Shani Trayodashi 2021: ఆర్థిక నష్టాలు, కోరికలు తీరకపోవటం, వ్యాపారాల్లో నష్టాలు, శత్రువుతో ఇబ్బందులు, కోర్టు కేసుల్లో సమస్యలు మరియు ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వంటి ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారంటే దానికి కారణం "శనిదోషం" (Shani Dosham). ఈ రోజు శని త్రయోదశి... అంటే శని దోషాన్ని నివారించే ఉత్తమమైన రోజని చెప్పవచ్చు. సెప్టెంబర్ 4న శని త్రయోదశి (శనిదేవుడి స్తోత్రం పఠిం) కావున ఇలాంటి నియమాలతో కూడిన పూజలు చేస్తే శని దోషం పోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దోషాలలో రకాలు: 
శని దోషాలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. వీటిలో "ఏలిన నాటి శని" (Alina nati shani dosham), "అష్టమ శని దోషాలున్న" (Ashtama shani dosham) వారు శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు ఎందుకంటే శని త్రయోదశి అనగా శనిదేవుడు జన్మించిన తిథి.. అందువలన ఈ రోజు శని దేవుడుని పూజిస్తే అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందుతారని పండితులు చెప్తున్నారు. నల్ల నువ్వులు దానం చేయటం, నువ్వుల నునేతో శని దేవుడుకి అభిషేకం చేయటం మరియు శని దేవుడి వాహనం అయినట్టి కాకికినైవేద్యం పెట్టడం వంటివి చేయటం వలన శని దేవుడు అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. 


Also Read: Nagarjuna on Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌పై హోస్ట్ నాగార్జున ఏమంటున్నాడంటే..


పూజ నియమాలు: 
పండితులు చెప్పినదాని ప్రకారం, శని త్రయోదశి రోజున శని దేవుడి గుడికి వెళ్లి పూజ చేస్తే సమస్యలన్ని పోవచ్చు. ఒకవేళ మీరు శని దేవుడు ఆలయానికి వెళ్లే అవకాశం లేకపోతే ఇంట్లో పూజ గదిలోనే శని దేవుడు ఫోటో లేదా విగ్రహానికి పూజ చేయండి. మీరు కానీ పూజ చేయటానికి ఆలయానికి వెళ్తే మాత్రం పూజ చేసిన తరువాత తిరిగి వెళ్లేపుడు వెనక్కి చూడకూడదు. అలా చేస్తే శని దేవుడు ఆగ్రహానికి లోనై చేసిన పూజలన్ని వ్యర్థం అవుతాయని పండితులు చెప్తున్నారు. కావున శని దేవుడి ఆలయానికి వెళ్ళినపుడు ఈ నియమం తప్పక గుర్తుపెట్టుకోండి. 


శనిదేవుడి స్తోత్రం పఠనం: 
శినిదేవుడి పూజలో శనిదేవుడి స్తోత్రం పఠించాలి. ఇలా రోజు కనీసం 10 సార్లు అయిన శనిదేవుడి స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.. ఈ రోజు శని త్రయోదశి కాబట్టి ఈ స్తోత్రం పఠిస్తే పది రేట్ల ఫలితాలు పొందవచ్చని పండితులు వాపోతున్నారు. ఆ స్తోత్రం ఏంటంటే "నీలాంజన సమాభాసం... రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం... తం నమాని శనైశ్చరం". ఈ రోజు 10 సార్లు పఠించి మంచి ఫలితాలను పొందండి


Also Read: Whatsapp Account: కఠిన చర్యలకు దిగిన వాట్సప్, 3 మిలియన్ల ఖాతాలు నిషేధం


ఉపవాస దీక్షలు: 
శని ప్రదోష ఉపవాస సమయంలో శివుడిని, శివ నామ స్మరణ చేస్తే కూడా మంచి ఫలితలను పొందుతారు. ఈ శని త్రయోదశి రోజున అన్ని నియమాలు నిష్టగా పాటిస్తే అన్ని కష్టాలు వైదొలిగి సంతోషంగా ఉంటారు. శని త్రయోదశి సెప్టెంబర్ 4న ఉదయం 8.24 నుంచి సెప్టెంబర్ 5 రాత్రి 8.21 మధ్య ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా నవగ్రహ (Navagraha)ఆరాధన మరవకూడదు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook