Yadadri Temple: తిరుమల స్థాయిలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గుర్తింపు లభిస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఆదాయమే కాకుండా కానుకలు భారీగా వస్తున్నాయి. వస్తు, ధనరూపంలో విరాళాలు వస్తుండగా.. తాజాగా ఓ దంపతులు యాదాద్రి ఆలయానికి ఏకంగా భవనాన్ని ఇచ్చేశారు. తమ ఇంటిని యాదాద్రి ఆలయానికి విరాళం అప్పగించారు. ఆలయానికి భవనం విరాళం ఇవ్వడం ఆసక్తికరంగా నిలిచింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Maha Shivratri: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజున ఏ ఉత్సవమో తెలుసా?


హైదరాబాద్‌లోని చైతన్యపురికి చెందిన శారద, హనుమంత రావు దంపతులు సోమవారం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి తమకు చెందిన భవనం పత్రాలను అప్పగించి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వాళ్లు ఇచ్చిన భవనం విలువ రూ.3 కోట్లు ఉంటుంది. 260 గజాల్లో రెండంతస్తుల భవనం ఇచ్చారు. హనుమంతరావు ఇంజనీర్‌గా పదవీ విరమ పొందారు. వారికి చెందిన ఇద్దరు కుమారులు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు కాగా విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో హైదరాబాద్‌లో ఇద్దరు దంపతులే ఉంటున్నారు. వాళ్లు కూడా విదేశాలకు వెళ్లే యోచనలో ఉండడంతో భవనాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Medaram Jathara 2024: భక్త జనసంద్రంగా మేడారం.. మహా జాతర ఫొటో గ్యాలరీ


చైతన్యపురిలోని భవనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను యాదగిరిగుట్ట దేవస్థన అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఈవో ఎం రామకృష్ణా రావుకు ఇచ్చారు. ఈ సందర్భంగా పత్రాలకు పూజలు చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవడంతో భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నిత్య పూజా కైంకర్యాలతో ఆలయానికి రూ.28,18,641 మేర ఆదాయం అందిందని ఆలయ అధికారులు వెల్లడించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి