నవంబర్ 21న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, ఆ రాశిలో ఇబ్బందులే
Horoscope for November 21: అనంత ఖగోళంలో గ్రహాల కదలిక మన మంచి చెడుల్ని నిర్దేశిస్తుందనేది జ్యోతిష శాస్త్రం చెబుతున్న మాట. గ్రహాల ఆధారంగా రాశిఫలాల్ని ఎప్పటికప్పుడు ఎలా ఉన్నాయనేది పంచాంగం చెబుతోంది. ఒక్కొక్క రాశివారికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఇవాళ నవంబర్ 21న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Horoscope for November 21: అనంత ఖగోళంలో గ్రహాల కదలిక మన మంచి చెడుల్ని నిర్దేశిస్తుందనేది జ్యోతిష శాస్త్రం చెబుతున్న మాట. గ్రహాల ఆధారంగా రాశిఫలాల్ని ఎప్పటికప్పుడు ఎలా ఉన్నాయనేది పంచాంగం చెబుతోంది. ఒక్కొక్క రాశివారికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ఇవాళ నవంబర్ 21న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి Aries: మేషరాశిలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటూ ప్రశంసలు పొందుతారు. ఇంట్లో కాస్త అసంతృప్తి కలగవచ్చు. మీ భార్య మాటలు మిమ్మల్ని వేధించవచ్చు. చేతి వృత్తి వ్యాపారులకు ప్రయోజనం ఉంటుంది. మీ సంతానంలో ప్రేమ వ్యవహారం వివాదాస్పదమవుతుంది. గుడులు, గోపురాల్ని సందర్శిస్తారు.
వృషభరాశి Taurus: ఈ రాశివారికి బంధుమిత్రుల నుంచి భారీగా ధన సహాయం అందుతుంది. మీ అభిప్రాయాలకు గౌరవం దక్కుతుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు లభిస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కలిసి రాకపోవచ్చు. మహిళలలైతే పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మిధునరాశి Gemini: ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఉపాధ్యాయల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్థులైతే నిర్మొహమాటంగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే నష్టపోతారు. బంధుమిత్రులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ వాహనాలు, విలువైన వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. స్థిరాస్థుల్ని కొనుగోలు చేయవచ్చు.
కర్కాటకరాశి Cancer: నిరుద్యగులైతే మీకు కలిసి రావచ్చు. అయితే ఈ రాశిలోని మహిళలకు ఆరోగ్యం బాగుండదు. ప్రతి చిన్న పని స్వయంగా చేసుకోవాలి. మీ ఇంట్లోవారితో ప్రయాణాలుంటాయి. ఆలయాల్ని సందర్శిస్తారు.
సింహరాశి Leo : సింహరాశిలో వారు ఆరోగ్య, ఆహారపు అలవాట్లతో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మీ డబ్బుల్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో ఉన్నవారు చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్థులకు పనిభారం ఎదురవుతుంది. పెద్దల సహకారం లోపించే అవకాశమున్నందున తీసుకునే నిర్ణయాలు ప్రతికూలం కావచ్చు.
కన్యారాశి Virgo: ఈ రాశిలో పుట్టినవారికి ఇబ్బందులు తప్పవు. మీ వస్తువుల రూపంలో సమస్య రావచ్చు. చిరు వ్యాపారస్థులకు ఈ రాశి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్ని స్వయంగా నిర్వహిస్తారు. సంతానం నుంచి అనర్ధాలు రావచ్చు.
తులారాశి Libra:తులా రాశిలో పుట్టినవారికి ప్రముఖులతో పరిచయాలు లబ్ది చేకూరుస్తాయి. దూర ప్రయాణాలు చేసే సమయంలో మీ వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవాలి. బంధుమిత్రులతో సమస్యలు, చికాగు తలెత్తవచ్చు. దైవాధి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. డబ్బుల విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. లక్ష్యాల్ని మాత్రం సాధిస్తారు.
వృశ్చికరాశి Scorpio: ఇళ్లలో చిన్న చిన్న సమస్యలు తప్పవు. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మత్స్యకారులు, కోళ్లు, గొర్రెల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. వీలైనంతవరకూ మీ పనుల్ని స్వయంగా చేసుకోవడమే మంచిది.
ధనుస్సురాశి Sagittarius: దనస్సు రాశిలో మహిళల కోర్కెలు నెరవేరుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లోవారితో బేధాభిప్రాయాలు వస్తాయి. కళలు, క్రీడాకారులకు మద్దతు లభిస్తుంది. డబ్బుల వ్యవహారంలో ఏకాగ్రత చాలా అవసరం. లేకపోతే నష్టాలెదురవుతాయి.
మకరరాశి Capricorn: మకరరాశిలో పుట్టినవారు జాగ్రత్త వహించక తప్పదు. లేదా ఇష్టదైవాన్ని ఆరాధించుకోవాలి. ఎందుకంటే ఈ రాశిలో వారికి చాలా సమస్యలున్నాయి ఒకేసారి వివిధ రకాల పనుల్ని చేపట్టడం వల్ల ఇబ్బందులెదురవుతాయి. ఇంట్లో శుభకార్యం కోసం ప్రయత్నిస్తారు. ఒక్కోసారి తప్పటడుగులు వేస్తారు.
కుంభరాశి Aquarius: ఈ రాశివారు సాంఘిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులైతే ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రకాల వ్యాపారాలకు పూర్తిగా అనుకూలం. కొత్త కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటారు. అయితే అనుకున్న పనులు అంత సులభంగా జరిగే పరిస్థితి లేదు.
మీనరాశి Pices: ముఖ్యంగా ఈ రాశివారు దూర ప్రయాణాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. బంధువుల రాకపోకలు ఎక్కువవుతాయి. ఇంట్లో పనివారితో మహిళలకు సమస్యలుంటాయి. ఇంటికి సంబంధించిన విలువైన పరికరాలు, వస్తువులు కొంటారు. కొంతమంది వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook