Horoscope Today June 30th 2022: ఇవాళ జూన్ చివరి రోజు. గ్రహాలు, రాశుల మారుతున్న కదలిక వివిధ రాశిచక్ర గుర్తుల వారిని ప్రభావితం చేస్తుంది. కర్కాటక రాశి వ్యక్తులు ఇంకాస్త ఎక్కువ కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. సింహ రాశి వారు చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాలి. ఈరోజు పూర్తి రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి..

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries)


మేష రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ మాట తీరు మీ వ్యాపారాన్ని పెంచుతుంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. యువత ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురవుతారు. ఇల్లు, వస్తువులు, ఏర్పాట్ల విషయంలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే బాగుంటుంది. కానీ ఏదైనా చేసే ముందు కచ్చితంగా పెద్దల అభిప్రాయం తీసుకోండి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి, ఒకరకమైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలిసే ప్రయత్నాలు ప్రస్తుతానికి వాయిదా వేయండి. వీలైతే వారినే రమ్మని కోరండి.


వృషభ రాశి (Taurus)


వృషభ రాశి వారు తమ యజమానిని కలిసినప్పుడు, వారి పట్ల చాలా గౌరవంతో ఉండాలి. బాస్‌తో వాదిస్తే అనవసర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించాలి. భాగస్వామితో సంబంధంలో ఎంత పారదర్శకత ఉంటే అంత మంచిది. నేడు యువత ఎక్కువగా తిరగాల్సిన అవసరం లేదు. యువత తమ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వారు బాగా కష్టపడాలి. కుటుంబంలోని పెద్దలకు సేవ చేయాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో అతిసారం వచ్చే అవకాశం ఉంది. 


 


మిథున రాశి (GEMINI)


మిథునరాశి వారు ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండాలి, మీ పనిలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చేయండి. వ్యాపారంలో అదనపు వస్తువులను డంప్ చేయవద్దు. డిమాండ్ అండ్ సప్లై అంచనా వేసిన తర్వాత మాత్రమే స్టాక్ తీసుకోండి. డ్రైవింగ్‌లో జాగ్రత్త. లేనిపక్షంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి, ఆమె మందులు అయిపోయినట్లయితే, వాటిని తీసుకువచ్చి అందించండి. ఇవాళ కీళ్ల నొప్పులు బాధించవచ్చు. ఎదుటివారి వివాదాల్లో తలదూర్చవద్దు.


కర్కాటక రాశి (Cancer) 



కర్కాటక రాశి వ్యక్తులు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి, ఈ సమయం పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. కష్టపడి పనిచేసినా తక్కువ డబ్బే లభిస్తోందని చింతించకండి. వ్యాపారస్తులు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి, యువత ఉన్నత విద్యకు మంచి అవకాశాలు పొందవచ్చు. ప్రేమికులు-ప్రియురాలు విషయానికొస్తే, ఈ రోజు వారికి మంచి రోజు కానుంది. ప్రతి ఒక్కరికి కుటుంబంలో వారి స్వంత ప్రాముఖ్యత ఉంటుంది, సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి వారు కోరుకునే గౌరవం ఇవ్వండి.


సింహ రాశి (LEO)


ఈ రాశి వారు చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆఫీసు విషయానికొస్తే అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. అందరినీ గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా వ్యాపారం చేయండి. కొత్త స్నేహాల పట్ల ఆచీ తూచీ వ్యవహరించండి. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి. మీ తండ్రితో కూర్చుని ఇంట్లో కుటుంబం, బంధువుల గురించి చర్చించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే.. జంక్ ఫుడ్, నాన్ వెజ్‌లకు దూరంగా ఉండండి.


కన్య రాశి (Virgo)


కన్యా రాశి వ్యక్తులు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతారు. పనిలో మీ లోపాలను తొలగించుకోవడపై ఫోకస్ చేయాలి. వ్యాపారంలో కొత్త భాగస్వామిని చేర్చుకోవడంపై చర్చలు జరుపుతారు. కొత్త వ్యక్తిని భాగస్వామిగా చేర్చుకునేటట్లయితే అతని గురించి క్షణ్ణంగా తెలుసుకోండి. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించవద్దు.



