Horoscope Today May 31 2022: నేటి రాశి ఫలాల ప్రకారం... మేష రాశి, వృషభ రాశి, సింహ రాశి తదితర రాశుల వారికి చేపట్టిన ప్రతీ పనిలో విజయం చేకూరే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు తీసుకొస్తాయి. మరికొన్ని రాశుల వారికి కొన్ని కీలక సూచనలు చేయబడ్డాయి. ఆ సూచనలేంటి... ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి ( Aries)


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఏ పని చేసినా పూర్తి ఆత్మవిశ్వాసంతో చేస్తారు. పాత వివాదాలు పరిష్కారమవుతాయి. మీ జీవిత భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకోండి. ఈరోజు పెట్టిన పెట్టుబడులు వ్యాపారంలో లాభాలను తీసుకొస్తాయి. అనవసర వాదనలకు దిగవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది.


వృషభ రాశి (Taurus)


ఇవాళ ఉదయాన్నే మీకు కొన్ని శుభవార్తలు అందుతాయి. చాలా కాలం తర్వాత మీ పాత స్నేహితుడు ఒకరిని కలవవచ్చు. మీరు పనిచేసే కార్యాలయంలోని అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. స్నేహితులతో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి. మీ లవ్‌మేట్‌తో వివాహం గురించి మాట్లాడేందుకు అనువైన సమయం.


మిథున రాశి (GEMINI)


ఈరోజు సాధారణ రోజు కానుంది. ఆఫీసులో అదనపు బాధ్యతలు మీద పడుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. తొందరపాటు నిర్ణయాలతో కొన్ని పనుల్లో గందరగోళం ఎదుర్కొంటారు.


కర్కాటక రాశి (Cancer) 


ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేపట్టే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురుకావొచ్చు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో నష్టాలు చవిచూస్తారు. విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ప్రియురాలు లేదా ప్రియుడితో పెళ్లి విషయం మాట్లాడుతారు. పెద్దల అంగీకారంతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు.


సింహ రాశి (LEO)


ఈ రోజు కొన్ని శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో ఆశించిన విధంగా లాభం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు జరగవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ చుట్టుపక్కల వారికి మీరంటే గౌరవం పెరుగుతుంది. సాయం కోరి వచ్చినవారికి తోచిన మేర సాయపడుతారు.


కన్య రాశి (Virgo)


ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. జీవితంలో కొన్నిసార్లు ఒడిదుడుకులు తప్పవని గుర్తించండి.


తులా రాశి (Libra)


మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపార ప్రణాళిక ఫలవంతంగా ఉంటుంది. విద్యాపరమైన పనుల కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి అన్నివిధాలా సహాయ, సహకారాలు లభిస్తాయి. తద్వారా సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రాశికి చెందిన అవివాహితులకు మంచి వివాహ సంబంధం రావొచ్చు.


వృశ్చిక రాశి (Scorpio)


ఇవాళ ప్రారంభించే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాల వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకుని మెదలాలి.


ధనుస్సు రాశి (Sagittarius)  


ఇది మీకు సాధారణ రోజు అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆశిస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. కొన్ని కారణాలతో లవ్ బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. ప్రియుడు లేదా ప్రియురాలితో అనవసర చర్చలు, వాదనలు చేయవద్దు. వైవాహిక బంధంలో ఉన్నవారికి మనస్పర్థలు తలెత్తవచ్చు.


మకర రాశి (Capricorn) 


మీరు ఈరోజు ప్రారంభించిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు ఇది మంచి రోజు. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లవచ్చు. అభ్యర్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో ఏదో విషయంలో వాగ్వాదం రావచ్చు. అంతమాత్రాన సహనం కోల్పోవద్దు. మహిళలను ఎల్లప్పుడూ గౌరవించాలి. మీ కూతురితో ఎక్కువ సమయం గడుపుతారు.


కుంభ రాశి (Aquarius)


ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. వ్యాపారంలో సహనం పెంపొందించుకోవాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ప్రేమికులు పెళ్లి గురించి చర్చించుకోవచ్చు. మీ ప్రేమ విషయం మీరే తల్లిదండ్రులకు చెప్పడం ఉత్తమం. మధ్యవర్తుల రాయబారం పనికిరాకపోవచ్చు. కొద్దిరోజులు ప్రతికూలతలు ఉండొచ్చు.


మీన రాశి (Pisces) 


కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఇవాళ కొన్ని శుభవార్తలు అందుకుంటారు. దీంతో మనసుకు సంతోషం కలుగుతుంది. ఈరోజు పెట్టిన పెట్టుబడి వ్యాపారంలో లాభిస్తుంది. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సాయంత్రం, మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా డిన్నర్‌కు వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: Satyendar Jain: ఢిల్లీలో కీలక పరిణామం..మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్..!


Also Read: Chandra Babu Letter: గ్రానైట్ అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయండి..సీఎస్‌కు చంద్రబాబు లేఖాస్త్రం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook