Solar Eclipse and Viashaka Amavasya on 20th April 2023 : ఖగోళ సంఘటనలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఎంతో ముఖ్యమైనవి. అంతేకాకుండా వీటి రెండింటినీ జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైనవి పేర్కొన్నారు. గ్రహాలు ఏర్పడినప్పుడు, గ్రహాలు సంచారం చేసినప్పుడు పలు రాశులవారి జీవితాల్లో తప్పకుండా మార్పులు జరుగుతాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో వీటికి ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. అయితే కొత్త సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న  వైశాఖ అమావాస్య ఏర్పడబోతోంది. ఇదే రోజు అమావాస్య కావడంతో ఈ గ్రహణానికి హైబ్రిడ్ సూర్యగ్రహణం అని పేరు వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ క్రమంలో ఒక్కటే గ్రహణం ఏర్పడిన 3 సూర్యగ్రహణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఏప్రిల్ 20న ఏర్పడబోయే సూర్యగ్రహానికి శాస్త్రవేత్తలు హైబ్రిడ్ సూర్యగ్రహణం అని పేరు పెట్టారని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన దేశంలో సూర్యగ్రహణ సమయాలు:
ఈ నెలలోనే 20 తేది గురువారం మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.. భారత్‌ టైం ప్రకారం ఉదయం 7:04 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇది మన దేశంలో మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. ఇక ఇతర దేశాల విషయానికొస్తే ఆ దేశాల కాలమాన ప్రకారం.. గంట తర్వాత ముగిసే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. సూర్యగ్రహణం వ్యవధి 5 ​​గంటల 24 నిమిషాలు పాటు జరగనుంది.  ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయిన ప్రభావం పడే అవకాశాలన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి సూతక కాలం ఉండకపోవచ్చు.


ఇది కూడా చదవండి: Guru Uday 2023: ఏప్రిల్ లో ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీ రాశి కూడా ఉందా?


3 సూర్యగ్రహణాలు ఎలా కలిపిస్తాయి..?:
ఈ ఏప్రిల్‌ 20వ తేది జరగబోయే గ్రహానికి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే హైబ్రిడ్ గ్రహణం కావడంతో మూడు రూపాల్లో కనిపించే అవకాశాలున్నాయి. మూడు రూపాల్లో అంటే చాలా మందికి సందేహం కలుగొచ్చు. మొదటగా ఇది  పాక్షికంగా కనిపిస్తుంది. ఆ తర్వాత సంపూర్ణ, వార్షిక గ్రహణంగా ఏర్పడుతుంది. దీనినే శాస్త్రీయ భాషలో హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటారు. ఒక శాస్త్రీయ భాషలో చంద్రుడు సూర్యుని ఎదురుగా వచ్చి దాని కాంతిని ప్రభావితం చెందుతుంది ఇలా ఏర్పడడాన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అంతేకాకుండా దీనిని  రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. కాబట్టి ఈ గ్రహం ప్రభావిత దేశాల్లో మొత్తం చీకటి అవుతుందని నిపుణులు చెబతున్నారు.


హైబ్రిడ్ సూర్యగ్రహణం ఇలా ఏర్పడబోతోంది:
ఈ సారి ఏర్పడబోయే సూర్యగ్రహాణం చాలా ప్రాంతాల్లో పాక్షిక, సంపూర్ణంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహణం కారణంగా 3 దృశ్యాలు కనిపిస్తాయి. కాబట్టి వాతావరణంలో చిన్న చిన్న మార్పులు జరిగే ఛాన్స్‌ ఉంది. ఇలా హైబ్రిడ్ సూర్యగ్రహణం 100 ఏళ్లకు ఒకసారి కనిపిస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. భూమి నుంచి చంద్రుడు ఎక్కువ దూరం ఉన్నప్పుడు ఇలా ఏర్పుడుతుంది. కాబట్టి ఈ గ్రహణానికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి: Sun transit 2023: సూర్యుడి గోచారం ప్రభావం, ఏప్రిల్ 14 నుంచి ఆ 5 రాశులకు మహర్దశ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook