Horoscope Today September 10th 2022: ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడినరోజు. ప్రతీ శనివారం హనుమాన్ చాలీసా చదవడం, సూర్యాస్తమయం లేదా సూర్యోదయం కన్నా ముందు రావిచెట్టుకు పూజలు చేయడం ద్వారా శని బాధల నుంచి గట్టెక్కుతారు. మరి ఈ శనివారం ఏయే రాశుల జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries) : 


చంద్ర అనుగ్రహం కలుగుతుంది. గత వారం ఎదురైన ఒడిదుడుకుల నుంచి అది మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు దొరకవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో సానుకూల వాతావరణం ఉంటుంది. కొలిగ్స్ సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారస్తులు కొత్త వెంచర్స్ ప్రారంభించే యోచనలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.


వృషభ రాశి (Taurus)


ఇవాళంతా నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతారు. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ప్రస్తుతానికి పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. వ్యాపారస్తులు కొత్త వెంచర్స్ జోలికి వెళ్లవద్దు. ఆర్థికంగా నష్టాలను చవిచూసే సూచనలున్నాయి. గతంలో వచ్చిన లాభాలు కూడా నష్ఠాల ధాటికి ఎగిరిపోతాయి. అది మిమ్మల్ని కొంత బాధిస్తుంది. తిరిగి పుంజుకునేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.


మిథున రాశి (GEMINI)


మానసిక ప్రశాంతతో ఉంటారు. లక్ష్యంపై మీ ఫోకస్ చెక్కు చెదరదు. జీవిత భాగస్వామితో రొమాంటిక్ క్షణాలను గడుపుతారు. ఆమె లేదా అతనితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంటుంది. కుదిరితే మీకు నమ్మకస్తులైన వారి సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. 


కర్కాటక రాశి (Cancer) 


మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మునుపటి కన్నా మరింత ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. వృత్తి వ్యవహారాల్లో మీ పెర్ఫామెన్స్ మరింత మెరుగవుతుంది. ఆఫీసులో సీనియర్లు, మీ బాస్ మీ పనితీరుకు ఫిదా అవుతారు. మీకు జాబ్ ప్రమోషన్ ఆఫర్ చేయవచ్చు. న్యాయపరమైన కేసుల్లో గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులు మీ ఎదుగదలను మౌనంగా గమనిస్తుంటారు.


సింహ రాశి (LEO)


కఠినమైన టాస్క్‌లను కూడా ఇట్టే పూర్తి చేసేస్తారు. ఏ పని అప్పగించినా స్మార్ట్‌గా చేయడం, సకాలంలో పూర్తి చేయడం అలవడుతుంది. ఇవాళ్టి నుంచి మీలో కాన్ఫిడెన్స్ మరో లెవల్‌లో ఉంటుంది. అనవసర వివాదాలపై వాదనలు చేయవద్దు. అది మీ విలువైన టైమ్‌ను వృథా చేసుకోవడమే. మిమ్మల్ని నమ్ముకున్న వారి పట్ల ఎక్కువ శ్రద్ధతో వ్యవహరించాలి.


కన్య రాశి (Virgo)


ఇవాళ మీకు ప్రతికూలతలు ఎదురవుతాయి. మదిలో తెలియని అసంతృప్తి గూడుకట్టుకుంటుంది. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ప్రస్తుతం మీరున్న స్థితిపై విరక్తి భావన కలుగుతుంది. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఓపికతో ఎదుర్కోవడం ముఖ్యం. పెద్దల సలహా కోరండి. వారి మాటలు వినండి. కీలక నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం ఉత్తమం.


తులా రాశి (Libra)


ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకుంటారు. అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొలిగ్స్ సాయంతో కఠినమైన పనులు కూడా సులువుగా పూర్తి చేయగలరు. ఏ పనిలోనైనా సక్సెస్ పొందుతారు. ప్రాపర్టీ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.


వృశ్చిక రాశి (Scorpio)


ముక్కుసూటితనం పనికిరాదు. అది కొందరిని నొప్పించవచ్చు. కాబట్టి ఆ తీరు మార్చుకుంటే మంచిది. వట్టి వాగుడుకాయ అనే ముద్ర నుంచి బయటపడండి. అది మీ కెరీర్‌కు మంచిది కాదు. కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరమైన వస్తువుల కోసం వెచ్చించకండి. కీలక నిర్ణయాలు కాస్త ఓపికతో తీసుకోండి.


ధనుస్సు రాశి (Sagittarius)  


కొద్దిరోజులుగా వెంటాడుతున్న అసంతృప్తి, బాధ ఎగిరిపోతాయి. మనసు నిండా సంతోషం పరుచుకుంటుంది. వ్యక్తిగత, వృత్తి జీవితం సాఫీగా సాగుతుంది. పెండింగ్ పనులు ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేస్తారు. కొత్త వెంచర్స్ ప్రారంభించేందుకు అనుకూల సమయం. తోబుట్టువులు మీ ఇంటికొచ్చే అవకాశం ఉంది. 


మకర రాశి (Capricorn) 


మీ అంకితభావానికి ఇది పరీక్షా కాలం. అందులో మీరు పాస్ అయినట్లే మీ కష్టానికి తగిన ఫలితం ఉండొచ్చు. అంతకుమించి ఫలితాలు ఎదురవొచ్చు.స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు లాభిస్తాయి. మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా మీ ఆలోచనల్లో మార్పులు అవసరమని గుర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.


కుంభ రాశి (Aquarius)


విధి మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతీ పని సక్సెస్ అవుతుంది. మతపరమైన స్థలాలు లేదా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బ్యాచిలర్స్‌కి మంచి జోడీ దొరకవచ్చు. పెళ్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ప్రేమికులకు సానుకూల సమయం. ఉద్యోగ, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు.


మీన రాశి (Pisces) 


వ్యాపారంలో మీ చతురత లాభాలను తీసుకొస్తుంది. మునుపటికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. భక్తి భావం, దైవ చింతన పెరుగుతాయి. ప్రేమికులు ఇవాళ సంతోష సమయాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. వివాహితులు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Purandeswari Political Career: పురందేశ్వరిని బీజేపి పక్కకుపెట్టిందా ? ఎన్టీఆర్ కూతురు చేసిన తప్పేంటి ?


Also Read: Virat Kohli: తమ టార్గెట్‌ అంతా టీ20 వరల్డ్ కపే..భారత మాజీ సారధి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook