HMDA plots e-auction: ఈ వేలం ప్రక్రియకు భారీ డిమాండ్.. ఇక్కడ గజం స్థలం విలువ రూ.62,500

HMDA plots in e-auction: హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈ-కామర్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎం.ఎస్.టి.సి గురువారం నగర శివార్లలోని పలు వెంచర్లలోని ప్లాట్లకు ఈ వేలం నిర్వహించింది.

Written by - Pavan | Last Updated : Jul 1, 2022, 12:21 AM IST
  • బహుదూర్‌పల్లి, తుర్కయంజాల్‌‌లో వెంచర్లకు భారీ డిమాండ్
  • ఈ వేలం ప్రక్రియకు కొనుగోలుదారులు నుంచి భారీ స్పందన
  • పోటీపడి మరీ ప్లాట్లు దక్కించుకున్న బిడ్డర్లు
HMDA plots e-auction: ఈ వేలం ప్రక్రియకు భారీ డిమాండ్.. ఇక్కడ గజం స్థలం విలువ రూ.62,500

HMDA plots in e-auction: హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈ-కామర్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎం.ఎస్.టి.సి గురువారం నగర శివార్లలోని పలు వెంచర్లలోని ప్లాట్లకు ఈ వేలం నిర్వహించింది. ఆన్‌లైన్ ద్వారా జరిగిన ఈ వేలం ప్రక్రియకు కొనుగోలుదారులు నుంచి భారీ స్పందన కనిపించింది. రాత్రి వరకు జరిగిన 2 సెషన్లలో మొత్తం 85 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. అందులో 73 ప్లాట్లను బిడ్డర్లు భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు. 

బహుదూర్‌పల్లి, తుర్కయంజాల్‌ ప్రాంతాల్లో హెచ్ఎండిఏ రూపొందించిన వెంచర్లకు ఇప్పటికే భారీ డిమాండ్ ఉండగా.. తాజాగా మరోసారి ఆ డిమాండ్ తారాస్థాయికి చేరింది. అందుకు నిదర్శనమే నేడు జరిగిన ఈ వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు పోటీపడి మరీ స్థలం విలువను అమాంతం పెంచేయడం. బహుదూర్‌పల్లి హెచ్ఎండిఏ వెంచర్‌లో మొత్తం 51 ప్లాట్లకు గాను 50 ప్లాట్లు గురువారం జరిగిన ఈ వేలంలో అమ్ముడయ్యాయి. ఇక్కడ గజం స్థలం విలువ కనిష్టంగా రూ.25,000/- నిర్ణయించగా.. బిడ్డర్ల మధ్య పోటీ నెలకొనడంతో అత్యధికంగా గజం రూ.42, 500 వరకు పలికింది. కొన్ని ప్లాట్లకు మాత్రమే అత్యల్పంగా రూ.29,000 ధర పలికింది.

అలాగే తుర్కయాంజాల్‌లో వేసిన హెచ్ఎండిఏ వెంచర్‌లోని 34 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించగా.. ఇందులో 23 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. తుర్కయాంజాల్‌ వెంచర్‌లో గజం స్థలం విలువ రూ.40,000 గా నిర్ణయించారు. అయితే ఈ ప్రాంతానికి ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా బిడ్డర్లు పోటీపడి మరీ ధరను అమాంతం రూ.62,500 పెంచేశారు. కొన్ని ప్లాట్లు మాత్రమే వివిధ కారణాలతో అత్యల్పంగా రూ.40, 500 కు అమ్ముడయ్యాయి. మొత్తం గురువారం నాటి ఈ వేలం ద్వారా రూ.137.65 కోట్ల విలువచేసే ప్లాట్ల అమ్మకాలు జరిగాయని ఎంఎస్‌టీసీ లిమిటెడ్ అధికారులు తెలిపారు.

Also read : Jobs for 10th Pass: పదో తరగతి పాస్ అయ్యారా?.. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అర్హులే

Also read : Minister sabitha: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News