Horoscope Today September 8th 2022: ఇవాళ గురువారం. శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడిన రోజు.  'ఓం భగవతే వాసుదేవాయ నమ:', 'ఓం బృహస్పతాయ నమ:' అనే మంత్రాలను పఠిస్తూ విష్ణువును పూజిస్తే మంచి ఫలితాలు పొందగలరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries) : ఇవాళ కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రిలేషన్‌షిప్స్ సాఫీగా సాగుతాయి. ఫ్యామిలీ మెంబర్స్‌లో సంతోషం నెలకొంటుంది. మీలో నైతికత మరింత పెరుగుతుంది. మీరు ఉద్యోగస్తులైతే టీమ్ స్పిరిట్‌తో ముందుకెళ్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్లాన్స్ ద్వారా సక్సెస్ అచీవ్ చేస్తారు. వ్యక్తిగత వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది.


వృషభ రాశి (Taurus)


అడ్వెంచర్ టూర్‌కు ప్లాన్ చేస్తారు. మతపరమైన లేదా ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మునుపటికన్నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. ప్రేమ బంధాలు, స్నేహ బంధాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిరోజులుగా ఎదురవుతున్న సమస్యలు నయమవుతాయి. మీ సక్సెస్ శాతం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షించేలా ఉంటుంది.


మిథున రాశి (GEMINI)


ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రూల్స్‌ను బ్రేక్ చేసే నిర్ణయాలకు దూరంగా ఉండాలి. బిజినెస్‌లో పురోగతి ఉంటుంది. మీ కష్టానికి తగిన లాభాలు పొందుతారు. మీ మంచి ప్రవర్తన అందరినీ మీకు దగ్గర చేస్తుంది. మీలో ఓపిక మరింత పెరుగుతుంది. పెద్దలు చెప్పిన మాటలు వింటే మంచి జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. 


కర్కాటక రాశి (Cancer) 


వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. మీ బంధాలు మరింత బలపడుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ బంధాలు మరింత మధురంగా మారుతాయి. కెరీర్‌లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు అంచనాలకు మించి రాణిస్తారు.


సింహ రాశి (LEO)


చెప్పుడు మాటలు వినవద్దు. మనసు పెట్టి ఆలోచించాకే నిర్ణయాలు తీసుకోండి. కాస్త ఓపిక అవసరమని గుర్తించండి. ఆర్థిక వ్యవహారాల పట్ల స్పష్టతతో ఉండండి. విషయాల పట్ల అవగాహనతో కూడిన నిర్ణయాలు ప్రయోజనం చేకూరుస్తాయి. పెద్దల ఆశీస్సులు మీకు కలిసొస్తాయి. దైవ దర్శనం నిమిత్తం కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.


కన్య రాశి (Virgo)


బీ అలర్ట్... ఇవాళ మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ పరిస్థితినైనా జాగ్రత్తగా డీల్ చేయాలి. పెద్దల పట్ల గౌరవం, పని పట్ల అంకితభావం అవసరం. మీ రిలేషన్‌షిప్‌లో ఏ సమస్య ఉండదు. మీ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకున్నట్లుగానే సాగుతాయి. 


తులా రాశి (Libra)


భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. స్వార్థం, నెగటివిటీ దూరం పెట్టండి. మీ ప్లాన్స్‌ను ఆచరణలో పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పదేపదే జాబ్స్ మారడం మంచిది కాదు. మీ కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. ఆరోగ్యపరంగా హెల్త్ చెకప్ అవసరం కావొచ్చు. మీ ప్రియమైన వ్యక్తుల సలహాలు, సూచనలు వింటే మంచి జరుగుతుంది.


వృశ్చిక రాశి (Scorpio)


ఉద్యోగస్తులు ఇవాళ ఆఫీసులో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు.  ప్రొఫెషనల్ విషయాల్లో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మీరు చెప్పాలనుకున్న విషయాల పట్ల సంకోచం అవసరం లేదు. వ్యాపారస్తులు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు. ప్రయోగాత్మక ప్రయత్నాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది, 


ధనుస్సు రాశి (Sagittarius)  


పెట్టుబడులు పెట్టేవారికి ఇవాళ అనుకూల సమయం. అయితే బడ్జెట్ పరిమితులు ఏర్పరుచుకోండి. లెక్కలేనంత డబ్బు కుమ్మరించవద్దు. రిలేషన్‌షిప్స్ మునుపటికన్నా మెరుగవుతాయి. పని పట్ల ఫోకస్ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలతో నష్టపోయే ప్రమాదముంది. ఆర్థిక వ్యవహారాల పట్ల ఆచీ తూచీ వ్యవహరించాలి. స్నేహితుల నుంచి అప్పు తీసుకోవద్దు. 


మకర రాశి (Capricorn) 


ఇవాళ మీకు అనుకూల సమయం. చేపట్టిన ప్రతీ పనిలో సక్సెస్ పొందుతారు. ఆర్థికంగా చాలా మెరుగైన స్థితి ఉంటుంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం మానేస్తారు. మీలోని ప్రతిభను, ఇన్నాళ్లు మీకే తెలియని పట్టుదలను చూస్తారు. ఉద్యోగ, వ్యాపారస్తులు మెరుగ్గా రాణిస్తారు. వ్యాపారంలో వృద్ధి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.


కుంభ రాశి (Aquarius)


దీర్ఘకాలిక ప్లాన్స్ కలిసొస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో లాభాలు పొందుతారు. మీ ప్రియమైన వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు బాగా ఇష్టపడే వ్యక్తులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఓవరాల్‌గా ఇవాళ మీకు మంచి జరుగుతుంది. చాలాకాలంగా ఇంటికి రాని బంధువులు ఇవాళ మీ ఆతిథ్యం కోరి రావొచ్చు.


మీన రాశి (Pisces) 


ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. బిజినెస్ విస్తరణకు ప్లాన్స్ వేస్తారు. ఆదాయం పెరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ అవసరం. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు. ఏదైనా సూటిగా మాట్లాడటమే మంచిది. కొన్ని విషయాల్లో ఆచీ తూచీ స్పందించాలి. 


(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)


Also Read: Teenmar Mallanna: తాగుబోతులు రెండు రోజులు స్ట్రైక్ చేస్తే కేసీఆర్ కు గుండెపోటే! 


Also Read: Rashmika Mandanna Pics: రష్మిక మందన్న హాట్ అలెర్ట్.. క్లీవేజ్ అందాలతో మతిపోగోడుతుందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook