ఇవాళ నవంబర్ 25న మీ జాతకం, రాశి ఫలాలు ఇలా ఉంటాయి
గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది. మరి ఇవాళ మీ జాతకం అంటే మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దామా.
గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది. మరి ఇవాళ మీ జాతకం అంటే మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దామా.
మేషరాశి (Aries):ఈ రాశిలో పుట్టినవారికి ఇవాళ ఇబ్బందులు ఎదురవుతాయి. దైనందిన వ్యవహారాలలో అవాంతరాలు. వ్యయప్రయాసలుంటాయి. బంధువర్గంతో తగాదాలు తలెత్తవచ్చు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
వృషభరాశి ( Taurus): ఈ రాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు సన్నిహితుల సహాయం అందుతుంది. ఆదాయం బాగుంటుంది. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిధునరాశి ( Gemini): ఈ రాశిలో పుట్టినవారికి ఇవాళ అంతా ప్రతికూలంగానే ఉండవచ్చు. ఇవాళ్టి పనుల్లో జాప్యం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒప్పందాలు వాయిదా పడనున్నాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడవచ్చు, వ్యాపార, ఉద్యోగావశాలు సన్నగిల్లుతాయి.
కర్కాటకరాశి ( Cancer): ఇవాళ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్థిలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
సింహరాశి (Leo):ఇవాళ పరిస్థితులు ప్రతికూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. అనారోగ్యంతో బాధపడతారు. ఉద్యోగ, వ్యాపారాలు పెద్దగా ఉండక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్యారాశి ( Virgo): ఈ రాశివారికి ఇవాళ అంతా అనుకూలంగా ఉంటుంది. అప్పుల బాధ పోతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. విందువినోదాల్లో పాలుపంచుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.
తులారాశి ( Libra): ఈ రాశిలో పుట్టినవారి పరిస్థితులు ఇవాళ సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులైతే ఇవాళ ఇంటర్వ్యూలు ఎదుర్కొంటారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభముంటుంది. గుడులు, గోపురాలు సందర్శిస్తారు. వ్యాపారం బాగుంటుంది.
వృశ్చికరాశి ( Scorpio): ఈ రాశివారికైతే పరిస్తితులు ప్రతికూలంగా ఉంటాయి. ఇవాళ కొన్ని వ్యవహారాలు నిలిచిపోతాయి. మిత్రుల నుంచి ఊహించని ఒత్తిడి ఎదురవుతుంది. కుటుంబంలో సమస్యలు ఉంటాయి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారం పెద్దగా బాగుండదు.
ధనుస్సురాశి ( Sagittarius): ఈ రాశివారికి పరిస్థితి పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దీనికితోడు ఆస్థి వివాదాలు తప్పవు. వ్యాపారంలో సమస్యలుంటాయి.
మకరరాశి ( Capricorn):ఈ రాశివారికి పరిస్థితి అనుకూలంగా ఉండవచ్చు. ఈ రోజు పనులు సక్రమంగా జరుగుతాయి. ముఖ్యంగా శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త కొత్త సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారం బాగుంటుంది.
కుంభరాశి ( Aquarius): ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతూ సమస్యలు ఎదుర్కొంటారు. మీ ఆలోచన కూడా స్థిరంగా ఉండదు. దైవదర్శనాలుంటాయి. వ్యాపారం గానీ, ఉద్యోగం గానీ సాధారణంగానే ఉంటుంది.
మీనరాశి ( Pices): ఇవాళ పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవాళ మీ సన్నిహితులతో వివాదాలుంటాయి. ఆలోచన స్థిరంగా కొనసాగదు. అనారోగ్యం ప్రధాన సమస్యగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఇబ్బంది కల్గిస్తాయి.
Also read: ఇవాళ నవంబర్ 24న మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ రాశివారు అప్పులు చేస్తారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook