. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: NEET: నీట్ పరీక్షా తీరుపై తీవ్ర దుమారం..డ్రెస్‌ కోడ్, రిగ్గింగ్‌పై సర్వత్రా విమర్శలు..!


Also Read: Bhupinder Singh's death: ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన లెజెండ్ భూపిందర్ సింగ్ ఇక లేరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook