Horoscope Today July 1st 2022: ఇవాళ శుక్రవారం, జూలై మొదటి రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి సంతోషంగా, సరదాగా గడిచిపోతుంది. కొన్ని రాశుల వారికి మాత్రం ఆటంకాలు తప్పకపోవచ్చు. ఇవాళ్టి రాశి ఫలాలను ప్రముఖ జ్యోతిష్యులు సందీప్ కొచ్చర్ అందిస్తున్నారు. రాశిచక్రంలోని 12 రాశుల వారి జాతక ఫలం ఇవాళ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


ఇవాళంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మీ పాజిటివిటీ మీ చుట్టూ ఉండే వ్యక్తులను ఆకర్షిస్తుంది. మీకు ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడుపుతారు. ఇవాళంతా సరదాగా గడిచిపోతుంది. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటారు. ఆధ్యాత్మికపరంగా ధ్యానం వైపు దృష్టి సారిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది.


వృషభ రాశి (Taurus)


ఆఫీసులో మీకు నాయకత్వ బాధ్యతలు లభిస్తాయి. చాలాకాలంగా మీరు ఈరోజు కోసం ఎదురుచూస్తుంటారు. కోరుకున్నది జరిగినందుకు సంతోషంతో పాటు ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మున్ముందు మీకు మరిన్ని ప్రమోషన్లు ఉంటాయి.మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటారు.


మిథున రాశి (GEMINI)


ఇవాళ మీరు చేపట్టే పనుల్లో తప్పక విజయం సాధిస్తారు. మునుపటి కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. తద్వారా మీ మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దల సలహాలు స్వీకరిస్తే మంచిది.


కర్కాటక రాశి (Cancer) 


మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాని కోసం గట్టిగా ప్రయత్నించండి. దాని కోసమే ఎక్కువగా ఆలోచించండి. తద్వారా అనుకున్నది సాధిస్తారు. ఇవాళ మీకు అనుకోని విధంగా బహుమతులు అందవచ్చు. మిమ్మల్ని మీరు ఉన్నత మార్గం వైపు నడిపించుకోగలరు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అది మీకు కలిసొస్తుంది.


సింహ రాశి (LEO)


ఈ నెల ఉద్యోగ, వ్యాపార సంబంధిత చర్చలతో ప్రారంభమవుతుంది. ఏదైనా వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చర్చలకు ఇది మంచి రోజు. ప్రస్తుతం మీ వర్క్ డ్రైవ్ ఎక్కువగా ఉంటుంది. కెరీర్‌పై దృష్టి సారిస్తారు. ఇవాళ ఆర్థికంగా, కెరీర్ పరంగా మీకు కలిసొస్తుంది.


కన్య రాశి (Virgo)


ఇవాళ అంతా సజావుగా సాగుతుంది. ఇప్పటివరకూ మీరు అనుభవిస్తున్న అన్ని భయాలు, ఒత్తిళ్లు ఈరోజు అదృశ్యమవుతాయి. ఆఫీసులో వివాదాలు సమసిపోతాయి. కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ప్రశాంతత నెలకొంటుంది. మిమ్మల్ని మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి సారించేలా చేస్తారు.


తులా రాశి (Libra)


మీరు ఎప్పుడైనా ఊహించిన దాని కంటే మరింత వ్యవస్థీకృతంగా ఉంటారు. ఇది మీకు అనుకూలతను తీసుకొస్తుంది. మీ ఉద్యోగం, వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ అంతా సామరస్యపూర్వకంగా ఉంటుంది. మీ శక్తిని పూర్తిగా వినియోగించుకోలిగితే మీకు తిరుగుండదు. ఏ పనైనా సులువుగా పూర్తి చేస్తారు.


వృశ్చిక రాశి (Scorpio)



మీకు చాలా గౌరవం ఇవ్వబడుతుంది. మీరు సూపర్ వైజర్ వంటి హోదాల్లో ఉన్నట్లయితే మీ అభిప్రాయాలకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఏం చేసినా అంతరాత్మ ప్రబోధానుసారం నడవండి. అన్నీ మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తవు. 


ధనుస్సు రాశి (Sagittarius)  


మీ సహోద్యోగులు మీ తెలివి తేటలను మెచ్చుకుంటారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. పెండింగ్ పనులన్నీ ఇవాళ పూర్తి చేస్తారు. పోటీ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు ఇవాళ సానుకూలంగా ఉంటుంది. జీవన గమనంలో కష్టాలకు భయపడిపోవద్దు. 


మకర రాశి (Capricorn) 



మార్పుకు ఇదే సరైన సమయం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మార్పు కోరుకుంటున్నట్లయితే తక్షణమే ఆ దిశగా అడుగులు వేయడం మంచిది. ప్రస్తుతం మీకు అదృష్టకాలం నడుస్తోంది. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు చెప్పిన మాటకు తిరుగుండదు. ఒకవేళ మీవల్ల కాని పనులు ఏవైనా ఉంటే.. మీరు బాగా విశ్వసించేవారికి అప్పగించండి. 


కుంభ రాశి (Aquarius)


ఇవాళంతా సంతోషంగా, సరదాగా గడుపుతారు. రెగ్యులర్ ఉద్యోగ జీవితం నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటారు. కెరీర్, కుటుంబ విషయాల్లో అంతా సవ్యంగా సాగుతుంది. గజిబిజి పరుగులతో విశ్రాంతి కరువవుతుంది.కాబట్టి సమయం దొరికితే విశ్రాంతి తీసుకోండి. మీ ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపండి. 


మీన రాశి (Pisces) 


ఈరోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకోండి. మీ పనులకు ఇతరుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయండి. 
ఎవరి మనోభావాలను గాయపరచవద్దు. మీ చర్యలు ఇతరులను బాధించవద్దు. కాబట్టి అన్ని విషయాల్లో ఆచీ తూచీ వ్యవహరించండి. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)



Also Read: TS TET 2022: ఇవాళ తెలంగాణ టెట్ ఫలితాలు రిలీజ్... త్వరలో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్  


Also Read: HMDA plots e-auction: ఈ వేలం ప్రక్రియకు భారీ స్పందన..ఇక్కడ గజం స్థలం విలువ రూ.62,500


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook