Medaram Hundi: మేడారం జాతరకు కానుకల వెల్లువ.. కాసుల వర్షం.. గతం కంటే అత్యధికంగా ఆదాయం
Medaram Hundi Income: కోరిన కోరికలు ఇచ్చే అడవి తల్లులను తండోపతండాలుగా వచ్చి దర్శించుకున్న భక్తులు అదే స్థాయిలో కానుకలు వేశారు. ఈసారి మేడారం జాతరకు గతానికి కన్నా భారీగా ఆదాయం వచ్చింది. ఈసారి ఎంత ఆదాయం వచ్చిందంటే...?
Medaram Hundi: ఇటీవల ముగిసిన మేడారం మహా జాతరకు కోట్లాది మంది భక్తులు తరలిరాగా.. వారు కోరికలతోపాటు భారీగా కానుకలు సమర్పించారు. అమ్మవార్లకు తమకు తోచిన రీతిలో కానుకలు ఇచ్చారు. ఈ జాతరకు గతానికంటే అత్యధికంగా కానుకలు వచ్చాయి. దీంతో వారం పాటు హుండీలు లెక్కపెట్టడానికి సమయం పట్టింది. తాజాగా హుండీ లెక్కింపు పూర్తవడంతో వచ్చిన ఆదాయం వివరాలు అధికారులు వెల్లడించారు.
Also Read: Woman Wish: 'మా ఆయన బెట్టింగ్ మానేయాలి'.. సమ్మక్క తల్లికి భార్య రాసిన కోరిక వైరల్
ములుగు జిల్లాలోని మేడారంలో నాలుగు రోజుల పాటు ( ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో) అంగరంగ వైభవంగా సమ్మక్క, సారక్క జాతర జరిగిన విషయం తెలిసిందే. దాదాపు కోటిన్నర భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతర సమయంలో ఏర్పాటుచేసిన హుండీలను మేడారం నుంచి హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కల్యాణ మండపానికి తరలించారు. మొత్తం 540 హుండీలు ఉండగా 450 వాలంటీర్లతో హుండీ లెక్కింపు చేపట్ఆరు. ఫిబ్రవరి 29వ తేదీ నుంచి దేవాదాయ శాఖ అధికారులు ప్రారంభమైన హుండీ లెక్కింపు బుధవారం (మార్చి 6)తో ముగిసింది. వారం రోజుల పాటు నిరాటంకగా సాగిన హుండీ లెక్కింపులో ఆదాయ వివరాలు తేలాయి.
Also Read: Tirumala: వేసవికి కుటుంబంతో తిరుమల వెళ్తున్నారా..? వచ్చే నాలుగు నెలలు ఇవే ప్రత్యేక సేవలు
మేడారం జాతర హుండీ లెక్కింపు ద్వారా మొత్తం రూ.13.25 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక బంగారు, వెండి విషయానికి వస్తే.. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండిని భక్తులు కానుకలుగా ఇచ్చారు. మేడారం ఆలయ ఈవో రాజేంద్రం సమక్షంలో హుండీ లెక్కింపు సజావుగా జరిగింది. కాగా గత జాతర (2022) హుండీ ఆదాయం రూ.11.44 కోట్లు రాగా.. ఈసారి గతం కంటే అధికంగా వస్తుందని అధికారులు వేసిన అంచనా నిజమైంది. గతం కంటే ఈసారి రెండు కోట్ల అదనంగా ఆదాయం రావడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి