NEET: నీట్ పరీక్షా తీరుపై తీవ్ర దుమారం..డ్రెస్‌ కోడ్, రిగ్గింగ్‌పై సర్వత్రా విమర్శలు..!

NEET: నీట్-2022 పరీక్ష తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా మరో వార్త కలకలం రేపుతోంది. 

Written by - Alla Swamy | Last Updated : Jul 18, 2022, 08:52 PM IST
  • నీట్-2022 పరీక్ష తీరుపై విమర్శలు
  • డ్రెస్‌ కోడ్, రిగ్గింగ్‌పై దుమారం
  • తాజాగా మరో వార్త వైరల్
NEET: నీట్ పరీక్షా తీరుపై తీవ్ర దుమారం..డ్రెస్‌ కోడ్, రిగ్గింగ్‌పై సర్వత్రా విమర్శలు..!

NEET-2022: నీట్ పరీక్షా కేంద్రాల్లో దారుణ ఘటన జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రెస్‌ కోడ్ పేరుతో విద్యార్థినుల లోదుస్తులు విప్పించినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కేరళ కొల్లాంలోని మార్థోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నీట్ పరీక్ష డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగా మెటల్ వస్తువులతో వచ్చిన వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కానీ కొల్లాంలోని అధికారుల అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

పరీక్షా కేంద్రంలో వంద మంది విద్యార్థినులు లోదస్తులు విప్పేసి లోపలికి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయిలంతా నిబంధనలు పాటించారు. అనంతరం ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో బాధిత అమ్మాయిలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు నీట్-2022 పరీక్షలో రిగ్గింగ్ జరిగినట్లు తెలుస్తోంది. రాకెట్‌ను పోలీసులు సైతం పట్టుకున్నారు. ఢిల్లీ, హర్యానాలోని పలు సెంటర్లలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినట్లు గుర్తించారు. దీనిని సీబీఐ అధికారులు తేల్చారు. స్కాం సూత్రధారి సహా 8 మందిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Also read:Kama Reddy Accident: తెలంగాణలో నెత్తురోడిన రోడ్డు..ఆరుగురు అక్కడికక్కడే మృతి..!

Also read:Presidential Election: క్రాస్ ఓటింగ్ వేయలేదు..బద్నాం చేసేందుకే తప్పుడు ప్రచారమన్న సీతక్క..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News