కార్తిక పౌర్ణమి 2021: దేవ్ దీపావళి అంటే ఏంటి ? దేవుళ్లకు వేరే దీపావళి ఉందా ? కార్తిక పౌర్ణమికి, దేవ్ దీపావళికి సంబంధం ఏంటి ?

దేవ్ దీపావళి అంటే ఏంటి ? దేవుళ్లకు వేరే దీపావళి ఉందా ? కార్తిక పౌర్ణమికి, దేవ్ దీపావళికి సంబంధం ఉందా ? దేవ్ దీపావళి గురించి ఎప్పుడైనా విన్నారా ? దీపావళి గురించి విన్నాం కానీ అసలు ఈ దేవ్ దీపావళి అంటే ఏంటి అంటారా ? చిన్న పిల్లలకు తెలిసినా.. తెలియకపోయినా.. ఇంట్లో పెద్ద వాళ్లకు ఈ దేవ్ దీపావళి పర్వదినం గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 07:17 PM IST
  • దేవ్ దీపావళి పండగకు దీపావళి పండగకు సంబంధం ఏంటి ?
  • దేవ్ దీపావళి అని పేరు రావడానికి కారణం ఏంటి ?
  • కార్తిక పౌర్ణమి నాడు దేవలోకంలో ఉన్న దేవతలు ఏం చేశారు ?
  • దేవ్ దీపావళి వెనుక చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో
కార్తిక పౌర్ణమి 2021: దేవ్ దీపావళి అంటే ఏంటి ? దేవుళ్లకు వేరే దీపావళి ఉందా ? కార్తిక పౌర్ణమికి, దేవ్ దీపావళికి సంబంధం ఏంటి ?

దేవ్ దీపావళి అంటే ఏంటి ? దేవుళ్లకు వేరే దీపావళి ఉందా ? కార్తిక పౌర్ణమికి, దేవ్ దీపావళికి సంబంధం ఉందా ? దేవ్ దీపావళి గురించి ఎప్పుడైనా విన్నారా ? దీపావళి గురించి విన్నాం కానీ అసలు ఈ దేవ్ దీపావళి అంటే ఏంటి అంటారా ? చిన్న పిల్లలకు తెలిసినా.. తెలియకపోయినా.. ఇంట్లో పెద్ద వాళ్లకు ఈ దేవ్ దీపావళి పర్వదినం గురించి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం రండి.

దేవ్ దీపావళి అంటే దీపావళి పండగ తర్వాత 15 రోజులకు వస్తుంది. అంటే సరిగ్గా కార్తిక పౌర్ణమి నాడే అన్నమాట. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే వేడుకలనే దేవ్ దీపావళి అని కూడా పిలుస్తారు. అయితే దీనివెనుక చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. 

ఈ వేడుకలకు దేవ్ దీపావళి అని పేరు రావడానికి కారణం ఏంటంటే... ఈ రోజునాడే, దేవతలు దీపావళి పండగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారని ఇతిహాసాలు చెబుతున్నాయి. 

అసురులపై శివుడు సాధించిన విజయానికి సంకేతంగా ఆనాడు దేవతలు కార్తిక పున్నమి నాడే దీపావళి పండగను జరుపుకున్నారు. అందుకే ఈ దీపావళి పండగకు దేవ్ దీపావళి అనే పేరు వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

కార్తిక పౌర్ణమి నాడు దేవలోకంలో ఉన్న దేవతలు అంతా భూమిపైకి వచ్చి గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించి మరీ అసురులపై విజయాన్ని వేడుకగా జరుపుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి.

Also read: 

ఈ సంవత్సరం దేవ్ దీపావళి ఎప్పుడు వస్తోందంటే... 
ఈ సంవత్సరం కార్తిక పౌర్ణమి నవంబర్ 19, శుక్రవారం అవుతున్నప్పటికీ.. తిథి ప్రకారం నవంబర్ 18, గురువారం మధ్యాహ్నం 12 గంటలకే దేవ్ దీపావళి ప్రారంభమవుతోంది. తిరిగి కార్తిక పౌర్ణమి అయిన మరునాడు.. అనగా నవంబర్ 19, శుక్రవారం మధ్యాహ్నం 2:26 గంటలకు తిథి దేవ్ దీపావళి ముగుస్తుంది. కార్తిక పౌర్ణమి నాడు ప్రదోశ కాలంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తే.. తప్పక పుణ్యఫలం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం.

దేవ్ దీపావళి ప్రాధాన్యత, చరిత్ర:
తారకసుర అనే రాక్షసుడికి తారకాక్ష, విద్యున్మలి, కమలాక్ష అనే ముగ్గురు పుత్రులు ఉండేవారు. బ్రహ్మ దేవుడి నుంచి వరం పొందడం కోసం ఈ ముగ్గురు రాక్షసులు ఘోర తపస్సు చేస్తారు. వారి తపస్సును మెచ్చిన బ్రహ్మ దేవుడు వారి ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని కోరుతాడు. అందుకు ముగ్గురు కూడా తమకు మరణం అనేది లేకుండా వరం ఇవ్వాల్సిందిగా కోరుతారు. 

ముగ్గురు రాక్షసులు కోరిన కోరిక ప్రకృతి విరుద్ధమైనది కావడంతో ఆ వరం నేరుగా ఇవ్వడానికి వెనుకాడిన బ్రహ్మదేవుడు.. వారికి ఓ షరతు పెట్టి ఆ వరం ఇస్తాడు. ఆ షరతు ఏంటంటే.. మీ ముగ్గురు సోదరులను ఒక్కొక్కరిగా ఎవ్వరూ చంపలేరు. మీ ముగ్గురిని ఒకేసారి ఒకే ఒక్క భాణంతో చంపగలిగేతేనే మీ ముగ్గురికీ మరణం ఉంటుంది. అప్పటి వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే వరం ప్రసాదిస్తాడు. 

Also read: నవంబర్ 18 కార్తీక పౌర్ణమి నాడు ఇవాళ మీ రాశి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

అలా బ్రహ్మ దేవుడి నుంచి వరం పొందిన ఆ ముగ్గురు రాక్షసులు మూడు లోకాలను నాశనం చేస్తూ దేవుళ్లను, దేవతలను ఇబ్బందిపెట్టసాగారు. దీంతో దేవుళ్లంతా ఏకమై శివుడిని శరణు కోరుతారు. అప్పుడు శివుడు త్రిపురారి అవతారంలో వెళ్లి ఆ ముగ్గురిని ఒకే భాణంతో వధిస్తాడు. ఆ ముగ్గురు రాక్షసుల అంతాన్నే త్రిపురాసుర అని కూడా పిలుస్తారు. ముగ్గురు రాక్షసుల అంతంతో తిరిగి ముల్లోకాల్లో శాంతి నెలకొంటుంది. ముగ్గురు రాక్షసులపై శివుడి విజయానికి ప్రతీకే ఈ దేవ్ దీపావళి. కార్తిక పూర్ణిమ అయిన దేవ దీపావళి నాడు దీపాలు వెలిగించే శివుడిని, ఆ లక్ష్మీ దేవిని ఆరాధిస్తే మంచిదని శాస్త్రాలు తెలిసిన పండితులు చెబుతున్నారు.

Also read : కలల జ్యోతిషశాస్త్రం: పదే పదే మరణించిన వారు కలలో కనపడుతున్నారా..?? అయితే దానికి అర్థం ఇదే!

Also read: సమస్యలతో సతమతం అవుతున్నారా..? జమ్మి చెట్టు ఇంట్లో నాటితే అన్ని కష్టాలు తొలగిపోతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News