తులా రాశి (Libra)


విద్యార్థులు తమ చదువుపై దృష్టి సారించాలి. కంఠస్థం చేసిన పాఠాన్ని మరచిపోతున్నట్లయితే, రాయడం ద్వారా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఒక ముఖ్యమైన సమావేశం ఉండవచ్చు, దాని కోసం సిద్ధంగా ఉండండి. తద్వారా మీరు మంచి ప్రెజెంటేషన్ ఇవ్వగలరు, ఇన్‌స్టిట్యూట్ పట్ల అంకితభావంతో పని చేయవచ్చు. ఈ రాశివారి వ్యాపారంలో లాభనష్టాలు ఉంటాయి. నష్టం వస్తే అనవసరంగా కోపగించుకుంటే పని మరింత దిగజారుతుంది. తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.


వృశ్చిక రాశి (Scorpio)



యువతకు ఖర్చుల జాబితా చాలా ఉంటుంది. కానీ అవసరమైనంత మాత్రమే ఖర్చు చేయాలి. కొత్త ఉద్యోగంలో సమయ పాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. సమయానికి కార్యాలయానికి చేరుకోండి. వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించాలి, ఉదయాన్నే ఎలాంటి సందేహాలు పెట్టుకోకూడదు, వివాదాలకు దూరంగా ఉండాలి. యువత తమ స్నేహితులతో చిరస్మరణీయమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులందరి సహకారంతో ఇంటి వాతావరణం చక్కగా ఉండేలా ప్రయత్నించండి.


ధనుస్సు రాశి (Sagittarius)  


ధనుస్సు రాశి వారు తమ ఉద్యోగానికి సంబంధించి సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో కొంత పురోగతి, అలాగే విస్తరణ ఉంటుంది. యువత మంచి ప్లేస్‌మెంట్స్ కోసం ప్రయత్నించాలి. ఈరోజు మీరు చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. మనస్సు, శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి, మీరు ధ్యానం, యోగా చేయాలి. దానిని మీ దినచర్యలో చేర్చుకోండి.


మకర రాశి (Capricorn) 


మకర రాశి వారు తమ పనుల జాబితాను రూపొందించుకుని ప్రణాళిక వేసుకోవాలి. పనిలో సాంకేతికత సహాయంతో మంచి ఫలితాలు ఉంటాయి. మీరు ఏ వ్యాపారం చేసినా లేదా చేయాలనుకున్నా, మొదట సరిగ్గా ప్లాన్ చేయండి. ప్రణాళిక లేకుండా, ఏ పని చేయకూడదు. యువత తమ మానసిక స్థితిని మార్చుకోవడానికి పుస్తకాలను చదవాలి, ఇది భవిష్యత్తులో వారి జ్ఞానాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. అయితే అనవసర భయాందోళనకు గురికావొద్దు.


కుంభ రాశి (Aquarius)


కుంభ రాశి వారికి ప్రభుత్వ అధికారితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటే చాలా జాగ్రత్తగా పని చేయండి. చిన్న సమస్యలకు భయపడాల్సిన అవసరం లేదు, రుణం తీసుకునే ముందు, దాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా పరీక్షించుకోండి. యువత ఆన్‌లైన్ ప్లేస్‌మెంట్ కోసం శోధించడానికి నెట్‌లోని సెర్చ్ చేయాలి. ప్రేమగా ఉండి కుటుంబంలో ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచండి. చల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.


మీన రాశి (Pisces) 


ఈ రాశిచక్రం వ్యక్తులు చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఇందుకోసం టీమ్ సహాయాన్ని పొందవచ్చు. జాగ్రత్తగా వ్యాపారం చేయండి. ఏదైనా ముఖ్యమైన పేపర్‌పై తొందరపడి సంతకం చేయవద్దు. విద్యార్థులు తరగతి సమయం విలువను అర్థం చేసుకోవాలి, దానిని వృథా చేయకూడదు.  ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటి కిచెన్‌కు సంబంధించిన వస్తువులను ఇంటికి అవసరమైనంత మేరకు కొనండి, అనవసరమైన కొనుగోళ్లు చేయవద్దు. పనితో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి, ఆరోగ్యం బాగుంటేనే పని చేయగలుగుతారు.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)



Also Read: Uddhav Thackeray Resigned: ఉద్ధవ్ థాకరే రాజీనామా.. అసెంబ్లీలో బలపరీక్షకు ముందు కీలక పరిణామం


Also Read: Balamuri Venkat injured: బలమూరి వెంకట్‌పై పోలీసుల దాడి టీఆర్ఎస్ పనే : రేవంత్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.