Horoscope Today July 31st 2022:  ఇవాళ ఆదివారం. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు శని దేవుడి తండ్రి. కాబట్టి సూర్యానుగ్రహం శని బాధల నుంచి కూడా విముక్తి చేస్తుంది. అందుకే ఆదివారం హిందువులు సూర్య భగవానుడిని పూజిస్తారు. మరి ఈ ఆదివారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


చంద్ర అనుగ్రహం కలుగుతుంది. గతంలో వద్దనుకుని వాయిదా వేసిన పనులను తిరిగి చేపట్టేందుకు అనుకూల సమయం. విధి మీకు అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. పాజిటివ్ ఫలితాలే తప్ప నెగటివిటీ ఉండదు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు.. తమ కృషికి తగిన గుర్తింపు దక్కించుకుంటారు. మతపరమైన లేదా పుణ్యక్షేత్రాల సందర్శన మీకు ప్రశాంతతను మనశ్శాంతిని కలగజేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు నయమవడంతో ఉత్సాహంగా కనిపిస్తారు.


వృషభ రాశి (Taurus)


ఇవాళ మీపై చంద్రుడి నెగటివ్ ప్రభావం ఉంటుంది. అది మిమ్మల్ని నెగటివిటీ వైపు లాగుతుంటుంది. కాబట్టి ఆచీ తూచీ వ్యవహరించాల్సిన సమయమిది. కోప, తాపాల కన్నా పట్టువిడుపు ధోరణి మంచిది. ఆర్థిక పరిస్థితి కొంతమేర క్షీణిస్తుంది. పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ప్రస్తుతానికి విరమించుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.


మిథున రాశి (GEMINI)


ఇవాళ మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి మరింత ప్రేమను పొందుతారు. చాలారోజుల తర్వాత ఇద్దరికీ ఏకాంత సమయం చిక్కుతుంది. సింగిల్స్‌కు తగిన జోడీ దొరికే అవకాశం ఉంది. వృత్తిపరంగా బాగా రాణిస్తారు. చేపట్టిన పనుల్లో సహోద్యోగుల సహకారం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే.. పనితోనే సమాధానం చెప్తారు.


కర్కాటక రాశి (Cancer) 


ప్రత్యర్థులు, శత్రువులతో వివాదాల్లో మీదే పైచేయి అవుతుంది. ప్రస్తుతానికి వారు మీ జోలికి రారు. మీ ఎదుగుదల వారిని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఈరోజు కొత్త ఇల్లు లేదా వాహన కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు చేయవచ్చు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. భార్య లేదా భర్త కోరిన వస్తువును బహుమతిగా అందిస్తారు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ కనబరుస్తారు.


సింహ రాశి (LEO)


గ్రహాల కలయిక మీ జాతకంపై పాజిటివ్ ప్రభావం చూపుతుంది. అది మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలమనే నమ్మకం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ఆలోచన చేయరు. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పనిలోకి దిగుతారు. ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తారు. మేదోపరమైన చర్చల్లో పాల్గొంటారు.


కన్య రాశి (Virgo)


ఇవాళంతా మూడీగా ఉంటారు. అది మీరు చేపట్టిన పనులపై, ముఖ్యంగా ఆఫీస్ వర్క్‌పై ప్రభావం చూపుతుంది. సకాలంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేక విమర్శలు ఎదుర్కొంటారు. పెద్దల ఆశీస్సులతో కొంతవరకు ప్రతికూల పరిస్థితులు సర్దుకుంటాయి.మునుపటి వేగంతో మళ్లీ పనిచేసేందుకు ప్రయత్నిస్తారు. పట్టుదల, సంకల్పం మీకున్న పాజిటివ్ అంశాలు. 


తులా రాశి (Libra)


పని విషయంలో మీకు తిరుగుండదు. చేపట్టిన పనిపై ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. ఈరోజు ముగిసేసరికి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది సమీప భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. తోబుట్టువులు కూడా మీతో చేరే అవకాశం ఉంది. న్యాయపరమైన విషయాల్లో శుభవార్త వింటారు. 


వృశ్చిక రాశి (Scorpio)


వృత్తిపరంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివారిని ఆశ్చర్యపోయేలా చేస్తాయి. మీ వాగ్ధాటి, చతురతతో సేల్స్‌ను పెంచుకోగలరు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఆర్డర్స్ పొందడంలో ఈ స్కిల్స్ ఉపయోగపడుతాయి. వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఆర్థిక స్థితి, ఆరోగ్యం బాగుంటాయి. ప్రేమికులు మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా మనస్పర్థలు తొలగించుకోగలరు.


ధనుస్సు రాశి (Sagittarius)  


కొత్త వ్యక్తుల పార్ట్‌నర్‌షిప్‌తో వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. నెమ్మదిగా లాభాలు పుంజుకుంటాయి. అది మీలో ఆశావహ దృక్పథాన్ని పెంచుతుంది. మీ ఆత్మగౌరవానికి భంగం కలిగే పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. మీ చుట్టూ ఉండే నెగటివ్ వ్యక్తుల వలలో పడకుండా అదే మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.


మకర రాశి (Capricorn) 


ఇవాళ చాలా నిరుత్సాహంగా ఉంటారు. పడిన కష్టానికి విలువ లేకుండా పోతుంది. అది మిమ్మల్ని కుంగదీస్తుంది. డబ్బు ఎక్కువగా ఖర్చవడం రాబడి పెద్దగా లేకపోవడం ఆర్థికంగా మిమ్మల్ని డౌన్ చేస్తుంది. కుటుంబం నుంచి కూడా మీపై ఒత్తిడి పెరగవచ్చు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుందుకు గట్టి ప్రయత్నాలే చేస్తారు. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు.


కుంభ రాశి (Aquarius)


కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాల పంట పడిస్తాయి. అందులో కొంత మొత్తాన్ని ఇతరులకు సాయం అందించగలరు. స్వచ్చంద సేవా సంస్థలకు తోచిన సాయం చేస్తారు. మీరు చేసే కార్యక్రమాలు సమాజంలో మీ పట్ల గౌరవాన్ని పెంచుతాయి. సింగిల్స్‌ తమ సోల్‌మేట్‌ను కలుసుకునే అవకాశం ఉంది.


మీన రాశి (Pisces) 


ఏ పనైనా మీ అంతరంగాన్ని ఫాలో అవండి. తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు ఇటీవలి పరీక్షల్లో బాగా రాణిస్తారు. ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూల సమయం.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)



Also Read: EPFO: పెన్షన్‌దారులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్..లైఫ్‌ సర్టిఫికెట్ ఇలా పొందవచ్చు..!


Also Read: Bhatti Vikramarka: రాజగోపాల్ రెడ్డిని ఒప్పించే ప్లాన్ ఉంది..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook