Horoscope for November 17: గ్రహాలు, తిథి, నక్షత్రం అంశాలకు అనుగుణంగా రాశి ఫలాల్ని సదరు వ్యక్తులకు ఎదురయ్యే మంచి చెడుల్ని నిర్దేశిస్తున్నారు జ్యోతిష పండితులు. గ్రహాల కదలిక ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుండే ఈ రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాశివారికి(Zodiac Signs)పరిస్థితులు అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటాయి. మరి మీ రాశి ఫలం, గ్రహబలం(Horoscope today) ఇవాళ ఎలా ఉందో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి Aries: ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తోటివారి సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.


వృషభరాశి Taurus: ప్రయత్న కార్యసిద్ది ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.


మిధునరాశి Gemini: ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. శివనామస్మరణ శుభాన్ని ఇస్తుంది.


కర్కాటకరాశి Cancer  ఈ రాశి వారికి చాలా మంచిది ఈరోజు. శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.


సింహరాశి Leo : ఈ రాశి వారు పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది


కన్యారాశి Virgo: ఈ రాశిలో పుట్టినవారు ప్రారంభించిన పనిలో కార్యసిద్ధి ఉంది. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. చంద్రధ్యానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.


తులారాశి Libra: సమయానుకూలంగా ముందుకు సాగండి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గాఅష్టోత్తర శతనామావళి చదవాలి.


వృశ్చికరాశి Scorpio: ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.


ధనుస్సురాశి Sagittarius: ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు చేయగలుగుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దుర్గారాధన శుభప్రదం.


మకరరాశి Capricorn: ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.


కుంభరాశి Aquarius: అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. తోటివారి సహకారంతో ఆపదలు తొలగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.


మీనరాశి Pisces: లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. దైవబలం రక్షిస్తోంది. గణపతి సహస్ర నామ పారాయణ వల్ల మంచి జరుగుతుంది.


Also read: Mangalavaram sentiments in Telugu: మంగళవారం చేయకూడని పనులు ఇవేనా ? చేస్తే ఏమవుతుంది ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook