Balamuri Venkat injured: బలమూరి వెంకట్‌పై పోలీసుల దాడి టీఆర్ఎస్ పనే: రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy to Siddipet Police: సిద్దిపేట మైనారిటీ విద్యార్థుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన 130 మంది విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న ఎన్ఎస్‌యూఐ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ను దారి మధ్యలోనే సిద్ధిపేట వద్ద అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Written by - Pavan | Last Updated : Jun 30, 2022, 12:00 AM IST
  • ప్రశ్నిస్తే గాయపడేలా దాడిచేస్తారా ?
  • అక్రమంగా అరెస్ట్ చేసి దాడులకు పాల్పడుతారా ?
  • సిద్ధిపేట పోలీసులపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
Balamuri Venkat injured: బలమూరి వెంకట్‌పై పోలీసుల దాడి టీఆర్ఎస్ పనే: రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy to Siddipet Police: సిద్దిపేట మైనారిటీ విద్యార్థుల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన 130 మంది విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న ఎన్ఎస్‌యూఐ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బలమూరి వెంకట్‌ను దారి మధ్యలోనే సిద్ధిపేట వద్ద అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్ఎస్‌యూఐ నేతలకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో గాయపడిన వెంకట్‌ని కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బలమూరి వెంకట్‌ని సిద్ధిపేట పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, అతడిపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.

సిద్దిపేట పోలీస్ కమీషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనో లేక అస్వస్థతకు గురైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు వెళ్తేనో ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి దాడికి పాల్పడతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజల చేత ఎన్నుకున్న పాలన కాకుండా పోలీసుల పరిపాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ప్రతిపక్షాల బాధ్యత అని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. కానీ రాష్ట్రంలో పోలీసులు తమని ఆ పని కూడా చేయనివ్వకుండా అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్న విద్యార్థి నాయకుడిని అడ్డుకుని ఇలా దాడికి పాల్పడటం టిఆర్ఎస్ పాలకుల పాశవికత్వానికి నిదర్శనం. ఏ మాత్రం మానవత్వం లేకుండా వెంకట్‌పైన పోలీసులు దాడి చేసి, ఇలా ఆస్పత్రిపాలయ్యేలా చేయడం బాధాకరమన్నారు. టిఆర్ఎస్ పాలకులకు రోజులు దగ్గర పడ్డాయని.. అందుకే ఇలా ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడి భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy)... పాలకులు ఇలాగే పాశవికంగా ప్రవర్తిస్తే వారికి తప్పకుండా తగిన గుణపాఠం చెపుతాం అని హెచ్చరించారు.

Also read : Telangana Inter board: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ విడుదల..విద్యార్థుల అలర్ట్..!

Also read : Corona Updates in Telangana: తెలంగాణలో ఫోర్త్ వేవ్‌ బెల్స్‌..పెరుగుతున్న రోజువారి కేసులు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News