Horoscope Today July 26th 2022: ఇవాళ మంగళవారం. హిందువులు హనుమంతుడిని పూజిస్తారు. హనుమాన్ చాలీసా పఠిస్తూ హనుమంతుడిని పూజించడం ద్వారా శని బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. మరి ఈ మంగళవారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


కొన్ని విషయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. అవి సఫలమవుతాయో లేదోనన్న సందేహం ఉన్నప్పటికీ మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొలిగ్స్ సహకారంతో ఉద్యోగ రీత్యా స్వీకరించే సలహాలు సఫలమవుతాయి. తోబుట్టువుల నడుమ ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.


వృషభ రాశి (Taurus)


నోటిని అదుపులో ఉంచుకోవాలి. ముక్కుసూటితనం అన్నిసార్లు పనికిరాదు. లేనిపక్షంలో వివాదాల్లో చిక్కుకుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బును అనవసర వాటికి ఖర్చు చేయొద్దు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఓపికతో, శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని లోపాలను సరిదిద్దుకోవాలి.


మిథున రాశి (GEMINI)


చంద్ర అనుగ్రహంతో నెగటివిటీ దూరమవుతుంది. మీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. నిన్నటిదాకా వెంటాడిన కష్టాలు తొలగిపోతాయి. గతంలో వాయిదా పడిన ప్రాజెక్టులను ఇప్పుడు చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు అన్నాదమ్ముళ్లు, లేదా అక్కాచెల్లెళ్లలతో కలిసి కొత్త వెంచర్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది.


కర్కాటక రాశి (Cancer) 


ఇవాళ మిమ్మల్ని నెగటివిటీ వెంటాడుతుంది. మీలో అసహనం పెరుగుతుంది. లక్ష్యం వైపు దృష్టి సారించలేరు. చేపట్టిన పనులు లేదా ప్రాజెక్టులు నెమ్మదిగా సాగుతాయి. అది మీకు చెడ్డ పేరు తీసుకురావొచ్చు. చిన్న చిన్న పనుల్లోనూ తప్పులు దొర్లుతాయి. అది మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. మీ రోజు వారీ జీవితంలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.


సింహ రాశి (LEO)


చంద్ర అనుగ్రహంతో ఇవాళ మీకు కలిసొస్తుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు కురిపిస్తాయి. పెద్దల అనారోగ్య సమస్యలు నయమవుతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. జ్యోతిష్యుడు లేదా పండితుడి సూచన మేరకు ఏదైనా హోమం లేదా పూజ చేస్తారు.


కన్య రాశి (Virgo)


వ్యాపారపరంగా కొత్త ప్రణాళికలు అమలుచేస్తారు. మీకున్న నెట్‌వర్క్ ఆ ప్రణాళికలను అమలుచేయడంలో దోహదపడుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో వ్యాపారపరంగా పెద్ద ఆర్డర్ లభిస్తుంది. వ్యాపార వర్గాల్లో మీ పేరు అందరికీ తెలుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమికులకు అనుకూల సమయం.


తులా రాశి (Libra)


మిమ్మల్ని వెంటాడుతున్న నెగటివిటీకి ఇవాళే చివరి రోజు. చంద్ర అనుగ్రహంతో ఇబ్బందికర, గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడుతారు. పెండింగ్‌లో ఉన్న పనులను చాకచక్యంతో త్వరగా పూర్తి చేయగలుగుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకున్నందుకు ప్రశంసలు పొందుతారు. సాహిత్యపరమైన పనులకు కొత్త డబ్బును ఖర్చు చేస్తారు.


వృశ్చిక రాశి (Scorpio)


ఇవాళ మీకు కలిసిరాదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. వృత్తిపరంగా, కుటుంబపరంగా అనుకోని సమస్యలు చుట్టుముడుతాయి. మీ సహనానికి ఇది పరీక్షా కాలం వంటిది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది ప్రతికూల సమయం. తప్పుడు నిర్ణయాలతో సాఫీగా సాగుతున్న జీవితంలో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు.


ధనుస్సు రాశి (Sagittarius)  


వృత్తిపరమైన నిర్ణయాలు కలిసొస్తాయి. మీ జడ్జిమెంట్ కొన్ని విషయాల్లో నిజమవుతుంది. మీ ఆఫీసులో మీ లీడర్‌షిప్‌ పట్ల మరింత నమ్మకం కుదురుతుంది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారస్తులు పార్ట్‌నర్‌తో కలిసి కొత్త ఆవిష్కరణల దిశగా అడుగు వేస్తారు. సమీప భవిష్యత్తులో మీ వ్యాపార పురోగతికి అది దోహదపడుతుంది.


మకర రాశి (Capricorn) 


చంద్ర అనుగ్రహం పొందుతారు. వృత్తిలో బాగా రాణిస్తారు. ఉద్యోగ రీత్యా ప్రమోషన్ ఉంటుంది. లేదా ఇప్పుడున్న జాబ్ నుంచి ఎక్కువ వేతనం వచ్చే జాబ్‌లోకి మారుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. మీ ఆరోగ్యం కుదుటపడటం కుటుంబ సభ్యుల్లో సంతోషం నింపుతుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు.


కుంభ రాశి (Aquarius)


పరిస్థితులు అదుపులో ఉంటాయి. చేపట్టిన ప్రతీ పనిని ఎంజాయ్ చేస్తారు. ఏకాగ్రతతో ముందుకు సాగుతారు. మీ వర్కింగ్ స్టైల్‌ మీ కొలిగ్స్‌కి స్పూర్తినిచ్చేలా ఉంటుంది. ఇవాళ మీ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆషాఢ మాసం ముగుస్తుండటంతో సింగిల్స్‌కి మంచి పెళ్లి సంబంధం రావొచ్చు. పెళ్లి విషయంలో పెద్దల నిర్ణయానికి ప్రాధాన్యతనిస్తారు.


మీన రాశి (Pisces) 


వృత్తిపరంగా, కుటుంబపరంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. అవి మిమ్మల్ని అసంతృప్తికి గురిచేస్తాయి. చేపట్టిన పనులపై ఏకాగ్రత ఉండదు. కష్టపడిన సంపాదించిన డబ్బును సరైన రీతిలో పెట్టుబడి పెట్టడంలో విఫలమవుతారు. ప్రస్తుతం ఉన్నచోటు నుంచి మరో చోటుకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉంటారు. ప్రస్తుతానికి ఆ ఆలోచన మానుకుంటే మంచిది. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం... హయత్‌నగర్‌లో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం..


Also Read: EPF Money Interesting Facts: ఈపీఎఫ్ ఫండ్‌ని బ్యాంకులు, కోర్టులు అప్పు కింద అటాచ్ చేయొచ్చా? చట్టం ఏం చెబుతోంది?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.