Horoscope Today May 30 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ చాలా సంతోషకరంగా, ఉత్సాహకరంగా గడుస్తుంది. అనుకోని శుభవార్తలు ఇంట్లో సంతోషాలను తీసుకొస్తాయి. కొత్త వ్యాపారాలకు పూర్తిగా అనువైన రోజు. మరికొన్ని రాశుల వారికి ఆరోగ్యం విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళనకరంగా మారవచ్చు. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి ( Aries)


మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరితో మాట్లాడినా.. ఆచీ తూచీ మాట్లాడండి. కాస్త సంయమనం పాటించండి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ప్రేమ జంటలు వివాహం గురించి మాట్లాడుకోవచ్చు. ఆఫీసులో మీ పనికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి.


వృషభ రాశి (Taurus)


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి సంతోషంగా గడుపుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపారస్తులు డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం స్నేహితులతో షికారుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చు.


మిథున రాశి (GEMINI)


ఇవాళ ఉదయం కొద్ది గంటల పాటు ప్రతికూలత వెంటాడుతుంది. చేపట్టిన పనిలో ఆటంకాలు ఉండవచ్చు. ఓర్పుతో చేసే పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో బదిలీ జరిగే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సమేతంగా మతపరమైన ప్రదేశానికి వెళ్లేందుకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లవ్‌మేట్ నుండి ఖరీదైన బహుమతులు అందే ఛాన్స్ ఉంది.


కర్కాటక రాశి (Cancer) 


ఒక శుభవార్త మీ ఇంటిల్లిపాదిని సంతోషంలో ముంచెత్తుతుంది. ఇంట్లో ఉత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రుల సహకారంతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేనిపక్షంలో నష్టం జరగవచ్చు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి.


సింహ రాశి (LEO)


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఆకస్మిక ధన లాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి చూపుతారు. లవ్‌మేట్ నుండి అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని పనుల్లో జాగ్రత్తగా ఉండండి. అభిరుచితో తీసుకున్న నిర్ణయం ప్రాణాంతకం కావచ్చు.


కన్య రాశి (Virgo)


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. విద్యా సంబంధమైన పనుల కోసం అనుకోని ప్రయాణం చేయవలసి రావచ్చు. కొన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. కోపాన్ని నియంత్రించుకోండి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది.


తులా రాశి (Libra)


ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసు ఆనందంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. విద్యా విషయాలలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేయడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది.


వృశ్చిక రాశి (Scorpio)


ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ వ్యక్తి మీకు ద్రోహం చేసే ప్రమాదం ఉంది. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో ముందుకు సాగండి.


ధనుస్సు రాశి (Sagittarius)  


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. విద్యాసంబంధమైన పనుల కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహకారంతో వ్యాపారంలో లాభం ఉంటుంది. ఈరోజు మీ లవ్‌మేట్ పెళ్లి ప్రపోజ్ చేయవచ్చు. తల్లిదండ్రులకు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి.


మకర రాశి (Capricorn) 


ఈరోజు ప్రారంభించే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఆఫీసులో మీరు చేపట్టే పనుల్లో పురోగతి సాధ్యమవుతుంది. వ్యాపారంలో ఆశించిన విధంగా లాభం ఉంటుంది. ఈరోజు అత్తమామల వైపు నుంచి కోడళ్లు లేదా అల్లుళ్లకు బహుమతి అందే అవకాశం. మీరు లవ్‌మేట్‌తో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు శుభవార్త అందుతుంది.


కుంభ రాశి (Aquarius)


ఈ రోజు మీకు సాధారణ రోజు అని చెప్పాలి. ఉద్యోగం కోసం దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. తండ్రి సహకారంతో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. 


మీన రాశి (Pisces) 


ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంలో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపార నిమిత్తం పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. విద్యాపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్తారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేకుంటే మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు.


Also Read: June 2022 Horoscope: జూన్ నెల రాశి ఫలాలు... ఆ తేదీ తర్వాత ఈ రాశుల వారి జీవితంలో కీలక మార్పులు


Also Read: Vastu Tips: ఇంట్లో లాఫింగ్ బుద్ధను ఏ దిశలో ఉంచితే శుభం జరుగుతుందో తెలుసా...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook